మురికి పట్టిన, పాడైన మేకప్ బ్రష్‌లను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. మేకప్ బ్రష్‌లకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. దాని ప్రకారం బ్రష్‌లను తరుచూ మార్చాలి.
ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే టైప్ 1 డయాబెటిస్ తగ్గుతుందా, డాక్టర్ చెప్పే నిజమిదే
షుగర్ ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఫుడ్ తినాలి, ఎలా తినాలి? ఏ సమయంలో తీసుకోవాలి. ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుని తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగితే బాడీలో చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు వీటిని పరీక్షించుకుని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే పరిశోధకులు డయాబెటిస్ గురించి అనేక పరిశోధనలు చేస్తున్నారు. దీని గురించి తాజా అధ్యయనాల్లో కొన్ని విషయాలని ప్రస్తావించారు పరిశోధకులు. అదేంటంటే టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుందని చెబుతుండగా ఇది ఏమాత్రం నిజం కాదని చెబుతున్నారు డాక్టర్.
కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇంటి చిట్కాలు, రోజూ ఒక స్పూన్ ఉసిరికాయ పొడి తీసుకుంటే మేలు!
చిన్నగా, పుల్లగా ఉండే ఉసిరికాయను మన ఇళ్లలో చాలాకాలంగా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి ఉసిరికాయ, ఉసిరి రసం, ఉసిరి పచ్చడి, పొడి ఇలా రకరకాలుగా తింటుంటారు. కేవలం రూ.5 కి లభించే చిన్న ఉసిరికాయలో దాదాపు 50 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ C, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. అందుకే ఉసిరిని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేదిగా చెబుతుంటారు. ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ సూపర్ ఫుడ్ గురించి సైన్స్ ఏం చెబుతోందో, నిపుణులు ఏమంటున్నారో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులపై అధికారిక ప్రకటన.. మరో రెండు రోజులు కలిసొచ్చాయి, పూర్తి లిస్ట్ ఇదే!
Andhra Pradesh Dussehra Holidays From 2026 October 12: ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులపై విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉంటాయి.. అక్టోబర్ 10న రెండో శనివారం, అక్టోబర్ 11 ఆదివారం కలిసి రావడంతో విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచే సెలవులు మొదలవుతాయి. మొత్తం 12 రోజులు సెలవులు ఉంటాయి.. దసరా సెలవులు ముగిసిన అనంతరం అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ వర్సెస్ స్పోర్ట్ కోటా టీచర్లు.. పోటాపోటీ నినాదాలు
Vijayawada High Tension In Saap Office: విజయవాడలోని శాప్ కార్యాలయం హైడ్రామా కనిపించింది. మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్‌ను కలిసేందుకు వచ్చారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు శాప్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. స్పోర్ట్స్ కోటా టీచర్లు వాటిని ఖండిస్తూ పోటాపోటీగా నినాదాలు చేశారు..దీంతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
గొడవలు మాత్రం కాదు, భార్యభర్తల మధ్య దూరం పెరగడానికి అసలు కారణం ఏంటో తెలుసా?
కాలం మారుతున్న కొద్దీ వైవాహిక సంబంధాలు బలహీనపడుతున్నాయి. వివాహం బంధం అనేది ఎంతో ప్రత్యేకమైంది. ఈ బంధంలో ఏ పరిచయం లేనిది ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటూ దీన్ని అందంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడటం లేదు. అది పెద్దలు కుదిర్చిన పెళ్లయినా లేదా ప్రేమ వివాహమైనా గత కొన్ని ఏళ్లుగా విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజుల్లో అయితే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి.
పెళ్లైన ఏడాది తిరగకముందే చాలా జంటలు విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. దీని వెనక అనేక కారణాలు ఉన్నప్పటికీ, భార్యభర్తల మధ్య వచ్చే గొడవలే ముఖ్య కారణమని చాలా మంది భావిస్తారు. అయితే, నిజంగా జంటలు కేవలం గొడవల్ల వల్లనే విడిపోతారా? దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో రిలేషన్‌షిప్ కోచ్ బి. స్మిత భోజన్ మాట్లాడుతూ వివాహ బంధం తెగిపోవడానికి గల అసలు కారణాన్ని వివరించారు. ఆ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

