Home Blog Page 140

ఫ్యాటీ లివర్ + కాలేయ వాపు తగ్గడానికి తినాల్సిన 7 రకాల వెజ్ ఫుడ్స్, డాక్టర్ ప్రకారం ఏమేం తినాలో తెలుసా?

0
శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో లివర్ అదేనండీ కాలేయం ఒకటి. శరీరంలో ఎక్కువగా కష్టపడి పనిచేసేది కూడా లివరే. కాలేయం రక్తం నుంచి వ్యర్థాలు, టాక్సిన్లు బయటక పంపడం, జీర్ణక్రియకు తోడ్పడే పిత్తరసాన్ని విడుదల చేయడం, విటమిన్లు, ఖనిజాల్ని నిల్వ ఉంచడం వంటి ఎన్నో కీలక పనుల్ని నిర్వరిస్తుంది. సాధారణంగా కాలేయం తనను తాను స్వయంగా శుభ్రపరుచుకునే (Self-cleaning) సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

అయినప్పటికీ, సమతుల్య ఆహారం (Balanced Diet) తీసుకోవడం ద్వారా కాలేయ పనితీరును మరింత మెరుగుపరచవచ్చు. ఫ్యాటీ లివర్ వంటి సమస్యల నుంచి రక్షించుకోవచ్చు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, లీన్ ప్రొటీన్లు ఉండే మెడిటరేనియన్ తరహా ఆహారపు అలవాట్లు కాలేయానికి ఎంతో మేలు చేస్తాయి. లివర్ సమస్యల నుంచి కాపాడేందుకు తినాల్సిన వెజ్ ఆహారాల గురించి డాక్టర్ రమాకాంత్ రెడ్డి ఎ (కన్సల్టెంట్ – మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, గ్లెనెగల్స్ అవేర్ హాస్పిటల్ (ఫోర్టిస్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్), ఎల్.బి. నగర్, హైదరాబాద్) వివరించారు. ఆ ఫుడ్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.

తిరుమల శ్రీవారి భక్తులకు రూ.2 లక్షల బీమా సరిపోదు.. రూ.10 లక్షలు ఇవ్వాలి: విజయసాయిరెడ్డి

0
Vijayasai Reddy On Tirumala Devotees Insurance: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ బీమా సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బీమా పరిహారాన్ని పెంచాలంటున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రస్తుతం భక్తులకు అందిస్తున్న రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఏమాత్రం సరిపోదని..భక్తులకు బీమా కవరేజి కనీసం రూ.10 లక్షలకు పెంచాలని విజయసాయిరెడ్డి సూచించారు. తిరుమల ప్రతి ఏటా లక్షలమంది భక్తులు వస్తున్నారని.. అందుకే బీమా కవరేజిని పెంచాలని కోరారు.

ఏపీలో స్కూల్ విద్యార్థులు ఆధార్ అప్డేట్ చేసుకోండి.. పూర్తిగా ఉచితం, నేటి నుంచే స్పెషల్ డ్రైవ్ ప్రారంభం

0
AP Special Aadhaar Camps September 21 For Students: ఏపీలో విద్యార్థుల్ని అధికారులు మరోసారి అలర్ట్ చేశారు. ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేసుకోనివారికి మరో అవకాశం కల్పించారు. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 20 వరకు ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు ఉచితంగా అందిస్తున్నారు. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల లోపు వారు.. 15 ఏళ్ల నుంచి 17 ఏళ్లలోపు వారు వివరాలు అప్డేట్ చేయాలని సూచిస్తున్నారు.

ఏషియన్ గేమ్స్ 2026 డే 1 హైలైట్స్.. షూటింగ్‌లో 2 రజతాలు..!

0
జపాన్‌లోని ఐచి-నాగోయా ఏషియన్ గేమ్స్ 2026 తొలి రోజు భారత్ రెండు రజత పతకాలతో అద్భుత బోణీ కొట్టింది. విమెన్స్ 10మీ ఎయిర్ రైఫిల్ ఇండివిజువల్, టీమ్ ఈవెంట్లలో ఇలవేనిల్ వలరివన్ రెండు రజతాలు అందించింది. ఎంఎంఏలో సుచిక సెమీస్ చేరి పతకం ఖాయం చేసింది. మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ చేరగా, హాకీలో పురుషులు (13-1), మహిళలు (19-0) ఘనవిజయాలు సాధించారు. రెండో రోజు కూడా భారత్ ఖాతాలో మరో రజతం చేరింది.

ఏపీలో క్యాన్సర్‌ రోగులకు ఊరట.. రూ.75వేలు టెస్ట్ పూర్తిగా ఉచితం, అధునాతన జన్యు పరీక్షల కోసం ల్యాబ్

0
Free Genetic Tests For Cancer Patients In ANdhra Pradesh: క్యాన్సర్ చికిత్సలో భాగంగా రోగులకు అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు జీజీహెచ్‌ ప్రాంగణంలో నాట్కో క్యాన్సర్ కేర్ సెంటర్‌లో ఈ జన్యు పరీక్షల ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. ఈ జన్యు పరీక్షలు చాలా ఖరీదైనవి కాగా.. ప్రైవేట్ వైద్య సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సేవలను ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఉచితంగా అందించనున్నారు. ఈ నెల 22 నుంచి ఈ ల్యాబ్ అందుబాటులోకి రానుంది.

ఆస్ట్రేలియాను భయపెట్టిన జింబాబ్వే.. అయినా తప్పని ఓటమి..!

0
హరారే వేదికగా జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా 1 వికెట్ తేడాతో జింబాబ్వేపై విజయం సాధించి 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. సికందర్ రజా (81*), ఎర్విన్ (59) రాణించడంతో 271/8 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 272 పరుగుల లక్ష్య ఛేదనలో జోష్ ఇంగ్లిస్ (103) సెంచరీ, నాథన్ ఎల్లిస్ (36*) పోరాటంతో ఆసీస్ 49.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

గుండె జబ్బులు, షుగర్‌కి కారణమయ్యే బెల్లీ ఫ్యాట్‌ని కరిగించే వాకింగ్, ఇప్పుడు చెప్పినట్లు నడిస్తే చాలు

0
​నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం దీర్ఘకాలిక సమస్యలకి ఊబకాయం అనేది ప్రధాన కారణం. అధికబరువు వ్యక్తులకి అనేక సమస్యల్ని తీసుకొచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. మరీ ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు బెల్లీ ఫ్యాట్ గుండె జబ్బులు, షుగర్, జీవక్రియ సంబంధిత సమస్యల్ని పెంచుతుందని తేలింది. అందుకే, దీనిని ముందుగా తగ్గించుకోవాలి. అందుకోసం సరైన లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వడం, మంచి పోషకాహారంతో పాటు వర్కౌట్ కూడా ముఖ్యమే. వర్కౌట్‌‌లో కూడా అందరూ ఈజీగా చేయగలిగేది వాకింగ్. ఈ వాకింగ్‌లో కూడా బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల చాలా వరకూ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని తేలింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

పుట్టుమచ్చలు పోవడానికి సోషల్‌ మీడియాలో వైరలవుతున్న యాపిల్ సైడర్ వెనిగర్‌ చిట్కా మంచిదేనా?

0
పుట్టుమచ్చ కనిపిస్తే దాన్ని ఎలా తొలగించుకోవాలా అని ఆలోచించే వారు చాలామందే ఉంటారు. ముఖ్యంగా ముఖంపై లేదా చేతులు, మెడ వంటి కనిపించే ప్రాంతాల్లో ఉన్న పుట్టుమచ్చల విషయంలో కొందరు ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తుంటారు. సోషల్ మీడియాలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను పుట్టుమచ్చపై రాస్తే అది ఎండిపోయి చివరికి ఊడిపోతుందనే చిట్కా కూడా బాగా ప్రచారంలో ఉంది. ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చని అనిపించినా, ఈ పద్ధతి వల్ల పుట్టుమచ్చ కంటే చర్మానికే ఎక్కువ నష్టం కలగవచ్చని నిపుణులు చెబుతున్నారు.

వెనిగర్‌లోని యాసిడ్‌ చర్మాన్ని కాల్చడం, మంట, ఎర్రబడటం, పొక్కులు, మచ్చలు వంటి సమస్యలకు కారణం కావచ్చు. అంతేకాదు, పుట్టుమచ్చలో ఏదైనా మార్పు ఉంటే దాన్ని ఇంట్లోనే తొలగించే ప్రయత్నం చేయడం వల్ల అసలు సమస్యను గుర్తించడంలో ఆలస్యం కావచ్చు. మరి ఆపిల్ సైడర్ వెనిగర్‌తో పుట్టుమచ్చలను తొలగించడం ఎందుకు ప్రమాదకరం? సురక్షితంగా పుట్టుమచ్చలు పోవాలంటే ఏం చేయాలి? వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..

ఏపీలో 9మంది ఐపీఎస్ అధికారులు బదిలీ.. కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు పోస్టింగ్ ఇచ్చారు

0
Andhra Pradesh 9 Ips Officers Transferred: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నిలకు పోస్టింగ్‌లు ఇచ్చింది. కాంతిరాణాను ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్‌సేఫ్టీ ఐజీగా నియమించింది. విశాల్‌ గున్నికి ట్రైనింగ్‌ డీఐజీగా పోస్టింగ్‌ ఇచ్చింది. రెండు కొత్త జిల్లాలకు ఎస్పీలను నియమించారు.. పల్నాడు జిల్లాకు కూడా ఎస్పీని నియమించారు. అలాగే పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని కూడా బదిలీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు

0
Andhra Pradesh Weather Today: ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి, సోమవారానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలోనే వాయుగుండంగా మారనుందని అంచనా వేస్తున్నారు. మంగళవారానికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. బుధవారం ఉదయానికి తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. మంగళవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుందని అంచనా వేస్తున్నారు.