Home Blog Page 135

Weekly Horoscope 21 To 27 September 2026: ఈ వారం బుధాదిత్య యోగం ప్రభావంతో 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే?

0
Weekly Horoscope 21 To 27 September: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సెప్టెంబర్ నాలుగో వారంలో సెప్టెంబర్ 26న సూర్యుడు కన్య రాశి నుంచి తులా రాశిలోకి సంచారం చేయనున్నాడు. చంద్రుడు మకరం, కుంభం, మీన రాశులలో సంచారం చేయనున్నాడు. అంతేకాదు కర్కాటక రాశిలో కుజుడు,గురుడు కలిసి నీచ భంగ రాజయోగాన్ని ఏర్పరచనున్నారు. కన్యా రాశిలో సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నారు. మరోవైపు తులా రాశిలో శుక్రుడు మాళవ్య రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. బుధుడితో కలిసి లక్ష్మీ నారాయణ యోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ శుభ యోగాల ప్రభావంతో కొన్నిరాశుల వారికి గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. సింహ రాశిలో కేతువు, మీన రాశిలో శని తిరోగమనం, కుంభ రాశిలో రాహువు సంచారంతో ద్వాదశ రాశులపై ప్రభావం పడనుంది. ఈ సందర్భంగా ఈ వారం ఏ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి? ఎవరికి సవాళ్లు ఎదురుకానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పార్ట్‌నర్‌ పక్కన ఉంటే ఒత్తిడి మాయం.. కారణాలు ఇవే

0
పార్ట్‌నర్‌ పక్కన కూర్చోవడం వల్ల చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. ఆనందంగా ఉండొచ్చు. అలా ఎందుకు జరుగుతుందో ఇక్కడ వివరించాం.

జిమ్ చేసేవారు ఈ సంకేతాలు కనిపిస్తే ఆపేయండి

0
చాలామంది ఫిట్‌నెస్ కోసం జిమ్ చేస్తుంటారు. కానీ జిమ్ చేసేటపుడు కొన్ని సంకేతాలు కనిపిస్తే మీకు జిమ్ పడట్లేదని అర్థం. అవేంటో తెలుసుకుందాం.

తీపి జ్ఞాపకాల కంటే చేదు అనుభవాలకే చోటు ఎక్కువ ఎందుకో తెలుసా?

0
తీపి జ్ఞాపకాల కంటే చేదు అనుభవాలే మెదడులో ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఇలా ఎక్కువ కాలం గుర్తు ఉండటానికి గల కారణాల గురించి ఇక్కడ వివరించాం.

“అమెరికా, ఇజ్రాయెల్‌ల నెక్స్ట్ టార్గెట్ పాకిస్థానే”: హౌతీల సంచలన ప్రకటన

ఇరాన్‌పై దాడుల అనంతరం పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరింత విస్తరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ దేశాలను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోబోతున్నాయని హౌతీ నేత ముహమ్మద్ అల్ ఫరా హెచ్చరించారు. ఆయా దేశాల్లో ప్రభుత్వాలు, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి అంతర్గతంగా బలహీనపరిచాకే నేరుగా దాడులకు దిగుతారని వెల్లడించారు. అంతేకాకుండా ఈ కుట్రలో సౌదీ అరేబియా ప్రమేయం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

కొండను తవ్వేస్తున్నారంటూ ఉత్తరాంధ్ర నేత ట్వీట్.. రాయలసీమ టీడీపీ ఎమ్మెల్యే రిప్లై, ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ

0
Chandragiri Tdp Mla Pulivarthi Nani On Bolisetty Satyanarayana Tweet: తిరుపతి జిల్లా చంద్రగిరిలో కొండను తవ్వేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా ఉత్తరాంధ్రకు చెందిన నేత బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్ చేశారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని కోరారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని.. ఈ తవ్వకాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రిప్లై ఇచ్చారు.

చర్మంపై ముడతలు పెంచే మోడ్రన్ అలవాట్లు

0
ప్రస్తుతం ఆధునిక జీవనశైలిలో చేసే కొన్ని తప్పుల కారణంగా మీ చర్మంపై ముడతలు తొందరగా వస్తున్నాయి. అవేంటో తెలుసుకుని జాగ్రత్తపడండి.

హైదరాబాద్‌ టూ అరకు 2 రోజుల ట్రిప్‌ ప్లాన్‌

0
హైదరాబాద్‌ సిటీ లైఫ్‌, ఆఫీస్‌ పని ఒత్తిడితో విసిగిపోయారా? తక్కువ సమయంలో సరైన రిలీఫ్‌ కావాలనుకుంటే అరకు వ్యాలీ సరైన ఎంపిక. రెండు రోజుల్లో అరకు ట్రిప్‌ ఎలా కంప్లీట్‌ చేయాలో ఇక్కడ వివరించాం.

సోరకాయ వడలు క్రిస్పీగా చేసే విధానం

0
ఇంట్లో రుచిగా, క్రిస్పీగా సోరకాయ వడలు చేసుకోవాలని అనుకుంటున్నారా. అయితే ఈ పద్ధతిలో చేసి చూడండి.

పరీక్షల్లో కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని లైట్ తీసుకోవద్దు, గుండెపోటు వచ్చే ముందు శరీరం ఇచ్చే సిగ్నల్స్ ఇవే!

0
కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉన్న గుండెపోటు వస్తోందా? అనే సందేహం చాలా మందికి ఉంది. ఈ సందేహనికి అవును అని సమాధానం ఇచ్చారు డాక్టర్ జగదీష్ మదిరెడ్డి (కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్). కొలెస్ట్రాల్ లెవల్స్ నార్మల్‌గా ఉన్నప్పటికీ గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ హెచ్చరిస్తున్నారు. కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు ఒక ముఖ్యమైన కారణమే అయినప్పటికీ, అది మాత్రమే పూర్తి కారణం కాదు.

​కొలెస్ట్రాల్ సాధారణంగా ఉన్న వారిలో కూడా రక్తనాళాల్లో పూడికలు అంటే ప్లాక్ ఏర్పడొచ్చు. ఒక రీసెర్చ్ ప్రకారం సరైన రక్తపోటు (బీపీ), షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ అన్నీ సరిగ్గా ఉన్న ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో దాదాపు సగం మందికి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినట్లు గుర్తించారు. లిపిడ్ ప్రొఫైల్ రిపోర్టులో అన్నింటికంటే ముఖ్యమైంది చెడు కొలెస్ట్రాల్ లేదా LDL కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉన్న గుండెపోటు ఎందుకు వస్తుంది? ఏ లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకూడదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్న పూర్తి వివరాలపై సమాచారం అందించారు డాక్టర్ జగదీష్ మదిరెడ్డి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.