Home Blog Page 134

బొద్దింకల్ని తరిమికొట్టడానికి హీరోయిన్ చెప్పిన సూపర్ చిట్కా, మన ఇంట్లో ఉండే లవంగాలు + బిర్యానీ ఆకులు చాలు!

0
చాలా మంది ఇళ్లల్లో ఎక్కువగా ఎదుర్కొనే సమస్య బొద్దింకలు. ఇవి ఇంట్లోకి ఒక్కసారి ప్రవేశించాయంటే అంత సులభంగా బయటకు పోవు. ఈ సమస్య సామాన్యులకే కాదండోయ్.. సెలబ్రిటీల ఇళ్లలోనూ తలనొప్పి తెప్పిస్తుంటుంది. ప్రముఖ నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా కూడా తన వంటింట్లో బొద్దింకల బెడదతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే, రసాయనాలతో కూడిన ఖరీదైన పెస్ట్ కంట్రోల్ జోలికి వెళ్లకుండా, ఆమె ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో ఒక ‘దేశీ స్ప్రే’ తయారుచేసి బొద్దింకలను సమర్థవంతంగా తరిమికొట్టారు. ఈ చిట్కాను ఆమె తన బ్లాగ్‌లో పంచుకుంటూ అందరినీ ఉపయోగించమని సూచించారు. ఇంతకీ ఆ చిట్కా ఏంటి, ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఏపీ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చేసింది, ఆగే స్టేషన్‌లు ఇవే

0
Narasapur To Arunachalam Tiruvannamalai Sepcial Trains: రైల్వేశాఖ నరసాపురం నుంచి అరుణాచలం (తిరువణ్ణామలై) క్షేత్రానికి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైలు నంబర్ 07291 (నరసాపురం – తిరువణ్ణామలై).. రైలు నంబర్ 07292 (తిరువణ్ణామలై – నరసాపురం) అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 4 నుంచి నవంబర్ 30 వరకు ఈ స్పెషల్ రైళ్లు నడుస్తాయి. నేటి నుంచి రిజర్వేషన్ ప్రారంభమైంది. ఏపీ రైలు ప్రయాణికులు ఈ విషయాన్నిగమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

భారత్ vs జపాన్ మ్యాచ్‌లో ‘వైడ్’ వివాదం.. అసలు రూల్ బుక్ ఏం చెబుతోంది?

0
జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అంపైర్లపై ఒత్తిడి తెచ్చి ‘వైడ్’ నిర్ణయాన్ని మార్పించిందనే ప్రచారంలో నిజం లేదని తేలింది. ఆఖరి ఓవర్‌లో జపాన్ బ్యాటర్ రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించినప్పుడు ఐసీసీ రూల్‌బుక్ ప్రకారం లెగ్-సైడ్ వైడ్ వర్తించదు. తప్పుగా ఇచ్చిన వైడ్‌ను అంపైర్ క్రిస్ థర్గేట్, సీనియర్ అంపైర్ క్రిస్ బ్రౌన్‌తో చర్చించి ఉపసంహరించుకున్నారు. కొత్త బంతి వేయకముందే నిర్ణయాన్ని సరిదిద్దుకోవడం నిబంధనల ప్రకారం పూర్తిగా చట్టబద్ధమైనదేనని ఐసీసీ చెబుతోంది.

ఏపీ ప్రభుత్వానికి 121 ఎకరాల భూమి వెనక్కు ఇచ్చేసిన రామ్‌కో సిమెంట్స్.. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం

0
Ramco Cements Returns 121 Acres Land To AP Govt: ప్రముఖ సిమెంట్ ఉత్పాదక సంస్థ రామ్‌కో సిమెంట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో తమకు కేటాయించిన భూమిలో 121 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది. నంద్యాల జిల్లాలో సున్నపురాయి మైనింగ్ నిమిత్తం ఈ భూమిని కేటాయించారు. మైనింగ్‌కు అవకాశం లేకపోవడంతో ఆ భూమిని సరెండర్ చేస్తున్నట్లు కంపెనీ చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర గనుల శాఖ ఆమోదం తెలుపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

క్రంచెస్, సిటప్స్ రెండింటిలో ఏది మంచిది? ఏ వర్కౌట్‌తో బెల్లీ త్వరగా తగ్గుతుంది

0
సిటప్స్, క్రంచెస్ ఈ రెండింటిని చాలా మంది చేస్తారు. సిటప్స్‌ని పాత పద్ధతి అనుకుంటారు. దీని బదులు కొంతమంది జిమ్‌లో క్రంచెస్ చేస్తారు. పాతపద్ధతిలో సిట్ అప్‌ చేస్తే ప్రయోజనం ఉంటుంది. క్రంచెస్ పొట్ట కండరాలపై పనిచేస్తాయా? వీటిలో ఏది బెల్లీ ఫ్యాట్‌ని కరిగించి ఫ్లాట్ స్టమక్‌ని ఇస్తుంది. సిటప్స్, క్రంచెస్‌లో కొన్ని తేడాలు ఉన్నాయి. పొట్టకండరాలని ‌టార్గెట్‌గా చేసుకుని వాటిని స్ట్రాంగ్‌గా చేయడానికి క్రంచెస్ హెల్ప్ చేస్తాయి. సిట్‌ అప్‌ చేస్తే ప్రయోజనం ఉందా? క్రంచెస్ కూడా ఉదర కండరాలపై పనిచేస్తాయా? వీటిలో ఏది పొట్ట కొవ్వుని కరిగించి మీకు ఫ్లాట్‌ నడుముని ఇస్తుంది? రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయం గురించి డాక్టర్ శ్రీకాంత్ లద్దిపెర్ల(PT, PhD Scholar), HOD, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీ, యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్ చెబుతున్నారు.

ధోనీ రికార్డు బద్దలు కొట్టిన హర్మన్‌ప్రీత్.. కెప్టెన్‌గా ప్రపంచ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర!

0
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణం అందించడం ద్వారా టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా తన 10వ ఫైనల్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో 9 ఫైనల్ విజయాలు సాధించిన ఎంఎస్ ధోనీ ప్రపంచ రికార్డును హర్మన్ దాటేసింది. పురుషుల, మహిళల క్రికెట్ చరిత్రలోనే కెప్టెన్‌గా 10 టీ20 ఫైనల్స్ నెగ్గిన తొలి సారథిగా హర్మన్ ప్రీత్ కౌర్ నిలిచింది.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు

0
AP Home Minister Review On Rains And Helpline Numbers Alloted: ఏపీలో వాయుగుండం ప్రభావంపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ముందస్తు చర్యలను వేగవంతం చేశామన్నారు హోంమంత్రి అనిత. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై అప్రమత్తం చేయాలని సూచించారు.

ఏపీలోని ఆరు జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు.. మంత్రి నారా లోకేష్ ప్రకటన

0
Andhra Pradesh Schools Holiday On September 23: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ సెలవుల విషయాన్ని అధికారికంగా ట్వీట్ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రజలు సురక్షితంగా ఉండాలని.. ప్రయాణాల చేయొద్దని మంత్రి నారా లోకేష్ సూచించారు.

రాశిఫలాలు 23 సెప్టెంబర్ 2026: బుధాదిత్య యోగం ప్రభావంతో కన్య, తులా సహా ఈ 5 రాశులకు ధనలాభం!

0
రాశిఫలాలు 23 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు సుకర్మ, ధ్రుతి యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు కన్యా రాశిలో సూర్యుడు, బుధుడి కలయిక కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడనుంది. మరోవైపు భద్ర యోగం, ధన యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ కన్య, తులా సహా కొన్ని రాశుల వారికి ధన లాభ అవకాశాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

Today Panchangam 23 September 2026: ఈరోజు నక్షత్రం, తిథి, యోగం, శుభ ముహుర్తాలు, రాహుకాలం వివరాలివే

0
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని ద్వాదశి తిథి నాడు, బుధవారం ఈరోజున అభిజిత్ ముహుర్తం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.