గతేడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన మెగా డీఎస్పీపై ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయని చేస్తోన్న ఆరోపణలను ప్రభుత్వం, ఎంపికైన టీచర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై పలుచోట్ల ఉపాధ్యాయులు ర్యాలీలు నిర్వహించారు. తాజాగా, కుప్పంలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఆయన సవాల్ విసిరారు.
బట్టలు, పుస్తకాల్ని నాశనం చేసే సిల్వర్‌ఫిష్ కీటకాల్ని తరిమికొట్టే సింపుల్ చిట్కాలు!
రాత్రివేళ బాత్రూమ్‌లో లైట్ వేయగానే వెండి రంగులో, చిన్న చేప ఆకారంలో ఉండే ఒక పురుగు వేగంగా గోడల సందుల్లోకో లేదా మూలలకో పరుగెత్తడం చాలామంది చూసే ఉంటారు. దీనిని సాధారణంగా సిల్వర్‌ఫిష్ (Silverfish) అంటారు. ఒకటి కనిపించిందంటే ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయని అర్థం. ఇవి ముఖ్యంగా బాత్రూమ్‌లు, బట్టల అల్మారాలు (వార్డ్‌రోబ్‌లు) అనే రెండు ప్రదేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి బట్టలు, పుస్తకాల్ని నాశనం చేస్తుంటాయి. రెక్కలు లేని, రాత్రిపూట మాత్రమే సంచరించే ఈ కీటకాలు బాత్రూమ్, వార్డ్‌రోబ్‌ల్లోనే ఎందుకు ఎక్కువ కనిపిస్తాయి? వాటిని తరిమికొట్టడానికి పాటించాల్సిన సింపుల్ చిట్కాలేంటో ఇప్పుడు చుద్దాం.
కేసీఆర్, కుమారస్వామిని చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి.. నాదెండ్ల మనోహర్ ఆ మాట అన్నందుకు సిగ్గుపడాలి: దాసరి రాము
Dasari Ramu Comments On Pawan Kalyan Nadendla Manohar: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు కాపు నేత దాసరి రాము. జనసేన పార్టీ బలంగా లేదని నాదెండ్ల ఎలా వ్యాఖ్యానిస్తారని ప్రశ్నించారు. పీఏసీ ఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ గతంలోనే జనసేన పార్టీకి 30శాతం పదవులు, టికెట్లు వస్తాయని చెప్పారని దాసరి రాము చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాము చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగాీ మారాయి.
హౌతీలపై దాడికి సిద్ధమైన అమెరికా.. చివరి నిమిషంలో డొనాల్డ్ ట్రంప్ యూటర్న్
సౌదీ అరేబియాపై ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్ దాడులను తీవ్రతరం చేశారు. నాలుగేళ్ల పాటు కొనసాగిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ జులైలో ముగియడంతో హౌతీలు మళ్లీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీతో రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న పాకిస్థాన్, టర్కీలు.. హౌతీలపై దాడులకు దిగుతాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఇదే సమయంలో అమెరికా సైతం హౌతీల స్థావరాలపై దాడులకు సిద్దమైంది. కానీ, చివరి నిమిషంలో డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.
లాల్‌బాగ్చా రాజా సన్నిధిలో రోహిత్ శర్మ దంపతులు.. మారుమోగిన ముంబై!
భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ, భార్య రితికతో కలిసి ముంబైలోని ‘లాల్‌బాగ్చా రాజా’ గణనాథుడిని దర్శించుకుని పూజలు చేశారు. వీరి రాకతో అభిమానులు ‘రోహిత్.. రోహిత్’ అంటూ పరిసరాలను మారుమోగించారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు రోహిత్. తన అంతర్జాతీయ భవిష్యత్తుపై రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో బప్పా ఆశీస్సులు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశ ప్రజల నిరసనతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం.. రోజుకు 3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందని సర్కారు ఆందోళన
పాకిస్థాన్‌లో ప్రతిపక్ష పీటీఐ, జమాత్-ఇ-ఇస్లామీ పార్టీలు చేపట్టిన ఇస్లామాబాద్ మార్చ్ కారణంగా దేశంలో తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభం నెలకొంది. నిరసనల వల్ల రోడ్ల దిగ్బంధం ఏర్పడి ప్రతిరోజూ 400 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.38,33,81,20,000) నష్టం జరుగుతుందని ప్రభుత్వం హెచ్చరించింది. రాజధాని ప్రవేశ ద్వారాలను కంటైనర్లతో మూసివేసిన అధికారులు, శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు వేగవంతం చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

