Home Blog Page 130

ఓయో నిఖిత మృతి కేసులో కీలక పరిమాణం, అనుమానితుడు రవితేజ ఆత్మహత్యా యత్నం

మాదాపూర్ ఓయో హోటల్లో యువతి మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అనుమానితుడైన శ్రీనివాస రవితేజ సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఏడుమెట్ల మర్రిపాలెంలో ఫ్లోర్‌ క్లీనింగ్‌ లిక్విడ్ తాగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే రవితేజ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాగా మాదాపూర్‌లోని సిద్దిఖీనగర్‌, రోడ్‌ నెంబర్ 5లో ఉన్న ఓయో హోటల్ రూమ్‌లో షారోన్‌ నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఓయో హోటల్లో యువతి మృతి కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న శ్రీనివాస రవితేజ ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అతను తన స్వగ్రామమైనా ఏపీలోని అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఏడుమెట్ల మర్రిపాలెంలో ఫ్లోర్‌ క్లీనింగ్‌ లిక్విడ్‌ తాగి సూసైడ్‌ చేసుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం శ్రీనివాస రవితేజ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పరవాడ పోలీసులు ఈ విషయాన్ని తెలంగాణ పోలీసులు తెలియజేశారు.


అసలు ఈ ఓయో కేసు ఏంటంటే?

విశాఖపట్నానికి చెందిన నిఖిత టోప్నో, శ్రీనివాస రవితేజ కలిసి సెప్టెంబర్‌ 21వ తేదీన మధ్యాహ్నం మాదాపూర్‌లోని సిద్దిఖీనగర్‌, రోడ్‌ నెంబర్ 5లో ఉన్న ఓయో హోటల్లో రూమ్‌ తీసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నిఖిత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో రవితేజ, హోటల్‌ సిబ్బంది సహాయంతో ఆమెను కొండాపూర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అలా చనిపోయిన నిఖిత యువతి ముఖం, తల భాగంలో గాయాలు, వాపులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

హోటల్‌ గదిని క్లూస్‌ టీమ్ పరిశీలించగా గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు, గదిలో ఖాళీ మద్యం సీసాలు కూడా కనిపించాయి. దీంతో నిఖిత మృతి అనుమానాస్పదంగా మారింది. ఈ ఘటనకు ముందు ఇద్దరి మధ్య ఏం జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిఖిత మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించిన వెంటనే శ్రీనివాస రవితేజ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. దాంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తుండగానే, అతను తన సొంత ఊరు వెళ్లి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఫోరెన్సిక్ రిపోర్టులు, CC TV ఫుటేజీ ఆధారంగా మాదాపూర్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా ఈ కేసులో ఏం జరిగిందో? నిఖిత ఎలా చనిపోయిందో? ఇంకా తేలాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో 4 కొత్త కమిషనరేట్లు.. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. పరిపాలనా సంస్కరణలు, సాగునీటి ప్రాజెక్టులు, శాంతిభద్రతల పరిరక్షణ, రాజధాని అమరావతి అభివృద్ధియే లక్ష్యంగా ఈ భేటీలో పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత సమర్థవంతంగా పరిరక్షించేందుకు, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా నాలుగు ప్రధాన నగరాల్లో కొత్తగా పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలులో కొత్తగా కమిషనరేట్లు ఏర్పాటు కావడం వల్ల నేరాల నియంత్రణ సులువవ్వడంతో పాటు ప్రజలకు పోలీసు సేవలు మరింత వేగంగా అందుతాయని మంత్రివర్గం అభిప్రాయపడింది.

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు క్యాబినెట్ భారీగా నిధులు కేటాయించింది. అమరావతి రాజధాని పరిధిలోని గ్రామాల్లో రూ.1,548 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ఆమోదం లభించింది. రాజధాని మౌలిక సదుపాయాల కోసం అదనంగా రూ.644.98 కోట్లు కేటాయించారు. ప్రతిష్టాత్మక శాసనసభ భవన స్పైర్, రూఫ్, లిఫ్ట్ నిర్మాణ పనుల కోసం రూ.661 కోట్లకు ఆమోదం తెలిపారు. భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు కనీస యాన్యుటీ చెల్లించేలా నిబంధనలలో సవరణలు చేశారు.

రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలను తీర్చే హంద్రీనీవా సుజల స్రవంతి (HNSS) ప్రాజెక్టు పురోగతిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. HNSS ఫేజ్-II మిగిలిన పనుల కోసం రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరైన నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

శ్రీనివాసపురం రిజర్వాయర్ టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, 2027 నాటికి పనులను పూర్తి చేయాలని గడువు విధించారు. రాయచోటి నియోజకవర్గం HNSS మెయిన్ కెనాల్ 490 – 535 కిలోమీటర్ల మధ్య రూ.350 కోట్ల విలువైన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు చంద్రబాబు. శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను హంద్రీనీవాతో అనుసంధానించి, మార్గమధ్యంలోని దాదాపు 25 వేల ఎకరాలకు పైగా ఉన్న ఖాళీ చెరువులను నీటితో నింపేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

Thriller Movie OTT: బాయ్‌ఫ్రెండ్ సూసైడ్.. గర్ల్‌ఫ్రెండ్ అరెస్ట్.. ఓటీటీలో మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్

0

Thriller Movie OTT: ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ నటించిన థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. ఇందులో బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్యకు కారణమై జైలు జీవితం గడిపే అమ్మాయి పాత్రలో మృణాల్ కనిపించింది.

Thriller Movie OTT: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) ఆడియెన్స్ ముందుకు మరో మైండ్ బ్లాకింగ్ క్రైమ్ థ్రిల్లర్ ని తీసుకొస్తోంది. టాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, పవర్ హౌస్ పెర్ఫార్మర్ హుమా ఖురేషి లీడ్ రోల్స్ లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పూజా మేరీ జాన్’ నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా జీ5 వేదికగా అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. గురువారం (సెప్టెంబర్ 24) ట్రైలర్ రిలీజ్ చేశారు.

ప్రేమ, ఆత్మహత్య, అరెస్ట్.. స్టోరీ ఏంటంటే?

బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్య, గర్ల్‌ఫ్రెండ్ అరెస్ట్ చుట్టూ తిరిగే కథలా ఈ పూజా మేరీ జాన్ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఒక రిజెక్షన్, ఊహించని విషాదం, సమాజం అంతా ఒక మహిళను విలన్ గా వేలెత్తి చూపే తీవ్రమైన పరిస్థితుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ప్రేమలో విఫలమైన తర్వాత ఒక ఆత్మహత్య జరిగితే, ఆ నిందను సమాజం ఒక మహిళపై ఎలా తోసేసింది అనే ఇంటెన్స్ ఎమోషనల్ అండ్ క్రైమ్ పాయింట్ తో ఈ డ్రామా తెరకెక్కింది.

“ఒక రిజెక్షన్.. ఒక ట్రాజెడీ.. ప్రతీ ఒక్కరూ నిందితురాలిగా చూస్తున్న ఒక మహిళ.. ప్రేమ ప్రాణాంతకంగా మారినప్పుడు అసలు తప్పు ఎవరిది?” అంటూ జీ5 షేర్ చేసిన క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి కాంబోలో ఇంటెన్స్ యాక్టింగ్

‘సీతారామం‘, ‘హాయ్ నాన్న’లాంటి వరుస కల్ట్ హిట్స్ తో టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న మృణాల్ ఠాకూర్.. ఈ సినిమాలో చాలా డిఫరెంట్, డార్క్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తోంది. గ్లామరస్ రోల్స్ తో పాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేయడంలో మృణాల్ రూటే వేరు.

ఇక మరోవైపు బాలీవుడ్ వెర్సటైల్ నటి హుమా ఖురేషి తన సీరియస్ యాక్టింగ్ తో సినిమాకి మెయిన్ పిల్లర్ గా నిలిచింది. వీరిద్దరి మధ్య వచ్చే హై డ్రామా సీన్స్ అలాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ ఆడియెన్స్ ని సీట్ అంచున కూర్చోబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

మ్యాడాక్ ఫిల్మ్స్ ప్రొడక్షన్..

‘స్త్రీ 2’, ‘ముంజ్యా’ లాంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించారు. నవజోత్ గులాటీ, విపాషా అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

వర్సటైల్ యాక్టర్ విజయ్ రాజ్, విక్రమ్ సింగ్ చౌహాన్ కీలక పాత్రల్లో మెరిశారు. చార్ట్ బస్టర్ పాటలతో అలరించే విశాల్ మిశ్రా ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందించడం విశేషం.

ప్రస్తుతం డిజిటల్ స్పేస్ లో డార్క్ సస్పెన్స్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ డ్రామాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ గా వస్తున్న ‘పూజా మేరీ జాన్’ థ్రిల్లర్ లవర్స్ కి పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

అక్టోబర్ 2న హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా.. త్వరలోనే తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషల డబ్బింగ్ వెర్షన్లలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

యూఎస్ వీసా అపాయింట్‌మెంట్స్: హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో వెయిటింగ్ టైమ్ ఇదీ

అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ పౌరులకు ఆయా నగరాల కాన్సులేట్లలో వెయిటింగ్ పీరియడ్ వేర్వేరుగా ఉంది. హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా నగరాల్లో పర్యాటక, విద్యార్థి, ఉద్యోగ వీసాలకు పడుతున్న సమయంపై ప్రత్యేక కథనం.

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు వీసా అపాయింట్‌మెంట్ దొరకడం ఇప్పటికీ పెద్ద ప్రయాసగానే మారింది. అమెరికా విదేశాంగ శాఖ (US State Department) నవీకరించిన తాజా గణాంకాల ప్రకారం.. కాన్సులేట్ ఉన్న నగరం, దరఖాస్తు చేసుకునే వీసా కేటగిరీని బట్టి వెయిటింగ్ టైమ్‌లో తీవ్ర వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. భారత్‌లోని చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీల్లో ఉన్న యూఎస్ కాన్సులేట్లలో వివిధ రకాల వీసాలకు ఎంత సమయం పడుతుందో స్పష్టం చేశారు.

బి1/బి2 వీసాలకు భారీగా జాప్యం

వ్యాపార, పర్యాటక పర్యటనల కోసం దరఖాస్తు చేసుకునే బి1/బి2 (B1/B2) వీసాలకు అత్యధికంగా వేచి చూడాల్సి వస్తోంది. మూడేళ్లకు పైగా అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితి నుంచి కొంత మెరుగుపడినప్పటికీ, ఇప్పటికీ కొన్ని నగరాల్లో సుదీర్ఘ నిరీక్షణ తప్పడం లేదు.

మూడు నెలల కంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న నగరాల వివరాలు:

  • హైదరాబాద్: 11.5 నెలలు
  • ముంబై: 11 నెలలు
  • న్యూఢిల్లీ: 7.5 నెలలు
  • చెన్నై: 7 నెలలు
  • కోల్‌కతా: 6 నెలలు

అంటే హైదరాబాద్, ముంబై కాన్సులేట్లలో పర్యాటక వీసా అపాయింట్‌మెంట్ దొరకాలంటే దాదాపు ఏడాది పాటు వేచి చూడాల్సిందే.

విద్యార్థి వీసాలకు పెద్ద ఊరట

అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించేందుకు, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ల కోసం వెళ్లే అభ్యర్థులకు (F, M, J కేటగిరీలు) వెయిటింగ్ టైమ్ చాలా తక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం.

  • చెన్నై: 15 రోజుల లోపు
  • హైదరాబాద్: 1.5 నెలలు
  • కోల్‌కతా: 2 నెలలు
  • న్యూఢిల్లీ: 2 నెలలు
  • ముంబై: 2.5 నెలలు

ఒకే కాన్సులేట్‌లో దరఖాస్తు చేసుకున్నా వీసా కేటగిరీని బట్టి ఈ వెయిటింగ్ టైమ్‌లో ఎంతో వ్యత్యాసం ఉంటుందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

హెచ్-1బీ, ఉద్యోగ వీసాల పరిస్థితి

హెచ్-1బీ, ఎల్-1 సహా ఇతర పిటిషన్ ఆధారిత ఉద్యోగ వీసాలకు (H, L, O, P, Q) సంబంధించి కాన్సులేట్ల వారీగా అపాయింట్‌మెంట్ సమయాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్: 5.5 నెలలు (భారత్‌లోనే అత్యధికం)
  • న్యూఢిల్లీ: 3 నెలలు
  • చెన్నై: 1.5 నెలలు
  • ముంబై: 1.5 నెలలు
  • కోల్‌కతా: 1 నెల

ముందస్తుగా స్లాట్ పొందే అవకాశం ఉందా?

యూఎస్ విదేశాంగ శాఖ ప్రచురించే ఈ వెయిటింగ్ వివరాలు ప్రతి నెలా మారుతుంటాయి. ఇక్కడ పేర్కొన్న సమయంలోనే ఖచ్చితంగా అపాయింట్‌మెంట్ లభిస్తుందని గ్యారెంటీ ఉండదు. కాన్సులేట్లు ఎప్పటికప్పుడు అదనపు స్లాట్లను అందుబాటులోకి తెస్తుంటాయి. ఇప్పటికే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయి, స్లాట్ల లభ్యతను బట్టి తమ అపాయింట్‌మెంట్‌ను ముందస్తు తేదీకి మార్చుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

32 పరుగులు చేసి, ఉత్కంఠ విజయం.. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా!

0

జపాన్‌తో సానో వేదికగా జరిగిన 5 ఓవర్ల మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో నెగ్గి అరుదైన ప్రపంచ రికార్డు సాధించింది. తుఫాను, వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం కావడంతో 5 ఓవర్లకు కుదించగా, భారత్ మొదట బ్యాటింగ్ చేసి 32 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం జపాన్‌ను 30 పరుగులకే కట్టడి చేసింది. టీ20ఐలలో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇంత తక్కువ స్కోరుతో మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.

సెప్టెంబర్ 22న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్, జపాన్ జట్ల మధ్య అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి మ్యాచ్ జరిగింది. అయితే క్రికెట్‌లో పసికూన జట్టుగా ఉన్న జపాన్.. టీ20 ఛాంపియన్ భారత్‌ను వణికించింది. దాదాపు ఓడించినంత పనిచేసింది. టీమిండియా 2 పరుగుల తేడాతో ఈ మ్యాచులో గట్టెక్కింది. అయినప్పటికీ ఈ మ్యాచు ద్వారా భారత క్రికెట్ జట్టు ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. పురుషుల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అతితక్కువ పరుగులను డిఫెండ్ చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.

వర్షం కారణంగా ఈ మ్యాచును 5 ఓవర్లకు కుదించారు. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 5 ఓవర్లలో కేవలం 32/4 మాత్రమే చేసింది. అయితే చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచులో భారత్.. గెలుపొందింది. 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్‌ను భారత బౌలర్లు నిలువరించారు. చివరికి జపాన్ 5 ఓవర్లలో 30 పరుగుల వద్దే నిలిచిపోవడంతో భారత్ 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది.

ఈ అద్భుత విజయంతో అంతర్జాతీయ పురుషుల టీ20 చరిత్రలోనే మొదట బ్యాటింగ్ చేసి అత్యంత తక్కువ స్కోరు సాధించినప్పటికీ మ్యాచ్ గెలిచిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో ఐర్లాండ్ జట్టు 2008లో బర్ముడాపై 43 పరుగులు (9 ఓవర్ల ఆట) చేసి 4 పరుగుల తేడాతో నెగ్గడమే అప్పటివరకు రికార్డుగా ఉండేది. ఆ 18 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డును భారత్ ఇప్పుడు 32 పరుగులతో చెరిపేసింది.

ప్రవాహాలతో రిజర్వాయర్లు, చెరువులు నింపాలి : ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు

ప్రవాహాలతో రిజర్వాయర్లు, చెరువులు నింపాలని సీఎం చంద్రబాబు అన్నారు. పడుతున్న వర్షాలతో భూగర్భజలాల రీఛార్జ్ అవుతాయని పేర్కొన్నారు.

వర్షాల కారణంగా వస్తున్న ప్రవాహాలతో రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్ని నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి డెల్టాలోని రిజర్వాయర్లతో పాటు పరిధిలో ఉన్న వివిధ నీటి వనరుల్ని కూడా నింపాలని స్పష్టం చేశారు. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగం, డేటా అనలిటిక్స్‌, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్ష ప్రభావంపై సీఎం చర్చించారు.

తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో గడచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భూగర్భజలాలు కొంత మేర పెరిగాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రకాశం బ్యారేజి సహా మున్నేరు సహా ఇతర క్యాచ్ మెంట్ ఏరియా నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని అన్నారు. ప్రాజెక్టుల దిగువన ఉన్న అన్ని నీటి వనరుల్లో వర్షపు నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అవసరమైన చోట మోటార్లను వాడి నీటిని లిఫ్ట్ చేయాలని స్పష్టం చేశారు. గోదావరి నుంచి వస్తున్న ప్రవాహాల ద్వారా 24 టీఎంసీల నీటిని ఏలేరు రిజర్వాయర్ నింపాలని స్పష్టం చేశారు.

పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకూ నీటి వనరుల్లోకి నీటిని పంపాలన్నారు చంద్రబాబు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వర్షాలు అధికంగా నమోదు అయ్యాయని అధికారులు వివరించారు. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ సహా వివిధ జిల్లాల్లో తీవ్ర వర్ష ప్రభావం కనిపించిందని తెలిపారు.

ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాలు, గాలుల తీవ్రత, నదులు-వాగుల్లో పెరుగుతున్న ప్రవాహాలు, రిజర్వాయర్లలోకి చేరుతున్న వరద నీరు, రాబోయే రోజుల్లో అంచనా వేసిన వర్షపాతంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. తాజా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల ప్రభావంతో గోదావరి బేసిన్‌లోని శబరి, ఇంద్రావతి, ఏలేరు, తాండవ, ఎర్రకాల్వ, పంపా, మేఘాద్రిగడ్డ తదితర రిజర్వాయర్లకు భారీగా వరద నీరు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసన తీర్మానం: విపక్షాల సంచలన నిర్ణయం

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు విపక్ష ఇండియా కూటమి సిద్ధమైంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆయనపై అభిశంసన తీర్మానం (Impeachment Motion) ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో వ్యూహం రచిస్తున్నాయి.

దేశంలో ఓటర్ల జాబితా సవరణ, ఓట్ల తొలగింపు అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు.. ఏకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. వచ్చే రెండు వారాల్లో ఉభయ సభల్లోనూ దీనికి సంబంధించిన నోటీసు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ విపక్షాలను ఏకతాటిపైకి తెస్తోంది.

ఇండియా కూటమి సంయుక్త వ్యూహం

ఈ అభిశంసన నోటీసు ముసాయిదాను ప్రస్తుతం న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి కలిసికట్టుగా ఈ నోటీసును సిద్ధం చేస్తోందని పేర్కొన్నాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించేందుకు విపక్షాలు ప్రయత్నించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

గతంలో లోక్‌సభ, రాజ్యసభల్లో ఇచ్చిన మొదటి నోటీసు తిరస్కరణకు గురికాగా, ఏప్రిల్ 24న 73 మంది ఎంపీలు ఇచ్చిన మరో నోటీసు రాజ్యసభలో పెండింగ్‌లోనే ఉంది. అయితే, ఓటర్ల జాబితాల సవరణలో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనం వెలుగులోకి రావడంతో విపక్షాలు కొత్తగా మరొకసారి అభిశంసన తీర్మానం ఇవ్వాలని నిర్ణయించాయి.

దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు

మరోవైపు, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పోరాటానికి దిగింది. సెప్టెంబర్ 25న అన్ని రాష్ట్రాల ప్రధాన నగరాల్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ తమ రాష్ట్ర కమిటీలను ఆదేశించింది. అలాగే సెప్టెంబర్ 28న దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

ఏపీలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. వర్షాలతో అతలాకుతలం.. పలు విమానాలు రద్దు, దారి మళ్లింపు!

0

Andhra Pradesh Rains : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాల ప్రభావంతో పలు విమనాలు రద్దయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రతికూల వాతావరణం, దట్టమైన మేఘాల కారణంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు పలు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.

భారత వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం – పోలాకి మధ్య తీరాన్ని దాటింది. తీరం దాటినప్పటికీ దీని ప్రభావం మరో 12 గంటల పాటు తీవ్రంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.

తీరం దాటే సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విజయనగరం జిల్లా తెర్లాం, బాడంగి, డెంకాడ మండలాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందస్తు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

వాతావరణంలో హఠాత్తుగా వచ్చిన మార్పులు, విజిబిలిటీ తగ్గడం వల్ల ఎయిర్‌పోర్టు అధికారులు పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు మరికొన్నింటిని రద్దు చేశారు. విశాఖపట్నం – విజయవాడ (ఇండిగో) ప్రతికూల పరిస్థితుల వల్ల ల్యాండింగ్ సాధ్యం కాకపోవడంతో ఈ విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు.హైదరాబాద్ – రాజమహేంద్రవరం (స్టార్ ఎయిర్‌లైన్స్) రాజమండ్రి వద్ద అనుకూలించని వాతావరణం కారణంగా బెంగళూరుకు డైవర్ట్ చేశారు. విమాన ప్రయాణాలు పెట్టుకున్నవారు విమానాశ్రయానికి బయలుదేరే ముందే ఆయా ఎయిర్‌లైన్స్ సంస్థలను సంప్రదించి, కరెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని ఎయిర్‌పోర్టు అథారిటీ కోరింది

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఒక్క క్లూతో దొరికిపోయారు!

ప్రియుడితో కలిసి భర్త హతమార్చిన ఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఆళ్లగడ్డకు చెందిన 32 సంవత్సరాల ఆంజనేయులి హత్యకి అతని భార్య నాగ సుబ్బులు ప్రణాళిక రచించిందని, ప్రియుడు గురు ప్రసాద్ దాన్ని అమలు చేసినట్లు పోలీసులు తేల్చారు. ప్రియుడితో భర్తకు ఫోన్ చేయించి, పార్టీ చేసుకుందామని పిలిపించి మరీ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో తొలుత భార్యపై అనుమానం ఉన్నప్పటికీ ఘటనా స్థలంలో దొరికిన మద్యం బాటిల్ సీసా మూత ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది.

అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి హత్య చేసిన ఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఒక్క చిన్న క్లూ కారణంగా కేవలం 24 గంటల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదించారు. భర్తను హత్య చేసేందుకు భార్య వ్యూహ రచన చేయగా.. ప్రియుడు దాన్ని అమలు పరిచాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు.

ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డకు చెందిన 32 సంవత్సరాల ఆంజనేయులు, సుబ్బులు భార్యాభర్తలు. అయితే, సుబ్బులుకు చాగలమర్రి మండలానికి చెందిన కల్లూరి గురు ప్రసాద్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ రెండు నెలల కిందట నొస్సం దగ్గరలోని నాయనలప్ప ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. గురు ప్రసాద్‌ను పెళ్లి చేసుకుని అతనితో సహజీవనం చేస్తూనే భర్త ఆంజనేయులతో కూడా సంసారం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తమ సహజీవనానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో భర్తను హతమార్చాలని నాగ సుబ్బులు నిశ్చయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పండగలపుడు కొన్ని ఆహారాలు ఎందుకు తినరు?

0
పండగల రోజు తెలుగు ప్రజలు కొన్ని సంప్రదాయాలు పాటిస్తారు. ఈరోజు కొన్ని ఆహారాలు దూరంగా పెడతారు. అవేంటో, అలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం.