Home Blog Page 127

ఏపీ మంత్రి సొంత ఊరిలో రూ.25 లక్షలు పలికిన వినాయకుడి లడ్డూ.. రూ.9లక్షలకు లడ్డూ వేలంపాడి ప్రజలకు పంచిన టీడీపీ ఎమ్మెల్యే

Machilipatnam Maha Ganapati Laddu Auctioned For Rs 25 Lakhs:కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో ఏర్పాటు చేసిన 63 అడుగుల సాగరతీర మహాగణపతి అందర్ని ఆకట్టుకుంది. ఈ గణపయ్య చేతిలో ఉంచి 630 కిలోల లడ్డూకు వేలంలో రికార్డు ధర దక్కింది. ఎఫ్‌సీఎస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అధినేత గుమ్మడి భవానీ శంకర్‌ రూ.25 లక్షలకు ఈ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఏకంగా 600మందికిపైగా లడ్డూ కోసం పోటీపడ్డారు.

ఏపీలో అక్టోబర్ 1వ తేదీ ఉదయం పింఛన్ డబ్బులు పంపిణీ చేయరు.. చిన్న మార్పు, మంత్రి కీలక ప్రకటన

Ntr Bharosa Pensions October 1st Afternoon: సమ్మె కారణంగా బ్యాంకులకు వరుస సెలవుల ఉన్నా పింఛన్ పంపిణీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశామన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అక్టోబర్1వ తేదీ ఉదయాన్నే పింఛన్ పంపిణీ చేయడం లేదని.. మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేపడతామన్నారు. అక్టోబర్ 1 ఉదయం నగదు విత్‌డ్రా చేసుకునేలా బ్యాంకులకు ఎస్‌ఎల్‌బీసీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. సచివాలయాల ఉదయం బ్యాంకుల నుంచి నగదు తీసుకుని మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేయాలన్నారు.

ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ

Andhra Pradesh Weather Today: ఏపీలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి.. తీవ్ర వాయుగుండం తీరం దాటగా.. ఇవాళ కూడా వానలు పడతాయని వాతావరణశాఖ అలర్ట్ చేసింది. ఉత్తరాంధ్ర, కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం ఉ:దని హెచ్చరించారు. శుక్రవారం కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరించడంతో పాటుగా వర్షాల కారణంగా దెబ్బతిన్ని రోడ్ల పనులు చేపట్టాలని సూచించారు.

శ్రీశైలం మల్లన్న హుండీకి కాసుల వర్షం.. 29 రోజుల్లో భారీగా ఆదాయం

Srisailam Temple Hundi Income Rs 4 Crore 56 Lakhs: శ్రీశైలం మల్లన్నకు భక్తుల సమర్పించిన కానుకల్ని లెక్కించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలలో హుండీలను లెక్కించారు. 29 రోజుల్లో మొత్తం రూ.4 కోట్ల 56 లక్షల 49 వేల 63 రూపాయలు ఆదాయం వచ్చింది. అలాగే బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా ఉంది. ఆలయ పాలకమండలి ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌‌‌తో వంగవీటీ రాధా భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఆసక్తికర పరిణామం

Vangaveeti Radha Meet Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఆత్మీయ భేటీలో ఇద్దరి మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న స్నేహం గురించి పలు విషయాలను గుర్తుచేసుకున్నారు. అలాగే సమకాలీన రాజకీయ అంశాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. పవన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖల్లో తీసుకొస్తున్న మార్పులు, సంస్కరణలపై వంగవీటి రాధాకృష్ణ అభినందించారు.

నల్ల గులాబీతో శ్రుతి హాసన్.. వైట్ టాప్‌లో మెరిసిన రుక్మిణి వసంత్.. సాగర తీరాన శ్రీలీల

0
• నల్ల గులాబీతో శ్రుతి హాసన్
• నేషనల్ ఫిలిం అవార్డుతో నిహారిక కొణిదల
• సాగర తీరాన శ్రీలీల ఫోటో షూట్
• వైట్ టాప్ లో మెరిసిన రుక్మిణి వసంత్
• రణబీర్ ‘లవ్ & వార్’ ఫస్ట్ లుక్ షేర్ చేసిన ఆలియా భట్
• దిశా పటాని యాక్షన్ వీడియో
• చైత్ర ఆచార్ తాజా ఫోటోలు
• ఫరియా అబ్దుల్లా సహా సెలబ్రిటీల తాజా ఇన్‌స్టా పోస్టులపై ఓ లుక్కేద్దాం.

Actor Mushtaq Khan: ప్రముఖ కమెడియన్ ముస్తాక్ ఖాన్ కన్నుమూత

0
ప్రముఖ హాస్య నటుడు ముస్తాక్ ఖాన్ (56) అనారోగ్యంతో కన్నుమూశారు. గత ఐదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 24న తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో ‘ఆషికి’, ‘వెల్కమ్’, ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’, ‘స్త్రీ 2’ సహా 200లకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ముస్తాక్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.

Sai Dharam Tej: ‘నన్ను తిడుతున్న వారందరికీ థ్యాంక్స్’.. ట్రోలర్స్‌కి ఆధారాలతో సాయి ధరమ్ తేజ్ కౌంటర్

0
రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. ప్రాణాపాయం నుంచి కాపాడిన హెల్మెట్ ప్రాధాన్యతను మరోసారి గుర్తుచేస్తూ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ప్రమాదంలో సహాయం చేసిన సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్‌ను తేజ్ పట్టించుకోలేదంటూ వస్తున్న ట్రోల్స్‌కు స్పందిస్తూ, అతనికి ఆర్థిక సాయం చేసి సన్మానించిన ఫోటోలు, వీడియోల ఆధారాలను విడుదల చేసి విమర్శకులకు గట్టి సమాధానమిచ్చారు.

‘నాకు అతడిపై క్రష్ తగ్గట్లేదు’.. భర్తపై ప్రేమను కురిపించిన రష్మిక.. విజయ్‌ దేవరకొండ క్యూట్ రిప్లై

0
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఏందయ్యా సామీ’ పాట నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ క్లిప్‌ను సోషల్ మీడియాలో పంచుకుంటూ విజయ్‌పై రష్మిక తన ప్రేమను వ్యక్త పరిచారు. దానికి విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చారు. రియల్ లైఫ్ కపుల్ ఇలా ఇస్టాగ్రామ్ వేదికగా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరచడం అందరినీ ఆకట్టుకుంటోంది.

Chiranjeevi: సీఎం విజయ్ కొడుకు డెబ్యూ మూవీకి సపోర్టుగా మెగాస్టార్ చిరంజీవి

0
సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘సిగ్మా’ చిత్రం అక్టోబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పార్క్ హయాత్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించనున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. జాసన్ సంజయ్ తొలి ప్రయత్నానికి మద్దతుగా చిరంజీవి ఈ వేడుకలో పాల్గొనడం సినిమాకి కలిసొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.