Home Blog Page 128

మీరు NSE IPO మిస్ అయ్యారా? నిరాశ వద్దు.. మార్కెట్లోకి వస్తోన్న ఈ టాప్-5 భారీ ఐపీఓలు మీకోసమే!

0
NSE IPO Subscription: స్టాక్ మార్కెట్లో అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా వచ్చిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ ముగిసింది. సెప్టెంబర్ 24వ తేదీన మార్కెట్లో లిస్టింగ్ కానుంది. అయితే, చాలా మంది ఈ ఐపీఓను మిస్ అయ్యామే అనే భావనలో ఉండి ఉండవచ్చు. అలాంటి వారందరూ ఎలాంటి నిరాశకు గురి కావాల్సిన పనిలేదు. ఎందుకంటే అతి త్వరలో మరో 5 భారీ ఐపీఓలు వస్తున్నాయి. వాటి ద్వారా లిస్టింగ్ గెయిన్స్ అందుకునే అవకాశం ఉంది. మరి ఆ ఐపీఓల గురించిన వివరాలు తెలుసుకుందాం.

NSE Market Lens: ఇక స్టాక్స్‌లో పెట్టుబడి ఈజీ.. ఒక్క క్లిక్‌తో 2000 షేర్లు స్క్రీనింగ్‌ చేయొచ్చు.. NSE ‘మార్కెట్ లెన్స్’ టూల్ గురించి తెలుసా?

0
NSE Market Lens: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంత సులభం కాదని చెబుతారు. వేళ సంఖ్యలో ఉన్న స్టాక్స్ నుంచి తమకు సరిపోయే, మంచి లాభాలను అందించే స్టాక్ ఎంపిక చేసుకోవడం అనేది తలకు మించిన భారమే. మార్కెట్‌పై ఎంత పట్టు ఉన్నా ఎక్కడో ఒక కాడ తబ్బు చేస్తుంటారు. అయితే, ఇక నుంచి ఆ చింత లేదు. ఎన్ఎస్ఈ మార్కెట్ లెన్స్ అనే అనలిటిక్స్ టూల్ తెచ్చింది. ఒక్క క్లిక్‌తో 2000లకు పైగా షేర్లను స్క్రీనింగ్ చేసి సరైన స్టాక్ ఎంపిక చేసుకోవచ్చు. మరి అది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం.

PF రూ.25000కు పెంపుతో పెన్షన్‌లో మార్పు.. 10, 15, 20, 30 ఏళ్ల సర్వీస్‌‌‌తో ఎవరికి ఎంత? పూర్తి లెక్కలు ఇవే..!

0
EPS Pension Calculations: లక్షలాది మంది ఉద్యోగులకు శుభవార్త అందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ వేతన పరిమితిని రూ.25000లకు పెంచింది. దీంతో ఉద్యోగుల భవిష్య నిధి భారీగా పెరగనుంది. అలాగే ఉద్యోగ విరమణ తర్వాత అందే పెన్షన్ ఏకంగా 67 శాతం మేర పెరగనుంది. పీఎఫ్ వేతన పరిమితి రూ.15000 నుంచి రూ.25000లకు పెరిగిన క్రమంలో 10, 15, 20, 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు ఎవరికి ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకుందాం.

NSE షేరు కేవలం రూ.10 పెరిగితే.. డీమార్ట్ ఓనర్‌కు రూ.40 కోట్లొస్తాయ్.. దమానీకి ఎంత వాటా ఉందంటే?

0
NSE IPO Radhakishan Damani: స్టాక్ మార్కెట్లోకి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఎన్ఎస్ఈ అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఎన్ఎస్ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఈనెల 17 నుంచే మొదలవుతోంది. అయితే, ఈ కంపెనీ షేర్లు మార్కెట్లోకి లిస్టింగ్ అయిన తర్వాత పెరిగినట్లయితే వాటాదారులకు భారీగా లాభాలు రానున్నాయి. అలా డీమార్ట్ ఓనర్ అయిన రాధాకిషన్ దమానీకి కోట్లల్లో లాభాలు అందనున్నాయి. ఎన్ఎస్ఈ షేరు ధర రూ.10 పెరిగినప్పుడల్లా ఆయనకు రూ.40 కోట్లు రానున్నాయి. ఎన్ఎస్ఈలో ఆయనకు ఎంత వాటా ఉంది? ఎంత మేర లాభాలు రానున్నాయి? అనే వివరాలు తెలుసుకుందాం.

ITR Refund: రూ.2.20 లక్షల కోట్లు ట్యాక్స్ రీఫండ్స్ జారీ.. లేటెస్ట్ డేటా రిలీజ్.. ఇంకా మీకు రాకపోతే ఏం చేయాలంటే?

0
ITR Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసి రీఫండ్ కోసం ఎదురుచూస్తున్న ట్యాక్స్ పేయర్లకు శుభవార్త. ఇప్పటి వరకు రూ.2.20 లక్షల కోట్ల రీఫండ్ సొమ్మును ట్యాక్స్ పేయర్లకు అందించినట్లు తాజాగా ఐటీ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 17వ తేదీ నాటికి ఉన్న ట్యాక్స్ కలెక్షన్స్, రీఫండ్స్, అడ్వాన్స్ ట్యాక్స్ గణాంకాలను వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రీఫండ్ల జారీ 29 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

ఏఐ ‘మానవ నియంత్రణ’లోనే ఉండాలి.. ఆ బాధత్య అమెరికా, చైనాలదే.. వైట్‌హౌస్‌లో షీ జిన్‌పింగ్

అమెరికా పర్యటనకు వెళ్లిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. శ్వేతసౌధంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ నియంత్రణలోనే ఉండాలని, ఈ బాధ్యత అమెరికా, చైనాలపైనే ఉందని షీ ఉద్ఘాటించారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఏఐ గురించి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న స్థానంలో ఏఐను ఉంచాలని తాను భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో ట్రంప్ పెట్టారు.

మక్కా నగరానికి మరోసారి ముప్పు అలర్ట్ జారీచేసిన సౌదీ.. నెల రోజుల్లో రెండోసారి

ముస్లింల అత్యంత పవిత్ర నగరం మక్కాతో పాటు పలు చోట్ల సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ మరోసారి ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. సౌదీ ఇలాంటి అలర్ట్ జారీచేయడం ఈ నెలలో ఇది రెండో సారి. జాతీయ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ద్వారా ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మద్దతున్న యెమెన్‌కు చెందిన హౌతీలు, సౌదీ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకుంది.

బ్యాంక్ అకౌంట్లు వాడుకోండి కానీ, రూ.3 కోట్లు అన్‌ఫ్రీజ్ వద్దు.. ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట

0
పైరసీ నెట్‌వర్క్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో కొంత ఊరట లభించింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు అకౌంట్లను సాధారణ లావాదేవీల కోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే అకౌంట్లలో నిలిచిపోయిన సుమారు రూ.3 కోట్ల మొత్తాన్ని అన్‌ఫ్రీజ్ చేసి వాడుకునేందుకు మాత్రం అనుమతి లభించలేదు. కుటుంబ పోషణకు ఇబ్బంది ఉందని ఐబొమ్మ రవి కోర్టును ఆశ్రయించగా.. ఈ ఉత్తర్వులు ఇచ్చింది.

రేవంత్‌ రెడ్డికి ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026’ అవార్డు.. ‘ఆర్యదాన్ ముహమ్మద్’ పురస్కారానికి ఎంపిక

0
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డుకు ముఖ్యమంత్రి ఎంపికయ్యారు. రాష్ట్రంలోని రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలు, నాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకుని రేవంత్ రెడ్డిని ఎంపిక చేశారు. కేరళకు చెందిన దివంగత నేత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఈ పురస్కారాన్ని ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ అందజేస్తోంది. రేపు అవార్డును సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నారు.

నిషేధిత భూములపై సర్కార్ శుభవార్త.. 22ఏ పరిధిలో ఉన్నా రిజిస్ట్రేషన్లు, తక్షణమే అమలు

0
తెలంగాణలోని ప్లాట్లు, ఫ్లాట్ల కొనుగోలుదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులు ఉన్నప్పటికీ.. సాంకేతిక లోపాల వల్ల సెక్షన్ 22ఏ (నిషేధిత జాబితా)లో చిక్కుకున్న ఆస్తుల రిజిస్ట్రేషన్లకు తక్షణమే అనుమతి ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 22ఏ భూముల్లో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై విచారణకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ఛైర్‌పర్సన్‌గా ప్రత్యేక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.