Home Blog Page 132

Sensex: కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు.. ఏకంగా 1250 పాయింట్లు డౌన్.. కారణాలివే

0
Stock Market Crash Reasons: భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం సెషన్‌లో భారీగా పతనం అవుతున్నాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 1200 పాయింట్లకుపైగా పడిపోయింది. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో అన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండిగో అత్యధికంగా పడిపోయాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్ 2007 నాటి గరిష్ఠాలకు పెరగడం, క్రూడ్ ధరలు పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, IRDIA కొత్త నిబంధనలు వంటివి ప్రభావం చూపుతున్నాయి.

Diesel Shortage: వాహనదారులకు అలర్ట్.. ఒక్కరికి 50 లీటర్ల ‘డీజిల్’ మాత్రమే.. యుద్ధం దెబ్బతో ఆ బంకుల్లో అమలు!

0
Diesel Sales: దేశంలో మళ్లీ ఇంధన సంక్షోభం ఛాయలు కనిపిస్తున్నాయి. డీజిల్ విక్రయాలపై ఆంక్షలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఒక్కో వాహనదారుడికి 50 లీడర్ల డీజిల్ మాత్రమే విక్రయించే రేషనింగ్ విధానాన్ని పలు బంకులు ఇప్పటికే అమలు చేస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. దేశంలోని జియో-పీబీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ బంకుల్లో డీజిల్ రేషనింగ్ విధానం అమలు అవుతోందని తెలిపింది. మరి ఎవరిపై ప్రభావం ఉంటుంది? అనే వివరాలు తెలుసుకుందాం.

Gold Rate Today: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర, రూ.5000 పడిన వెండి.. హైదరాబాద్, వైజాగ్‌ సెప్టెంబర్ 24న రేట్లు ఇవే

0
Gold And Silver Rate Today: పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేట్లు మళ్లీ భారీగా తగ్గాయి. ఔన్స్ గోల్డ్ రేటు ఏకంగా 40 డాలర్లకు పైగా పడిపోయింది. దీంతో దేశీయ మార్కెట్లలోనూ పసిడి రేట్లు భారీగా తగ్గాయి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి నగరాల్లో బంగారం రేట్లు ఈరోజు భారీగా తగ్గాయి. వెండి ధరలు రూ.5000 మేర పడిపోయాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 24వ తేదీన బంగారం, వెండి ధరలు ఎంతెంత పలుకుతున్నాయో తెలుసుకుందాం.

​ఇది కళ్యాణం.. కమనీయం జీవితం.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లినాటి ప్రమాణాలు.. హీరో సూర్య-జ్యోతిక షేర్‌ చేసుకున్న వైవాహిక పాఠాలు!

0
పెళ్లి రోజున చేసుకున్న ప్రమాణాలను 20 ఏళ్ల తర్వాత మరోసారి గుర్తుచేసుకుంటే.. ఆ క్షణం ఎంతో ప్రత్యేకంగా, కొత్తగా ఉంటుంది కదా! జ్యోతిక, సూర్య విషయంలో ఇప్పుడు అదే జరిగింది. సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట ప్రేమలో పడి 2006లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ తమ సినీ కెరీర్‌తో పాటు కుటుంబ జీవితాన్ని కూడా ఎంతో అన్యోన్యంగా కొనసాగిస్తూ వస్తున్నారు. పెళ్లయి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ జంట మరోసారి తమ పెళ్లి ప్రమాణాలను గుర్తుచేసుకున్నారు.

కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ప్రత్యేకంగా ది సీక్వెల్‌ పేరుతో వోస్‌ రిన్యూవల్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇటీవల జ్యోతిక సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. 20 ఏళ్ల తమ వైవాహిక జీవితంలో ఎదురైన సర్దుబాట్లు, అవగాహన, త్యాగాలు, స్నేహాన్ని కూడా ఈ వేడుకలో గుర్తుచేసుకున్నారు. మరి జ్యోతిక, సూర్య తమ 20 ఏళ్ల ప్రయాణం గురించి ఏం చెప్పారు, భార్యభర్తల మద్య ఎలాంటి సంబంధాలు ఉండాలి వంటి అనేక విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

టీలో ముందుగా పాలు పోయాలా? నీళ్లు పోయాలా? పర్ఫెక్ట్ చాయ్ కోసం పాటించాల్సిన పక్కా కొలతలివే!

0
మనలో చాలా మందికి ఉదయాన్ని టీతోనే ప్రారంభిస్తారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే వేడి వేడి టీ కప్పు తాగాల్సిందే. రోజంతా ఆఫీస్ వర్క్‌లో అలసిపోయినప్పుడు ఓ కప్పు చాయ్ తాగితే వచ్చే కిక్కే వేరు. అలసట తీరి మూడ్ మొత్తం మారిపోతుంది. అయితే, చాలా మందికి ఇంట్లో టీ చేసుకున్నప్పుడు ఓ బాధ ఉంటుంది. అర్రే.. రోడు పక్కన బండి లేదా హోటల్లో దొరికే టీ రుచి రావడం లేదని బాధపడుతుంటారు.

వాళ్లేదే రకరకాల టీ పొడులు, మసాలాలు వాడుతున్నారని అనుకుంటారు. కానీ అసలు తేడా టీని తయారు చేసే విధానంలోనే ఉంటుంది. టీ పెట్టేటప్పుడు ముందుగా పాలు పోయాలా లేక నీళ్లు పోయాలా అనే ఒక చిన్న విషయమే టీ రుచిని, సువాసనను పూర్తిగా మార్చేస్తుంది. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. మరి అసలైన పద్ధతి ఏంటో వివరంగా తెలుసుకుందాం.

జుట్టుకి పసుపు అప్లై చేయొచ్చా, జుట్టు రాలడాన్ని తగ్గించి పెరిగేందుకు ఏం చేయాలి

0
పసుపుని వంటల్లో వాడి ఆరోగ్యాన్ని కాపాడే పదార్థంగానే కాదు, అందానికి మేలు చేసే పదార్థమని చెబుతారు పూర్వీకులు. అందుకే, ముఖ వర్చస్సు పెరగడం దగ్గర్నుంచీ చిన్నచిన్న గాయలకి మందుగా ఇలా ఎన్నో రకాలుగా పసుపుని వాడతారు. అందానికి పసుపుని వాడినప్పుడు కేవలం చర్మానికి మాత్రమే పూస్తారనుకుంటాం. కానీ, దీని గుణాల కారణంగా కొన్ని రకాల జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి. పసుపులోని కర్కుమిన్ అనే సహజ సమ్మేళనంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టు, తల చర్మ సంరక్షణలో కీ రోల్ పోషిస్తాయి. అందుకోసం మరి పసుపుని ఎలా వాడాలో చెబుతున్నారు డాక్టర్ షిరీన్ ఫర్టాడో (సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ అండ్ కాస్మెటిక్ డెర్మటాలజీ, ఆస్టర్ సిఎమ్ఐ హాస్పిటల్, బెంగళూరు).

వాటర్ బాటిల్స్ కడిగినా కూడా వాసనలు వస్తున్నాయా, స్మెల్ దూరం చేసేందుకు బేకింగ్ సోడా, వెనిగర్ చాలు

0
నీరు తాగేటప్పుడు వాటర్ బాటిల్స్ నుంచి వాసనలు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి, ఎప్పటికప్పుడు చాలా మంది బాటిల్స్‌ని క్లీన్ చేస్తూనే ఉంటారు. కానీ, ఎంతగా క్లీన్ చేసినా కొన్నిసార్లు వాసనలు పోవు. అదో రకమైన వాసన వస్తుంది. దీంతో నీరు తాగాలనిపించదు. ఏం చేయాలో తెలియక చాలా మంది బాటిల్స్‌ని పక్కనపెట్టేయడం కొత్త బాటిల్స్‌ని తీసుకొస్తుంటారు. కానీ, వాటిని కొన్ని రోజులు వాడగానే మళ్ళీ అవే వాసనలు వస్తుంటాయి. దీనికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి. ఆ కారణాలని దూరం చేయాలి. ఆ తర్వాత బాటిల్స్‌ని ఇంట్లో ఉండే పదార్థాలైన బేకింగ్ సోడా, వెనిగర్‌తో ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి. కొన్ని అధ్యయనాల ప్రకారం బేకింగ్ సోడాలోని గుణాల కారణంగా ఈ సోడాతో క్లీన్ చేస్తే చక్కగా బాటిల్స్ క్లీన్ అవుతాయి. ఇలాంటి విషయాలని తెలుసుకోండి.

చాలా మంది పిల్లలు ప్రోగ్రెస్ కార్డు ఎందుకు దాస్తారు? తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే

0
“నీకు 95 మార్కులు వచ్చాయి, వెరీ గుడ్” అనడం కంటే, “నువ్వు ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదివావు, ఆ కష్టానికి ఫలితం దక్కింది” అని మెచ్చుకోవడం వల్ల పిల్లల్లో చదువుపై ఆసక్తి స్థిరంగా ఉంటుంది. చరిత్రలో గొప్ప విజయాలు సాధించిన వారు కూడా అనేక వైఫల్యాలు దాటినవారే. వైఫల్యం ఒక ముగింపు కాదు, అది మరింత మెరుగవ్వడానికి ఒక సూచిక మాత్రమేనని తెలియజెప్పండి. పిల్లల ప్రోగ్రెస్ కార్డు చూసినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసుకోండి.

The Paradise Movie: నాని ‘ప్యారడైజ్’లో కేసీఆర్, ఎన్టీఆర్.. రాకేష్ మాస్టర్‌కు స్పెషల్ ట్రిబ్యూట్

0
హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ప్రారంభంలో దివంగత ప్రముఖులు కోట శ్రీనివాసరావు, గద్దర్, రామోజీరావులతో పాటు ‘ఆయే షేర్’ సాంగ్ ట్రెండింగ్‌కు కారణమైన కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్‌కు చిత్రబృందం ప్రత్యేక నివాళులర్పించింది. అలాగే కథలో భాగంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రలో ప్రియదర్శి, ఎన్టీఆర్ లుక్‌లో విజయ్ కుమార్‌ల క్యామియో సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Shah Rukh Khan Net Worth: ఆస్తి తగ్గినా షారుక్‌ ఖానే ‘కింగ్’.. అత్యంత సంపన్నులైన భారతీయ నటులు వీరే!

0
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ దేశంలోనే అత్యంత ధనిక నటుడిగా మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. గత ఏడాడితో పోలిస్తే ఆయన ఆస్తి విలువ తగ్గినా, మిగతా నటులతో పోలిస్తే ఆయన చాలా ముందంజలో ఉన్నారు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్’ సినిమాలో నటిస్తున్నారు.