రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణ’. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్న నిర్మాత నమిత్ మల్హోత్రాపై ఐటీ దాడులు జరిగాయి. ముంబైలోని ఆయన ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్ కార్యాలయాలు, ఆర్థిక సలహాదారుల ఆఫీసుల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిధుల బదిలీ, ఫారిన్ ట్రాన్సాక్షన్స్‌పై ఆరా తీశారు. ఈ దాడుల ప్రభావంతో ప్రైమ్ ఫోకస్ షేర్ల ధరలు పడిపోయాయని వార్తలు వస్తున్నాయి.
Nana Patekar Movies: ‘పుణ్యభూమి నా దేశం’ నుంచి ‘రంగమార్తండ’ వరకు.. నానా పటేకర్ సినీ ప్రస్థానంలో ‘తెలుగు’ కనెక్షన్!
Nana Patekar Movies in Telugu: ప్రముఖ నటుడు నానా పటేకర్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు తెలుగు సినిమాలతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని సినీ వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. రజనీకాంత్ ‘కాలా’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నానా.. గతంలో పలు తెలుగు రీమేక్ సినిమాల్లో నటించారు. అలానే ఆయన నటించిన బ్లాక్ బస్టర్ హిందీ, మరాఠీ సినిమాలు తెలుగులోకి రీమేక్ చేయబడ్డాయి. నానా పటేకర్ సినీ ప్రస్థానంలో ‘తెలుగు’ కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం…
Nana Patekar: ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత
Nana Patekar Passes Away: బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ (75) గుండెపోటుతో కన్నుమూశారు. గోవాలోని ఆయన నివాసంలో అపస్మారక స్థితిలో పడి ఉండగా, వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన మృతిపట్ల భారతీయ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1978లో ‘గమన్’ చిత్రంతో సినీ ప్రవేశం చేసిన ఆయన.. తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యభరిత పాత్రలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
జుట్టుని ఎన్నిరోజులకి ఓ సారి కట్ చేస్తే పెరుగుతుంది, డాక్టర్ చెప్పిన టిప్స్ ఫాలో అయితే హెయిర్‌ఫాల్ తగ్గడమే కాకుండా ఒత్తైన జుట్టు మీ సొంతం
జుట్టుని పెంచుకోవాలనుకునేవారు కట్ చేయాలంటే భయపడతారు. నాకున్నవే నాలుగు వెంట్రుకలు వాటిని ఏం కట్ చేస్తాంలే అనుకుంటారు. నిజానికీ కట్ చేయడం వల్ల జుట్టు పొట్టిగా మారుతుందనుకుంటారు. కానీ, దీని వల్ల జుట్టు హెల్దీగా మారి చక్కగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. చివర్లు చిట్లడం, ఇతర సమస్యల కారణంగానే ఎక్కువగా జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే జుట్టుని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయడం కూడామంచి హెయిర్ కేర్‌లో ఓ భాగం. అయితే, ఎప్పుడు జుట్టు కట్ చేయాలో తెలుసుకోవాలి. దీనికోసం డాక్టర్ దీపాశ్రీ ఆర్. (అటెండింగ్ కన్సల్టెంట్, డెర్మటాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, మహాదేవపుర, బెంగళూరు)సరైన సలహాలు ఇస్తున్నారు.
Milk in Fridge: పాలను ఫ్రిజ్‌లో పెడితే ఎన్ని రోజుల్లోపు వాడాలో తెలుసా? పాటించాల్సిన చిట్కాలు
మన రోజువారీ ఆహారంలో పాలు చాలా ముఖ్యమైన భాగం. చాలా మంది రోజు ఓ గ్లాస్ పాలు తాగుతుంటారు. ఇక, పిల్లలకు పాలు సంపూర్ణమైన, పోషక విలువలు కలిగిన ఆహారం. పాలతో టీ చేసుకుంటారు. ఇక, పాలను మరిగించి తోడు వేసుకుని పెరుగు చేసుకుంటారు. అంతేకాకుండా పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇక, చాలా మంది పాలను ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటారు. అయితే, ఫ్రిజ్‌లో ఉంచిన పాలు ఎన్ని రోజుల వరకు సురక్షితంగా ఉంటాయి? అవి పాడైపోయాయని ఎలా గుర్తించాలి? అనే సందేహాలు చాలామందికి వస్తుంటాయి. పాలను సరైన పద్ధతిలో నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి, కాస్త అజాగ్రత్తగా ఉన్నా అవి త్వరగా విరిగిపోతాయి. పాలను ఎన్ని రోజుల వరకు ఫ్రిజ్‌లో ఉంచవచ్చో తెలుసుకుందాం.
పెన్షనర్లకు SBI గుడ్‌న్యూస్.. ఇంట్లో నుంచే DLC సమర్పణకు అవకాశం.. ప్రాసెస్ సహా పూర్తి వివరాలు ఇవే!
SBI DLC: దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాధి మంది పెన్షనర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. తమ బ్యాంక్ యాప్ ద్వారా ఇంట్లో కూర్చునే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించి పెన్షన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా పొందవచ్చని తెలిపింది. ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని తెలిపింది. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఇంట్లో నుంచే పూర్తి చేసేందుకు ఏం చేయాలి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
TCS Q2 Results: టీసీఎస్‌కు రూ.13,884 కోట్ల లాభం.. షేర్ హోల్డర్లకు గుడ్‌న్యూస్.. రూ.12 చొప్పున డివిడెండ్ ప్రకటన
TCS Q2 Results: టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ అదరగొట్టింది. జులై-సెప్టెంబర్ 2026 త్రైమాసికంలో కంపెనీకు రూ.13,884 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి లాభం 15 శాతం మేర పెరిగింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు శుభవార్త చెప్పింది. ఒక్కో షేరుకు రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లిస్తామని ప్రకటన చేసింది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
ఇన్వెస్టర్లకు RBI గుడ్‌న్యూస్.. ఇక ఒకేచోట స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ FD వివరాలు.. CAS స్టేట్మెంట్ ప్రయోజనాలివే!
CAS Statement: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు ఇక నుంచి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్స్ వివరాలు ఇకపై ఒకే చోట కనిపించనున్నాయి. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త ప్రతిపాదన తెచ్చింది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు బ్యాంకు డిపాజిట్ వివరాలు కూడా కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్ (CAS)లో చేర్చాలని RBI ప్రతిపాదించింది. డిసెంబర్ 31, 2026 నాటికి ఈ కొత్త విధానం అమలు లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
Ola Rights Issue: ఓలా రూ. 1000 కోట్ల రైట్స్ ఇష్యూ.. 26 శాతం డిస్కౌంట్ ధరకే షేర్లు ఆఫర్.. దీని వల్ల లాభమా? నష్టమా?
Ola Share Price Today: భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పడిపోతున్న వేళ ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ షేర్లు గురువారం రోజు 10 శాతం పడిపోయాయి. ఇక్కడ మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో పాటుగా ఓలా రూ. 1000 కోట్ల రైట్స్ ఇష్యూ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం కూడా కారణంగా తెలుస్తోంది. ఇక్కడ రైట్స్ ఇష్యూ ధరను మార్కెట్ ధర కంటే చాలా తక్కువగా నిర్ణయించడంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
Minor Demat AC: స్టాక్ మార్కెట్లో 28 రోజుల పాప పెట్టుబడులు.. మైనర్లకు డీమ్యాట్ అకౌంట్ ఎలా తీసుకోవాలి? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి?
Minor Demat Account: స్టాక్ మార్కెట్లోకి 28 రోజుల పాప ఎంట్రీ ఇచ్చిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్ ఫారమ్ జెరోధా వ్యవస్థపకుడు నితిన్ కామత్ మైనర్ అకౌంట్ వివరాలు వెల్లడించడమే ఇందుకు కారణం. అయితే మరి మైనర్ల పేరుపై డీమ్యాట్ అకౌంట్ తీసుకోవడం ఎలా, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇందుకు సంబంధించిన నిబంధనలు ఏమిటి? అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

