Home Blog Page 15

Ola Rights Issue: ఓలా రూ. 1000 కోట్ల రైట్స్ ఇష్యూ.. 26 శాతం డిస్కౌంట్‌ ధరకే షేర్లు ఆఫర్.. దీని వల్ల లాభమా? నష్టమా?

0
Ola Share Price Today: భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పడిపోతున్న వేళ ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ షేర్లు గురువారం రోజు 10 శాతం పడిపోయాయి. ఇక్కడ మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో పాటుగా ఓలా రూ. 1000 కోట్ల రైట్స్ ఇష్యూ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం కూడా కారణంగా తెలుస్తోంది. ఇక్కడ రైట్స్ ఇష్యూ ధరను మార్కెట్ ధర కంటే చాలా తక్కువగా నిర్ణయించడంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

Minor Demat AC: స్టాక్ మార్కెట్లో 28 రోజుల పాప పెట్టుబడులు.. మైనర్లకు డీమ్యాట్ అకౌంట్ ఎలా తీసుకోవాలి? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి?

0
Minor Demat Account: స్టాక్ మార్కెట్లోకి 28 రోజుల పాప ఎంట్రీ ఇచ్చిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్ ఫారమ్ జెరోధా వ్యవస్థపకుడు నితిన్ కామత్ మైనర్ అకౌంట్‌ వివరాలు వెల్లడించడమే ఇందుకు కారణం. అయితే మరి మైనర్ల పేరుపై డీమ్యాట్ అకౌంట్ తీసుకోవడం ఎలా, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇందుకు సంబంధించిన నిబంధనలు ఏమిటి? అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సూపర్ డూపర్ ఎల్‌ నినో తీవ్రతరం.. భూగోళం మొత్తం దాదాపు పూర్తి ఎరుపులోకి ..!

పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్ నినో క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే దీని ప్రభావంతో భారత్‌ సహా దక్షిణాసియాలో నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యింది. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య ఇది మరింత తీవ్రస్థాయికి చేరుకుంటుందని ఇటీవల ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. తాజాగా, అంతర్జాతీయ వాతావరణ నిపుణులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. సూపర్ ఎల్ నినో దెబ్బకు భూగోళం మొత్తం ఎరుపుగా మారిపోయిందని మ్యాప్‌ను షేర్ చేశారు.

విదేశీ విద్యార్థులకు అమెరికా బిగ్ షాక్.. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలంటే రూ. 67 లక్షలు చెల్లించాలంటూ..!

అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ద్వారా పొందే తాత్కాలిక ఉద్యోగ అనుమతులపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) 70 వేల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.67 లక్షలు) ఫీజు విధించేందుకు సంచలన ప్రతిపాదనలు చేసింది. చౌక శ్రామిక శక్తి ప్రవాహాన్ని అడ్డుకుని, స్థానిక అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది.

చుట్టమల్లే సాంగ్‌లో జాన్వీ కపూర్ డీప్ ఫేక్ వీడియో.. సజ్జనార్ ఫోటోను వదల్లేదు.. జూనియర్ NTRకు సీపీ ట్వీట్

0
చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్‌ వీడియో వివాదంలో మరో నకిలీ ప్రచారం వెలుగులోకి వచ్చింది. పాటను అసభ్యంగా ఎడిట్‌ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ కాగా.. అందులో సీపీ సజ్జనార్‌ ఫొటోతో ఏఐ రూపొందించిన ఫేక్ ఫోటోను ఉపయోగించారు. ఈ విషయంపై స్పందించిన సజ్జనార్‌ అది నిజమైన ఫొటో కాదని, డీప్‌ఫేక్‌ అని స్పష్టం చేశారు. నిజాలను నిర్ధారించుకోకుండా ఇలాంటి కంటెంట్‌ను షేర్‌ చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. తన ఫొటోను కొందరు అభిమానులు దుర్వినియోగం చేస్తున్న విషయాన్ని గమనించాలని జూనియర్‌ ఎన్టీఆర్‌ను ట్యాగ్‌ చేస్తూ విజ్ఞప్తి చేశారు.

జూరాల రైతులపై కేసులు.. హరీశ్‌రావు ఫైర్, ‘ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన’!

0
జూరాల కాలువకు నీటిని విడుదల చేసుకున్న 14 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టగా.. అధికారులు స్పందించకపోవడంతో కొందరు రైతులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇరిగేషన్‌ డీఈ ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. దీనిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. రైతులపై కేసులు పెట్టడం హేయమైన చర్య అని విమర్శిస్తూ.. కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

Telangana News, October 8 Live: కూతుర్ని హుస్సేన్ సాగర్లోకి తోసేసిన తల్లి.. కాపాడిన ఆటో డ్రైవర్

0
Telangana Breaking News Today: తెలంగాణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ లైవ్ బ్లాగ్‌ను చూడండి. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ జిల్లాల సమాచారం, పొలిటికల్ అప్డేట్స్ కూడా ఇందులో మీరు చూడొచ్చు.

తెలంగాణ SIRలో 93 లక్షల మందికి నోటీసులు.. 71 లక్షల ఓటర్లకు అర్హత.. నవంబర్ 9న తుది జాబితా

0
తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 93 లక్షల మందికి నోటీసులు జారీ చేశారు. వారిలో ఇప్పటివరకు 71 లక్షల మందికిపైగా ఓటర్లు అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి అర్హత సాధించారు. దాదాపు మరో 96 వేల మందికి నోటీసులు డెలివరీ కావాల్సి ఉంది. క్లెయిమ్స్‌, అభ్యంతరాలు, విచారణ ప్రక్రియ నవంబర్‌ 5 వరకు కొనసాగనుంది. అనంతరం నవంబర్‌ 9న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. దీంతో ఎస్ఐఆర్ పూర్తి తర్వాత రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్యపై పూర్తి స్పష్టత రానుంది.

Special Trains: దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారికి తీపి కబురు.. తెలుగు రాష్ట్రాల మధ్య స్పెషల్ ట్రైన్లు, షెడ్యూల్‌ ఇదే

0
Hyderabad to ap Special Trains: దసరా, దీపావళి పండగల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య అక్టోబర్‌ 6, 13, 20, 27 తేదీలతో పాటు నవంబర్‌ 3, 10, 17, 24 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. సికింద్రాబాద్‌–కాకినాడ మధ్య ప్రత్యేక రైలు, విశాఖపట్నం–బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ పొడిగింపు, నర్సాపూర్‌–తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్‌ కొనసాగింపు వంటి నిర్ణయాలు తీసుకుంది. ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

58 ఏళ్ల తర్వాత నవరాత్రుల్లో గ్రహాలు, నక్షత్రాల అరుదైన కలయిక వేళ ఈ 3 రాశులకు విశేష ప్రయోజనాలు!

Shardiya Navratri 2026: హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది అక్టోబర్ 11న ఆదివారం నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ఈ నవరాత్రులు చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ తొమ్మిది రోజుల కాలంలో అరుదైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. దాదాపు 58 సంవత్సరాల తర్వాత శారదీయ నవరాత్రుల సమయంలో మొదటి రోజు సూర్యోదయం సమయంలో హస్తా నక్షత్రం మరియు శుక్ల యోగాల ప్రభావం ఉంటుంది. అంతేకాదు గురు, చంద్రుల కేంద్ర సంబంధం వల్ల అరుదైన గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో శని మీనరాశిలో సంచారం చేయడం కీలకంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా గ్రహాల స్థానాలు మరియు శుభ యోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు మంచి విజయం సాధించొచ్చు. ఈ సందర్భంగా ఏ రాశుల వారికి నవరాత్రుల వేళ శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.