Home Blog Page 131

కొబ్బరి నూనె vs బాదం నూనె.. మీ జుట్టుకి ఏది మంచిది?

0
చాలా మంది తలకు కొబ్బరి నూనె లేదా బాదం నూనె ఏది రాసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏ నూనె రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందో ఇక్కడ వివరించాం.

ITAT: రూ.70 వేలు పెడితే రూ.1.93 కోట్ల లాభం! పెన్నీ స్టాక్ లాభాలపై ఐటీ శాఖ నోటీసులు.. చివరకు ఏం జరిగిందంటే?

0
Tax Notice: షేర్ మార్కెట్లో అతి తక్కువ ధరకు లభించే పెన్నీ స్టాక్స్ కొన్నిసార్లు ఊహించని రిటర్న్స్ ఇస్తాయి. వీటిల్లో పెట్టుబడి పెట్టి భారీగా లాభపడిన వారూ ఉన్నారు. అయితే, స్టాక్ మార్కెట్లో భారీగా లాభాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇన్‌కమ్ ట్యాక్స్ చిక్కులు వస్తుంటాయి. అలా ముంబైకి చెందిన ఓ వ్యక్తికి రూ.70 వలే పెట్టుబడిపై ఏకంగా రూ.1.93 కోట్లు లాభం వచ్చింది. అయితే ఈ లాభాలపై ట్యాక్స్ రాయితీని ఐటీ శాఖ తిరస్కరించింది. చివరకు ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ కీలక తీర్పు ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

ఏపీలో భారీ వర్షాలకు జలమయమైన ప్రధాన సిటీలు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష

0
ఎల్‌నీనో ప్రభావంతో అల్లాడుతున్న నగరాల్లో ఇప్పుడు భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. విశాఖ, విజయవాడ వంటి నగరాల్లో ఆగకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో రహదారులు జలమయం అయిపోయాయి. చెట్లు కుప్పకూలిపోతున్నాయి. రోడ్లు, వంతెనలు కుంగిపోయాయి. ఇక విశాఖపట్నంలో అలల ఉధృతికి సముద్రం అల్లకల్లోలంగా మారి.. కోకో ఎరీనా ప్రాంతం కోతకు గురైంది. అదేవిధంగా సింహాచలం అప్పన్న మెట్ల మార్గం మొత్తం వరద ప్రవాహంతో నిండిపోయింది. మరోవైపు కాకినాడ జిల్లా పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Telangana Dussehra Holidays 2026: తెలంగాణలో స్కూళ్లకు దసరా సెలవులు.. అధికారికంగా ప్రకటించిన విద్యాశాఖ, పూర్తి లిస్ట్ ఇదే..

0
Telangana Dussehra School Holidays:తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సందర్భంగా అక్టోబరు 10 నుంచి 22వ తేదీ వరకు 13 రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారు. అకడమిక్ విద్యా క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అక్టోబరు 10 రెండో శనివారం, 11, 18 తేదీలు ఆదివారాలు కావడంతో నికరంగా పది రోజుల సెలవులుగా పరిగణించనున్నారు. దసరా సెలవులకు ముందే ఎస్‌ఏ-1 పరీక్షలను పూర్తిచేయనున్నారు. అక్టోబరు 1న ప్రారంభమయ్యే సమ్మెటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షలు అక్టోబరు 9తో ముగియనున్నాయి.

ట్యాంక్‌బండ్‌పై స్కూటీ ఢీకొని నిమజ్జనం విధుల్లోని SI వెంకన్న మృతి.. అండగా సీపీ సజ్జనార్

0
హైదరాబాద్‌ గణేష్ నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్సై వెంకన్న.. స్కూటీ ఢీకొట్టడంతో మృతి చెందారు. ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్‌ 2 సమీపంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుర్తుతెలియని స్కూటీ ఆయనను ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదం తర్వాత ఆయనను కోసం ఆస్పత్రికి తరలించగా.. ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్.. ఎస్సై వెంకన్న కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఖైరతాబాద్ ఉపఎన్నికలో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.. మీడియా ప్రశ్నకు దానం నాగేందర్‌ సమాధానమిదే..!

0
ఖైరతాబాద్ ఉపఎన్నికలో తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే ప్రశ్నకు మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పార్టీ పేరు ఇప్పుడే వెల్లడించబోనని.. టికెట్ వచ్చిన తర్వాతే చెబుతానని స్పష్టం చేశారు. అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యం అయింది. తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ చెబుతున్నప్పటికీ.. ఏ పార్టీ టికెట్‌పై బరిలోకి దిగుతారనే దానిపై మాత్రం ఇంకా అధికారిక స్పష్టత రాలేదు.

వైన్ షాప్‌లు బంద్, అర్ధరాత్రి వరకు మెట్రో, ప్రభుత్వ సెలవు.. గణేష్ నిమజ్జనాల వేళ కీలక నిర్ణయాలు

0
హైదరాబాద్‌లో గణేష్ మహా నిమజ్జనం నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసులు, మెట్రో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తగ్గించేందుకు హైదరాబాద్ మెట్రో సేవలను అర్ధరాత్రి 1 గంట వరకు పొడిగించారు. మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పలు ప్రాంతాల్లో వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్ బార్లను 24 గంటల పాటు మూసివేయాలని ఆదేశించారు. అలాగే క్యూర్ పరిధిలో ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

The Paradise: ది ప్యారడైజ్‌ మూవీలో కేసీఆర్‌ను పోలిన లుక్‌.. థియేటర్‌లో సినిమా చూసిన హిమాన్షు

0
The Paradise Priyadarshi Character: నేచురల్‌ స్టార్‌ నాని నటించిన ది ప్యారడైజ్‌ మూవీ ఇవాళ పాన్‌ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదలైంది. విడుదలైన వెంటనే సినిమాలోని పలు సన్నివేశాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకర్‌ అన్న పాత్ర లుక్‌, మాట్లాడే విధానం కేసీఆర్‌ను పోలి ఉన్నాయంటూ చర్చ జరుగుతోంది. దివంగత ఎన్టీఆర్‌కు సంబంధించిన రిఫరెన్స్‌లు కూడా సినిమాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు రావు అభిమానులతో కలిసి థియేటర్‌లో ది ప్యారడైజ్‌ మూవీని వీక్షించిన వీడియో వైరల్‌గా మారింది.

కొత్తగా దాడులు చేస్తే యుద్ధాన్ని హిందూ మహాసముద్రానికి విస్తరిస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో ప్రతిష్టంభన నెలకుంది. హర్మూజ్ జల సంధి విషయంలో తమ డిమాండ్లకు అంగీకరించాల్సిందేనని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ మరోసారి హెచ్చరికలు చేసింది. దీంతో హిందూ మహాసముద్రంలో అమెరికా నేవీ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది. యుద్ధ విరామ సమయంలో తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకున్నామని, హైపర్ సోనిక్ క్షిపణులను మరిన్ని సమకూర్చుకున్నామని హైదరాబాద్‌లోని ఇరాన్ ఎంబసీ పోస్ట్ పెట్టింది.

అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా ఉపాసన.. రూ.8,600 కోట్ల విస్తరణ బాధ్యతలు ‘మెగా’ కోడలి చేతికి

0
Upasana Konidela: అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ విభాగానికి ప్రముఖ నటుడు రాంచరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్ పర్సన్‌గా ఉండగా తాజాగా కొత్త బాధ్యతలను అందుకున్నారు. డైరెక్టర్ హోదాలో ఆసుపత్రి ప్రాజెక్టుల అభివృద్ధిని పర్యవేక్షించనున్నారు. అలాగే రూ. 8,600 కోట్ల విస్తరణ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. తన తల్లి నుంచి బాధ్యతలను స్వీకరించనున్నారు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.