Home Blog Page 141

Today Panchangam 21 September 2026: ఈరోజు నక్షత్రం, తిథి, యోగం, శుభ ముహుర్తాలు, రాహుకాలం వివరాలివే

0
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని దశమి తిథి నాడు, సోమవారం ఈరోజున అభిజిత్ ముహుర్తం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కెనడా నుంచి సంపన్న రాష్ట్రం విడిపోనుందా..? అమెరికాతో సరిహద్దు పంచుకునే అల్బెర్టాపై ట్రంప్ కన్ను పడిందా..?

కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చేద్దాం.. అంటూ గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హేళనగా మాట్లాడిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది కదా. అమెరికా అధ్యక్షుడి మాటలతో నొచ్చుకున్న కెనడా.. ఇప్పుడు యూరప్‌కు ఎలా దగ్గర అవుతున్నదో చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు కెనడాలోని ఓ పెద్ద రాష్ట్రం, అది కూడా అమెరికాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం.. అంతే కాదు.. విస్తారమైన చమురు నిల్వలతో ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న రాష్ట్రం కెనడా నుంచి విడిపోయే ఆలోచనలో ఉంది.

అజిత్ అగార్కర్ రాజీనామా చేశాడా.. రోహిత్ శర్మ వివాదమే కారణమా?

0
టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవి నుంచి అజిత్ అగార్కర్ వైదొలిగినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ విషయాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం, బీసీసీఐ, ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో విబేధాలు రావడమే ఇందుకు కారణమని వార్తలు వస్తున్నాయి. లార్డ్స్ వన్డే తర్వాత రోహిత్‌ను పక్కన పెట్టాలని అగార్కర్ భావించినా, బోర్డు పెద్దలు రోహిత్‌కు మద్దతు ఇవ్వడంతో అగార్కర్ తీవ్ర అసంతృప్తి చెందాడు. కీలకమైన టీమిండియా రివ్యూ మీటింగ్‌కు కూడా అగార్కర్ హాజరుకాకపోవడంతో అతడి రాజీనామా ఖాయమైంది!

మహిళల టీ20 క్రికెట్‌లో స్మృతి మంధాన వరల్డ్ రికార్డ్!

0
ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 19 బంతుల్లో 37 పరుగులు (5 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన స్మృతి మంధాన మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్ దిగ్గజం సూజీ బేట్స్ (4,758 పరుగులు) రికార్డును దాటి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచులో విజయం సాధించిన భారత్.. గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు చేరుకుంది. శ్రీలంకతో ఫైనల్ పోరు జరగనుంది.

ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 6 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేస్తే 11 పీఆర్సీ ప్రయోజనాలు

0
ఏపీలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని, అర్హులైన సిబ్బందికి ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ కింద స్పెషల్‌ గ్రేడ్‌ పోస్టు స్కేల్‌ మంజూరు చేయనున్నట్లు తెలిపింది. 11వ వేతన సవరణ సంఘం నిబంధనల ప్రకారం ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది ప్రమోషన్ కాకుండా నిర్దిష్ట సర్వీస్ కాలానికి లభించే ఆర్థిక ప్రయోజనం కావడం ఈ ఉత్తర్వుల్లో కీలక అంశం.

రాత్రిపూట మాటి మాటికీ మూత్ర విసర్జన కోసం లేస్తున్నారా, అసలు నైట్ టైమ్ ఎన్నిసార్లు యూరిన్‌కి వెళ్తే ప్రమాదమో తెలుసా?

0
రాత్రి నిద్రపోతున్న సమయంలో మూత్రవిసర్జన కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు మెలకువ రావడాన్ని వైద్యపరంగా ‘నాక్టూరియా’ (Nocturia) అంటారు. సాధారణంగా ఏదో కారణం వల్ల నిద్రలేచి “సరేలే కదా” అని బాత్రూమ్‌కు వెళ్లడానికి, నాక్టూరియాకు తేడా ఉంది. నాక్టూరియా ఉన్న వ్యక్తి మూత్రం ఆపుకోలేక మాత్రమే నిద్రలేస్తాడు, మూత్రవిసర్జన తర్వాత మళ్లీ పడుకుంటాడు. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు, కానీ వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

ఇది కేవలం బాత్రూమ్‌కు వెళ్లడం మాత్రమే కాదు. మాటిమాటికీ నిద్రలేవడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది, పగటిపూట విపరీతమైన అలసట, పనిపై ఏకాగ్రత లేకపోవడం, జీవన ప్రమాణాలు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. దీని వెనుక మూత్రాశయం (బ్లాడర్), మూత్రపిండాలు (కిడ్నీలు), హార్మోన్లు, నిద్రలేమి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కారణమై ఉండవచ్చు. దీనిపై ఉన్న సందేహలతో పాటు పూర్తి సమాచారాన్ని డాక్టర్ శశాంక్ ఎమ్ ఎస్ (కన్సల్టెంట్ – యూరాలజీ & కిడ్నీ మార్పిడి విభాగం, ఆస్టర్ సిఎమ్ఐ హాస్పిటల్, బెంగళూరు) అందించారు.

భారతీయ టెకీలకు ట్రంప్ మరో షాక్‌.. హెచ్‌-1బీపై లక్ష డాలర్ల ఫీజు పొడిగింపు, మరింత కఠినంగా పరిశీలన!

హెచ్‌-1బీ నిబంధనలు మరింత కఠినంగా మార్చుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. 2025లో తీసుకొచ్చిన 1 లక్ష డాలర్ల చెల్లింపు నిబంధనను మరో ఏడాది పొడిగించారు. అదే సమయంలో హెచ్‌-1బీ దరఖాస్తుల పరిశీలనను మరింత కఠినతరం చేస్తూ ట్రంప్‌ మరో ఉత్తర్వు జారీ చేశారు. ఉద్యోగాల కోతలు, అమెరికన్ల స్థానంలో విదేశీ ఉద్యోగులను నియమించే అవకాశాలు వంటి అంశాలను పరిశీలించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ పరిణామాలు భారతీయ టెక్‌ నిపుణులు, అమెరికన్‌ కంపెనీలపై ప్రభావం చూపే అవకాశముంది.

గణేష్ నిమజ్జనాల్లో డీజే మోత.. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో గుండెపోటుతో ఐదుగురు మృతి, రఘురామ కీలక నిర్ణయం

0
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వినాయక నిమజ్జన వేడుకలు విషాదాన్ని మిగులుస్తున్నాయి. నిమజ్జన ఊరేగింపుల సందర్భాల్లో పలువురు ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో డీజేల మోతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తి, శ్రద్ధలు, ఆనందాలు, కోలాహలాలతో సాగాల్సిన వినాయక నిమజ్జనాల్లో జరుగుతున్న ఇలాంటి విషాదాలు.. తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు తన ఉండి నియోజకవర్గంలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

సన్నగా, పొడవుగా విచిత్ర దేశం.. విశేషాలు బోలెడు.. ఆఫ్రికా ‘స్థాయి’ పెంచిన టోగో!

ఆఫ్రికా పశ్చిమ తీరంలోని చిన్న దేశాల్లో టోగో ఒకటి. ఈ దేశం సన్నగా, పొడవుగా ఉండి విచిత్ర ఆకారంలో ఉంటుంది. ఈ దేశ రాజధాని లోమే పొరుగు దేశమైన ఘనాకు అత్యంత చేరువగా ఉంటుంది. తీర ప్రాంతంలో 56 కిలోమీటర్ల వెడల్పు.. 579 కి.మీ. పొడవు ఉండే ఈ దేశం చిన్నదే అయినప్పటికీ.. 40కిపైగా విభిన్న తెగల ప్రజలు ఈ దేశంలో నివసిస్తున్నారు. ఈ దేశ జనాభా కోటికి చేరువగా ఉంటుంది.

బాదేసిన షెఫాలీ.. తిప్పేసిన స్పిన్నర్లు.. ఫైనల్ చేరిన భారత్..!

0
ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో భారత మహిళల జట్టు 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. షెఫాలీ వర్మ (100 నాటౌట్, 9 సిక్సర్లు) తొలి టీ20ఐ సెంచరీతో భారత్ 195/4 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ను దీప్తి శర్మ (3/7), నందని శర్మ (3/25) దెబ్బ కొట్టారు. దీంతో బంగ్లాదేశ్.. కేవలం 15.4 ఓవర్లలోనే 81 రన్స్‌కు ఆలౌట్ అయింది.