Home Blog Page 136

మద్యం షాపుల లైసెన్స్ రెన్యువల్‌కు గడువు పెంపు.. ఎక్సైజ్‌శాఖ కొత్త రూల్, 10 దరఖాస్తులు వస్తేనే లాటరీ!

0
AP Govt Extends Liquor Shop Renewal Deadline To September 23: ఏపీలో మద్యం షాపుల రెన్యువల్ గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించాలని నిర్ణయించింది. అంతేకాదు ప్రస్తుత ఎక్సైజ్‌ పాలసీ ప్రకారం ఓ మద్యం షాపునకు 4 దరఖాస్తులు వస్తే లాటరీ తీయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను ఆసరాగా తీసుకుని కొంతమంది యజమానులు మద్యం షాపుల రెన్యువల్‌కు ముందుకు రావడం లేదు. అందుకే ఒక్కో మద్యం షాపు కేటాయింపునకు కనీస దరఖాస్తుల సంఖ్య 10కి పెంచాలని.. అప్పుడే లాటరీ తీయాలని ఎక్సైజ్‌ శాఖ ఆలోచన చేస్తోంది.

రాత్రి మేకప్‌ తీయకుండా నిద్రపోవద్దు, మేకప్‌ రిమూవల్‌కు క్లెన్సింగ్‌ బామ్‌ ఎలా ఉపయోగించాలి?

0
నేటి మోడరన్‌ ఎరాలో మేకప్‌ అనేది ప్రత్యేక సందర్భాలకు మాత్రమే కాకుండా రోజువారీ జీవితంలోనూ చాలామందికి సాధారణ అలవాటుగా మారింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగలు అనే కాకుండా రోజువారి జీవితంలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే రోజంతా ముఖంపై ఉండే మేకప్‌ను రాత్రి అలాగే ఉంచుకుని నిద్రపోవడం మాత్రం మంచిది కాదు. ఇందుకోసం క్లెన్సింగ్‌ బామ్‌ను ఎలా ఉపయోగించాలి? ఇది ముఖాన్ని ఎలా క్లీన్‌ చేస్తుంది? వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

హెయిర్ అండ్ స్కిన్‌కి హెల్ప్ చేసే బాదం నూనెని ఇంట్లోనే తయారుచేయొచ్చు, ఈజీ ప్రాసెస్

0
ఆల్మండ్ ఆయిల్ అనగానే ముందుగా స్కిన్, అండ్ హెయిర్‌కి సంబంధించిన ప్రోడక్ట్‌గానే చూస్తాం. బాదం యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల మొటిమలు, మచ్చల్ని దూరం చేస్తుంది. ఇందులో స్కిన్ అండ్ హెయిర్‌కి మేలు చేసే గుణాలు ఉన్నాయి. కాబట్టే, సబ్బులు, షాంపూలు, హ్యాండ్ క్రీమ్స్ వంటి వాటి తయారీలో ఆల్మండ్ ఆయిల్‌ని వాడతారు. మరి ఇన్ని లాభాలున్నాయి కాబట్టే బాదం నూనెని అందాన్ని మెరుగుపరిచే ఆయిల్‌గా వాడతారు. అయితే, దీనిని మనం బయట కొనే బదులు ఇంట్లోనే తయారుచేయొచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

పండ్లు, కూరగాయలపై పురుగు మందులు క్లీన్‌ చేయడానికి సింపుల్‌ చిట్కా చెప్పిన సీనియర్‌ హీరోయిన్‌ ట్వింకిల్‌ ఖన్నా!

0
కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సంత నుంచి తీసుకొచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి తినడం మనకు అలవాటే. అయితే కేవలం నీటితో కడిగితే వాటిపై ఉన్న మురికి, ఇతర పురుగ మందుల అవశేషాలు పూర్తిగా పోతాయా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ విషయంపై సీనియర్‌ నటి ట్వింకిల్‌ ఖన్నా ఒక సింపుల్‌ హోమ్‌ రెమెడీని షేర్‌ చేశారు. మరి దీన్ని ఇంట్లో ఎలా తయారు చేయాలి? కూరగాయలను ఎలా శుభ్రం చేయాలి? వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

సీఎస్‌కేలో ముగియని ధోనీ శకం.. జహీర్ నియామకం వెనుక ‘తలా’ మాస్టర్ మైండ్!

0
సీఎస్‌కే కొత్త హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ ఎంపిక వెనుక ఎంఎస్ ధోనీ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ధోనీ అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాతే కెప్టెన్ రుతురాజ్, ఓనర్ రూపాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో ఇయాన్ మోర్గాన్‌ను సంప్రదించినా అతడు తిరస్కరించడంతో, ఒక సంవత్సరం కాంట్రాక్ట్‌పై జహీర్‌ను నియమించారు. జహీర్ కూల్ మైండ్‌సెట్, ధోనీ లీడర్‌షిప్ సీఎస్‌కేను మళ్లీ అగ్రస్థానంలో నిలుపుతాయని ఫ్రాంచైజీ భావిస్తోంది.

ఏపీలో నిరుద్యోగులకు దసరా కానుక.. అక్టోబర్ 15న డీఎస్పీ నోటిఫికేషన్?.. మొత్తం పోస్టుల వివరాలివే!

0
Andhra Pradesh Dsc 2026 Notification October 15th: ఏపీ ప్రభుత్వం మరో డీఎస్సీ నోటిఫికేషన్‌‌కు సిద్ధమవుతోంది. ఈ మేరకు డీఎస్సీ 2026 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తున్నారు.. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఖాళీల వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. టీచర్ పోస్టులు మాత్రమే కాదు మరికొన్ని ఇతర పోస్టుల్ని కూడా భర్తీ చేయబోతున్నారు. మొత్తం 2500కుపైగా పోస్టుల్ని భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ

0
Andhra Pradesh Heavy Rains Red Orange Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి బుధవారం రాత్రి కానీ, గురువారం ఉదయానికి కానీ విశాఖపట్నం, గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

రాశిఫలాలు 22 సెప్టెంబర్ 2026: అతిగండ యోగం వేళ వృషభం సహా ఈ 5 రాశులపై శ్రీ మహావిష్ణువు అనుగ్రహం!

0
రాశిఫలాలు 22 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు అతిగండ, సుకర్మ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది హనుమంతుడికి అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున కుజ గ్రహ స్థానం బలపడుతుంది. ఈ శుభ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

Today Panchangam 22 September 2026: ఈరోజు పద్మ ఏకాదశి వేళ ఉపవాస దీక్షకు శుభ ముహుర్తాలు ఎప్పుడొచ్చాయంటే

0
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని ఏకాదశి తిథి నాడు, మంగళవారం ఈరోజున అభిజిత్ ముహుర్తం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇరాన్ గగనతలంలో 50 ఏళ్ల తర్వాత మిస్టరీ రిపీట్.. ఆ విచిత్ర వస్తువు గ్రహాంతరవాసులువేనా? వీడియో వైరల్

ఈ సువిశాల అంతరిక్షంలో గ్రహాంతరవాసుల ఉనికిపై చాలా ఏళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. వీటిపై కచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ.. గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని నమ్ముతున్నారు. గ్రహాంతరవాసుల ఉనికి గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్‌ సీనియర్‌కు కూడా తెలుసని ఇటీవల ఓ నివేదిక పేర్కొంది. తాజాగా, ఇరాన్ గగనతలంలో యూఎఫ్ఓ ఘటనను గుర్తుచేస్తూ ఒక విచిత్ర వస్తువు కనిపించింది. సరిగ్గా 50 ఏళ్ల కిందట ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం.