ఏషియన్ గేమ్స్ 2026 మహిళల క్రికెట్ తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్‌ను శ్రీలంక ఓడించింది. ఈ హైస్కోరింగ్ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 177/4 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించింది. భారత్, బంగ్లాదేశ్ మ్యాచులో విజేతతో.. శ్రీలంక గోల్డ్ మెడల్ మ్యాచ్ (ఫైనల్) ఆడనుంది.
మా ప్రతీకారం తీవ్రస్థాయిలో ఉంటుంది.. పాకిస్థాన్‌కు హౌతీల వార్నింగ్.. సౌదీకి మద్దతుగా రంగంలోకి దిగొద్దని హెచ్చరిక
సౌదీ అరేబియాపై యెమెన్ హౌతీల దాడుల వేళ.. తమ మిత్రదేశానికి మద్దతుగా సైనికంగా రంగంలోకి దిగే ఆలోచనలో ఉన్నట్లు పాకిస్థాన్, టర్కీ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాలకు హౌతీలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీకు సరిహద్దులు లేని ప్రాంతంలో, అనవసరంగా జోక్యం చేసకుంటే.. తీవ్రంగా ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించారు. మీ పని మీరు చేసుకోండి.. అనవసరంగా ఈ వ్యవహారంలో తల దూర్చకండి అని వార్నింగ్ ఇచ్చారు.
భీమిలి కేజీబీవీ బాలికల హాస్టల్‌లో కలకలం.. 10 మంది విద్యార్థినుల జడల కత్తిరించారు.. మిస్టరీగా మారిన ఘటన
Braids Of 10 School Girl Students Cut In KGVB Bheemili: విశాఖ జిల్లా భీమిలి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం హాస్టల్‌లో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు తొమ్మిదో తరగతి చదువుతున్న పదిమంది విద్యార్థినుల జడలు కత్తిరించారు. గత బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.. తాజాగా బయటపడింది. అలాగే కేవలం ఒక్క జడ వేసుకున్న బాలికల జడలనే కత్తిరించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.. ఇవాళ తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. స్పోర్ట్స్ కోటా ప్రభుత్వ ఉద్యోగాలకు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు స్కిల్ టెస్ట్ తప్పనిసరి
AP Govt Skill Test For Sports Quota Jobs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు, అడ్మిషన్లకు స్కిల్ టెస్ట్ తప్పనిసరి చేశారు. ఈ మేరకు స్పోర్ట్స్ కోటా స్కిల్ టెస్ట్‌కు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల అడ్మిషన్ల విషయంలో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో కొత్తగా 9 రైల్వే లైన్‌లు.. సికింద్రాబాద్ టు శ్రీశైలం.. రాజంపేట నుంచి నేరుగా నెల్లూరుకు.. దొనకొండ టు ఒంగోలు
Andhra Pradesh Nine New Railway Lines Proposed: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఈ మేరకు కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలపై సర్వే, డీపీఆర్‌లు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో వివిధ పోర్టులకు కనెక్టివిటీ కోసం.. ఈ కొత్త ప్రాజెక్టుల ఫైనల్ లొకేషన్ సర్వేలు, డీపీఆర్ తయారీపై రైల్వేశాఖ దృష్టి పెట్టింది. వీటిలో సికింద్రాబాద్ టు శ్రీశైలం, రాజంపేట టు నెల్లూరు ముఖ్యమైనవి.
తినగానే ఛాతీ, కడుపులో మంటగా ఉంటోందా, వేధించే అసిడిటీ తగ్గేందుకు కొన్ని చిట్కాలుపాటిస్తే చాలు
ఆహారం తినగానే, ఏవైనా డ్రింక్స్ తాగగానే చాలా మందికి మండుతున్నట్లుగా కడుపు మొత్తం టైప్‌గా అనిపిస్తుంది. మరికొంతమందికైతే లోపలి నుంచి ఆమ్లాలు పైకి ఎగసి వస్తాయి. కాస్తా తిన్నా కూడా ఇలానే జరుగుతుంది. దీంతో ఆకలిగా ఉన్నా కూడా తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు.
అసలు ఎందుకు తినగానే ఛాతీ, గొంతులో నొప్పి, మంట రావడానికి కారణం అన్నవాహిక అడుగు భాగంలో లోయర్ ఎసోఫేజియల్ స్ఫింక్టర్ అనే కండరాల వలయం ఉంటుంది. ఇది కడుపులోని ఆమ్లాన్ని కిందనే ఉంచేందుకు వన్ వే కవాటంలా పనిచేస్తుంది. కానీ, ఆ కవాటం బలహీనపడినప్పుడు, జీర్ణాశయ ఆమ్లం అనేది పైకి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో సున్నితమైన అన్నవాహిక కణజాలాన్ని కాల్చేస్తుంది. అసలు ఇలా కావడానికి కారణాలు ఏంటో పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అసలు ఎందుకు తినగానే ఛాతీ, గొంతులో నొప్పి, మంట రావడానికి కారణం అన్నవాహిక అడుగు భాగంలో లోయర్ ఎసోఫేజియల్ స్ఫింక్టర్ అనే కండరాల వలయం ఉంటుంది. ఇది కడుపులోని ఆమ్లాన్ని కిందనే ఉంచేందుకు వన్ వే కవాటంలా పనిచేస్తుంది. కానీ, ఆ కవాటం బలహీనపడినప్పుడు, జీర్ణాశయ ఆమ్లం అనేది పైకి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో సున్నితమైన అన్నవాహిక కణజాలాన్ని కాల్చేస్తుంది. అసలు ఇలా కావడానికి కారణాలు ఏంటో పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సౌదీ అరేబియాలో ఉద్రిక్త పరిస్థితులు.. హౌతీల క్షిపణి దాడి, విమానాశ్రయం సమీపంలో భారీ మంటలు
మిడిల్ ఈస్ట్‌లో రోజురోజుకూ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. హౌతీల దాడులతో ఇటు సౌదీ, అటు యెమన్ ప్రాంతాల్లో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. తాజాగా సౌదీ రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ మంటలు చెలరేగాయి. హౌతీలు బాలిస్టిక్ క్షిపణితో దాడి చేయగా.. ఆ దాడిని తిప్పికొట్టినట్లు సౌదీ సంకీర్ణ దళాలు వెల్లడించాయి. అయితే, పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయంటూ సౌదీలోని తమ రాయబార కార్యాలయానికి అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలో టిడ్కో ఇళ్ల సముదాయాలలో పోలీస్ ఔట్‌పోస్ట్‌లు, పీహెచ్‌సీలు, స్కూళ్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Govt To Set Up Schools And Anganwadi Centres In TIDCO Housing Complexes: ఏపీ ప్రభుత్వం టిడ్కో నివాస సముదాయాల దగ్గర మౌలిక సదుపాయలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. టిడ్కో ఇళ్లకు పోలీసు రక్షణ ఔట్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. పోలీసు ఔట్‌పోస్ట్‌లతోపాటు పీహెచ్‌సీల ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీలు కూడా రానున్నాయి. మొత్తం రూ.626 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశారు..అంతేకాదు రేషన్‌షాపుల్ని ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర వాయుగుండం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు
Andhra Pradesh Weather Today: ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది.. ఇది వాయుగుండంగా బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 22 నాటికి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడి 23న ఉత్తరాంధ్రకు సమీపంలో తీరం దాటుతుందని తెలిపారు. నేటి నుంచి కోస్తాలో వర్షాలు పెరుగుతాయంటున్నారు.. ఈ నెల 21 నుంచి భారీవర్షాలు కురుస్తాయన్నారు. అంతేకాదు తీరం వెంట గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు.
రాశిఫలాలు 20 సెప్టెంబర్ 2026: సౌభాగ్య యోగం, సూర్య దేవుని అనుగ్రహంతో వృషభం సహా ఈ 5 రాశులకు ఐశ్వర్యం పెరిగే అవకాశాలు
రాశిఫలాలు 20 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు సౌభాగ్య, శోభన యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది సూర్య గ్రహానికి అంకితం ఇవ్వబడిన రోజు. ఈ శుభ సమయంలో వృషభం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

