Home Blog Page 129

రిటైర్ అవుతా అనుకుంటున్నారేమో.. సప్తసముద్రాలు దాటినా వదలం: సజ్జనార్‌పై కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

0
సీపీ సజ్జనార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రిటైర్ అవుతానని సజ్జనార్ అనుకుంటున్నారేమో అంటూ వ్యాఖ్యానించిన కౌశిక్ రెడ్డి.. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే సప్తసముద్రాలు దాటినా వదిలిపెట్టబోమని తీవ్ర హెచ్చరికలు చేశారు. గణేష్ నిమజ్జనాల్లో రాజకీయ పార్టీల పాటల విషయంలో సీపీ సజ్జనార్ చేసిన హెచ్చరికలపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ పాటలు పెట్టొద్దని చెప్పడానికి సజ్జనార్ ఎవరని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.

ప్రణయ్ హత్య కేసు దోషి మృతి.. చర్లపల్లి జైలులో గుండెపోటు, గాంధీ ఆస్పత్రిలో కన్నుమూత

0
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ బారీ మృతి చెందాడు. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో గుండెపోటుకు గురికావడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీలో ఉంచారు. ప్రణయ్ హత్య కేసులో అబ్దుల్ బారీ సహా ఆరుగురికి జీవిత ఖైదు, మరొకరికి మరణశిక్ష విధించింది. గుజరాత్ మాజీ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులోనూ అబ్దుల్ బారీ గతంలో జైలుకు వెళ్లాడు.

రాశిఫలాలు 25 సెప్టెంబర్ 2026: ఈరోజు నవపంచమ యోగం వేళ మేషం, తులా సహా ఈ 5 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం!

0
రాశిఫలాలు 25 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు శుక్రుడు, చంద్రుడు కలిసి నవపంచమ యోగం ఏర్పడనున్నారు. అంతేకాదు ఈరోజున శుక్రుడు తన సొంత రాశి అయిన తులా రాశిలో అత్యంత ప్రభావవంతమైన స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ శుభ సమయంలో మేషం, తులా సహా కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించొచ్చు. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

Today Panchangam 25 September 2026: ఈరోజు నక్షత్రం, తిథి, యోగం, శుభ ముహుర్తాలు, రాహుకాలం వివరాలివే

0
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని చతుర్దశి తిథి, శుక్రవారం ఈరోజున అభిజిత్ ముహుర్తం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సీఎం ఆశయానికి ప్రకృతి సహకారం.. గోదావరి పరవళ్లపై మంత్రి అనిత ఆసక్తికర పోస్ట్

మంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. గోదావరి పరవళ్లను తన కెమెరాలో బంధిస్తూ ఉన్న వీడియోలను చేశారు. గోదావరి గలగలా పారుతున్న వీడియోని కూడా షేర్ చేశారు. ప్రకృతి ఇలా సహకరించడం యాదృచ్చికం కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్దకు వరద నీరు భారీగా చేరుతోంది. అలాగే ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో పోలవరం వద్ద గోదావరి మట్టం క్రమంగా పెరుగుతోంది.

ఆ నీటిని వాడేది లేదు.. డేటా సెంటర్ల భయాలపై మంత్రి నారా లోకేశ్ క్లారిటీ

నీటి వినియోగం విషయంలో డేటా సెంటర్లకు సంబంధించిన ఆందోళనలపై మంత్రి నారా లోకేశ్ ఒక క్లారిటీ ఇచ్చారు. అగ్రికల్చర్, నగర అవసరాలకు ఉపయోగపడే నీటిని ఈ ప్రాజెక్టులకు మళ్లించబోమని ఆయన స్పష్టం చేశారు. కేవలం సుస్థిర వనరుల నుంచి వీటికి నీటి అందిస్తామని అన్నారు. ఈ భారీ డేటా సెంటర్లకు అవసరమయ్యే విద్యుత్‌లో 70 శాతం Renewable Energy ద్వారానే సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని లోకేశ్ వివరించారు.

గ్లోబల్ దిగ్గజాలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫోకస్.. పెట్టుబడుల కోసం వ్యూహాత్మక అడుగులు

మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో గ్లోబల్ దిగ్గజ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న అపారమైన వనరులు, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సానుకూల విధానాలను వివరిస్తూ గురువారం పలు పెద్ద పెద్ద కంపెనీల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు సాధించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. సంస్థల ప్రతినిధులతో జరిగిన ఈ చర్చలు పాజిటివ్‌గా ముగియడంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఎత్తున ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బరువు తగ్గించి షుగర్ పేషెంట్స్‌కి మేలు చేసే రాగి రొట్టె, పూరీల్లా పొంగేందుకు చిట్కాలు

0

రాగులు.. చిరుధాన్యాల్లో ముఖ్యమైన ధాన్యం. దీనిని మనం ఏదో రకంగా తీసుకోవడం వల్ల బరువుని తగ్గించుకోవడం దగ్గర్నుంచీ ఎముకలు స్ట్రాంగ్‌గా మారతాయి. రాగుల్లో కాల్షియం, ఫైబర్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. రాగి పిండిని మనం తీసుకున్నప్పుడు ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా ఉంటుంది. దీంతో ఎలాంటి చిరుతిళ్ళు తినం. బరువు తగ్గాలనుకునేవారికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇన్ని లాభాలున్న రాగుల్ని మనం జావలా మాత్రమే కాకుండా అనేక రకాలుగా తీసుకోవచ్చు. అందులో ఒక రెసిపీ రాగి రొట్టె.

రాగుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఇది గ్లూటెన్ ఫ్రీ సూపర్ ఫుడ్. రాగుల్లో ఎక్కువగా కాల్షియంతో పాటు పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని NLM అధ్యయనం పేర్కొంది. అలాంటి రాగుల్ని మనం ఎలా అయినా మన డైట్‌లో యాడ్ చేసుకోవాలి. అందుకోసం ఎప్పుడు ఒకేలా జావ చేసుకుని తినకుండా రాగి రొట్టెని ట్రై చేయండి.
రాగి రొట్టె.. ఈ పేరు వినగానే గట్టిగా అప్పడంలా ఉంటుందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. రాగి పిండిని రొట్టెలా కాకుండా మనం సరైన విధంగా చేస్తే అవి పూరీల్లా పొంగుతాయి. చూడ్డానికే కాదు ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయి. మరి ఈ రాగి రొట్టెల్ని చేయడానికి ఏయే పదార్థాలు కావాలి. వాటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఈ రొట్టెలు ఇప్పుడిప్పుడే చేస్తున్నవి కాదు. మన అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పట్నుంచో చేసినవే. అప్పట్లో రాగులతో రాగి ముద్ద, జావ, రొట్టెలు ఇలా ఎన్నో వెరైటీస్ చేసేవారు. నేడు ఈ రొట్టెల్ని చాలా మంది సెలబ్రిటీలు ఇష్టపడుతున్నారు. కారణం ఇందులోని పోషకాలు. ఇందులోని కాల్షియం ఎముకల్ని దృఢంగా చేసి ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల్ని తగ్గించగా ఇందులో తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్, కాంప్లెక్ష్ కార్బోహైడ్రేట్స్ ఉండగా జీర్ణమవ్వడాన్ని మెల్లిగా చేసి ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెరగకుండా చేస్తాయి. అంతేకాకుండా ఇందులోని ఫైబర్ కంటెంట్ కారణంగా త్వరగా పొట్ట నిండుతుంది. ఈ కారణంగా ఎక్కువగా తినరు. రాగి పిండిలో ఫైటేట్స్, పాలీఫెనాల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గించి చెడు కొలెస్ట్రాల్‌ని మ్యానేజ్ చేస్తాయి.

ITAT: రూ.70 వేలు పెడితే రూ.1.93 కోట్ల లాభం! పెన్నీ స్టాక్ లాభాలపై ఐటీ శాఖ నోటీసులు.. చివరకు ఏం జరిగిందంటే?

0

Tax Notice: షేర్ మార్కెట్లో అతి తక్కువ ధరకు లభించే పెన్నీ స్టాక్స్ కొన్నిసార్లు ఊహించని రిటర్న్స్ ఇస్తాయి. వీటిల్లో పెట్టుబడి పెట్టి భారీగా లాభపడిన వారూ ఉన్నారు. అయితే, స్టాక్ మార్కెట్లో భారీగా లాభాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇన్‌కమ్ ట్యాక్స్ చిక్కులు వస్తుంటాయి. అలా ముంబైకి చెందిన ఓ వ్యక్తికి రూ.70 వలే పెట్టుబడిపై ఏకంగా రూ.1.93 కోట్లు లాభం వచ్చింది. అయితే ఈ లాభాలపై ట్యాక్స్ రాయితీని ఐటీ శాఖ తిరస్కరించింది. చివరకు ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ కీలక తీర్పు ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

Tax Notice: స్టాక్ మార్కెట్లో ఓ వ్యక్తి పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి దీర్ఘకాలంలో భారీ లాభాలు అందుకున్నారు. ముంబైకి చెందిన ఆ ఇన్వెస్టర్‌కి రూ.70 వేలు పెట్టుబడిపై లాంగ్ టర్మ్‌లో ఏకంగా రూ.1.93 కోట్ల లాభాలు వచ్చాయి. అయితే, ఈ లాభాలు సరైనవేనని గుర్తించడానికి బదులుగా బోగస్ పెన్నీ స్టాక్ ట్రాన్సాక్షన్‌గా ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం పేర్కొంది. మొత్తం నగదు పన్ను పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ నోటీసులు పంపించింది. ఈ కేసు ముంబై ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) వద్దకు వెళ్లగా కీలక తీర్పు వెలువడింది. సదరు ఇన్వెస్టర్‌కు ఉపశమనం లభించింది. మరి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


అసలు ఏం జరిగింది?

ముంబైకి చెందిన సంజయ్ కుమార్ మెహతా ఫైల్ చేసిన అసెస్మెంట్ ఇయర్ 2015-16కు సంబధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కేసు. రూ.1.93 కోట్ల లాభాలకు సంబంధించి ట్యాక్స్ నోటీసులను సెప్టెంబర్ 4, 2026 రోజున కొట్టి వేస్తూ ముంబై ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది. షేర్ ట్రాన్సాక్షన్ సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పింటారని, ట్యాక్స్ విభాగం బోగస్ అని తేల్చేందుకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయిందని పేర్కొంటూ సదరు ఇన్వెస్టర్‌కు ఉపశమనం కల్పించింది.

రూ.70 వేల నుంచి రూ.1.93 కోట్లు

2013, ఏప్రిల్ నెలలో టొయామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన 35 వేల షేర్లను రూ.70 వేలు పెట్టి కొనుగోలు చేసినట్లు మెహతా తెలిపారు. మొదట ఈ షేర్లను భౌతికంగా అలాట్ చేశారు. ఆ తర్వాత 2014లో బ్రోకర్ ద్వారా డిజిటల్ విధానంలోకి మార్చారు. ఆ తర్వాత సెప్టెంబర్ 2014, ఫిబ్రవరి 2015 మధ్య ఆ షేర్లను రూ.447 నుంచి రూ.556 మధ్య మెహతా విక్రయించారు. ఈ ట్రాన్సాక్షన్ ద్వారా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రూ.2.14 కోట్లు వచ్చాయి. అందులో రూ.1.93 కోట్లు టొయామ్ ఇండస్ట్రీస్ షేర్ల నుంచే వచ్చినట్లు తెలిపారు. ఈ సేల్ ట్రాన్సాక్షన్ అనేది గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీ ద్వారానే జరిగినట్లు వెల్లడించారు. తాను సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ సైతం చెల్లిచానని తెలిపారు. బ్రోకర్ ద్వారా సేల్ ప్రొసీడింగ్స్ సైతం పొందానని, తన బ్యాంకు ఖాతాలో స్పష్టంగా ఉందని ట్రిబ్యునల్ వద్ద వెల్లడించారు.

ట్యాక్స్ విభాగం ఎందుకు బోగస్ గా పేర్కొంది?

పెన్నీ స్టాక్ లావాదేవీలపై జరిపిన విచారణ ఆధారంగా ఇన్‌సైట్ పోర్టల్ ద్వారా పన్ను శాఖకు సమాచారం వచ్చింది. దర్యాప్తు విభాగం గుర్తించిన 18 స్క్రిప్‌లలో టోయమ్ ఇండస్ట్రీస్ కూడా ఒకటి. అసెస్‌మెంట్ ఆర్డర్ ప్రకారం, కొన్ని పెన్నీ స్టాక్‌లలో కృత్రిమ దీర్ఘకాలిక మూలధన లాభాలు, స్వల్పకాలిక మూలధన నష్టాలను సృష్టించడానికి అవకతవకలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. టోయం ఇండస్ట్రీస్ షేర్ ధరలో వచ్చిన భారీ పెరుగుదలకు ఆ కంపెనీ ఆర్థిక పునాదుల మద్దతు లేదని కూడా నిర్ధారణ అధికారి గుర్తించారు.

దర్యాప్తు నివేదిక ఆధారంగా.. పన్ను చెల్లింపుదారుని దీర్ఘకాలిక మూలధన లాభం నిజమైనది కాదని అసెస్‌మెంట్ ఆఫీసర్ నిర్ధారించారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 68 కింద రూ. 1.93 కోట్లను వివరించలేని నగదు క్రెడిట్‌గా పరిగణించారు. సదరు ట్యాక్స్ పేయర్‌కి నోటీసులు పంపించగా మొదట సీఐటీఏ వద్ద అప్పీల్ చేసినా ఉపశమనం లభించలేదు. చివరకు ఐటీఏటీ ముంబై బెంచ్ వద్ద ఉపశమనం లభించింది.

ఏపీ లిక్కర్ కేసులో భారీ ఊరట, కీలక నిందితులుగా ఉన్న రాజ్ కెసిరెడ్డి, వాసుదేవ రెడ్డిలకు బెయిల్

ఏపీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితులైన రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు బెయిల్ మంజూరైంది. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ కేసులో బెయిల్ కోసం నిందితుల తరపు లాయర్లు కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. దర్యాప్తునకు రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిలు మొదటి నుంచీ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు వారికి బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే కోర్టు కొన్ని షరతులను విధించింది. దీని ప్రకారం నిందితులు లక్ష రూపాయల పూచీకత్తు కట్టాలి. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదు