HomeUncategorizedఏపీలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. వర్షాలతో అతలాకుతలం.. పలు విమానాలు రద్దు, దారి మళ్లింపు!

ఏపీలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. వర్షాలతో అతలాకుతలం.. పలు విమానాలు రద్దు, దారి మళ్లింపు!

Andhra Pradesh Rains : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాల ప్రభావంతో పలు విమనాలు రద్దయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రతికూల వాతావరణం, దట్టమైన మేఘాల కారణంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు పలు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.

భారత వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం – పోలాకి మధ్య తీరాన్ని దాటింది. తీరం దాటినప్పటికీ దీని ప్రభావం మరో 12 గంటల పాటు తీవ్రంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.

తీరం దాటే సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విజయనగరం జిల్లా తెర్లాం, బాడంగి, డెంకాడ మండలాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందస్తు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

వాతావరణంలో హఠాత్తుగా వచ్చిన మార్పులు, విజిబిలిటీ తగ్గడం వల్ల ఎయిర్‌పోర్టు అధికారులు పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు మరికొన్నింటిని రద్దు చేశారు. విశాఖపట్నం – విజయవాడ (ఇండిగో) ప్రతికూల పరిస్థితుల వల్ల ల్యాండింగ్ సాధ్యం కాకపోవడంతో ఈ విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు.హైదరాబాద్ – రాజమహేంద్రవరం (స్టార్ ఎయిర్‌లైన్స్) రాజమండ్రి వద్ద అనుకూలించని వాతావరణం కారణంగా బెంగళూరుకు డైవర్ట్ చేశారు. విమాన ప్రయాణాలు పెట్టుకున్నవారు విమానాశ్రయానికి బయలుదేరే ముందే ఆయా ఎయిర్‌లైన్స్ సంస్థలను సంప్రదించి, కరెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని ఎయిర్‌పోర్టు అథారిటీ కోరింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments