Hero Motors IPO: భారత స్టాక్ మార్కెట్లు వారాంతంలో కూడా ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. కిందటి రోజు సూచీలు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆరంభంలో సూచీలు లాభాల్లోనే ఉన్నా ప్రస్తుతం మధ్యాహ్నం వేళ లాభాల్ని కరిగించుకున్నాయి. ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అయినప్పటికీ 2 రోజుల కిందట మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో మోటార్స్ ఐపీఓ మళ్లీ 20 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. దీంతో ఈ ఐపీఓ కాసుల పంట పండిస్తూనే ఉంది.
ఐరాస వేదికగా పర్యావరణ పరిరక్షణపై భారత్, చైనాలకు నేపాల్ ప్రధాన మంత్రి కీలక విజ్ఞప్తి
గత నెలలో నేపాల్‌లో మంచుచరియలు విరిగిపడి… ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ విపత్తులో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది ఆచూకీ గల్లంతయ్యారు. ప్రకృతి ప్రకోపానికి నేపాల్ చిగురుటాకులా వణికిపోయింది. అనేక పట్టణాలు, గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక మెకానిజమ్ ఏర్పాటుచేయాలని కోరుతూ భారత్, చైనాలకు నేపాల్ ప్రధాన మంత్రి ఐరాస వేదికగా పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన తమ దేశానికి జరిగిన నష్టాన్ని వివరించారు.
ఆఫీస్ టూర్‌లో సానా బాత్‌లో నిద్రపోయిన టెక్కీ.. ఊడిపోయిన ఉద్యోగం.. రూ.9,637 కోట్ల పరిహారానికి ట్రిబ్యునల్ మద్దతు
పని పర్యటనలో గది తాళం మరచిపోయి సానా బాత్‌లో నిద్రపోయారనే కారణంతో ఉద్యోగం కోల్పోయిన మాజీ టెక్ ఎగ్జిక్యూటివ్ షానన్ బర్న్స్.. బ్రిటన్ ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్‌లో విజయం సాధించారు. ఏడీహెచ్‌డీ దివ్యాంగురాలైన తనను అన్యాయంగా తొలగించారని వేసిన కేసులో రూ.9,637 కోట్ల భారీ పరిహారాన్ని కోరడానికి ట్రిబ్యునల్ అనుమతిని ఇచ్చింది. అయితే కంపెనీ విధించాలి అనుకున్న పరిహారం పరిమితి పిటిషన్‌ను సైతం ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
3 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భర్తతో విభేదాలు.. సిద్దిపేటలో ట్రాన్స్‌జెండర్ సునంద ఆత్మహత్య!
సిద్దిపేటలో ట్రాన్స్‌జెండర్ సునంద ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. కొన్నేళ్ల క్రితం అజయ్‌కుమార్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న ఆమెకు ఆ తర్వాత భర్తతో మనస్పర్థలు ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తన భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నారనే ఆరోపణలతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని చెప్పారు. ఇటీవల ఇద్దరూ విడివిడిగా ఉండేందుకు బాండ్ పేపర్ రాసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సునంద ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందారు.
ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఆ యూనియన్‌కే.. బొంతు రామ్మోహన్‌కు కీలక బాధ్యతలు
టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో రాజకీయ పార్టీల మద్దతు అంశం చర్చనీయాంశంగా మారిన వేళ.. టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఎన్నికల సమన్వయం బొంతు రామ్మోహన్‌కు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు పలు కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. అక్టోబర్ 9న రహస్య బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్ 17న ఫలితాలు ప్రకటించనున్నారు.
ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ వచ్చేస్తున్నాయ్.. హైదరాబాద్ సిటీ టూరిస్ట్ స్పాట్‌లు చుట్టేయొచ్చు..!
హైదరాబాద్ నగర పర్యాటకులకు త్వరలో ఓపెన్ టాప్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కొత్త బస్సులను సమకూర్చుకునేందుకు ప్రతిపాదనలు ఆహ్వానించింది. బస్సులోని పైఅంతస్తు పూర్తిగా ఓపెన్‌గా.. కింది డెక్ ఏసీ సౌకర్యంతో ఉండేలా వీటిని రూపొందించనున్నారు. మరోవైపు హెచ్ఎండీఏ వద్ద ఉన్న 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను కూడా టూరిజం శాఖ పరిధిలోకి తీసుకొచ్చి నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో నడిపే యోచన ఉంది. దీంతో పాత డబుల్ డెక్కర్ జ్ఞాపకాలకు ఆధునిక టూరిజం రూపం రానుంది.
ఒకవైపు గణేష్ నిమజ్జనాలు, మరోవైపు శుక్రవారం ముస్లిం ప్రార్థనలు.. చార్మినార్ వద్ద హై అలర్ట్
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు కొనసాగుతున్న సమయంలో శుక్రవారం ప్రార్థనలు కూడా ఉండటంతో చార్మినార్ పరిసరాల్లో పోలీసులు భద్రతను మరింత పెంచారు. కీలక ప్రాంతాల్లో బాంబ్ డిటెక్షన్ బృందాలు, ప్రత్యేక పోలీసు బలగాలతో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిఘా పెట్టడంతో పాటు కొన్ని దుకాణాలను మూసివేయించారు. నగరవ్యాప్తంగా వేలాది మంది పోలీసులు, వేల సంఖ్యలో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా కొనసాగుతోంది. నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండగా, శోభాయాత్రలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు.
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు.. సాహితీ ఇన్‌ఫ్రా కేసులో సమన్లు
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సాహితి ఇన్‌ఫ్రా నుంచి అరికెపూడి గాంధీకి సంబంధించిన బ్యాంకు అకౌంట్లలోకి సుమారు రూ.2.1 కోట్ల నిధులు బదిలీ అయినట్లు దర్యాప్తులో ఈడీ గుర్తించింది. ఈ లావాదేవీల స్వభావం, ఉద్దేశం, వాటికి చట్టబద్ధమైన వ్యాపార కారణాలు ఉన్నాయా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
సీఎస్కే హెడ్ కోచ్‌గా జహీర్.. ‘చాలా మంచి నిర్ణయం’ అని పొగిడిన భారత్ మాజీ క్రికెటర్!
ఐపీఎల్ 2027 కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను ఎంపిక చేయడంపై మాజీ భారత క్రికెటర్ వసీం జాఫర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఒక భారతీయుడు హెడ్ కోచ్ కావడం ఆనందంగా ఉందన్న జాఫర్, ఎల్‌ఎస్‌జీ కేవలం ఏడాదికే జహీర్‌ను వదులుకోవడం ఆశ్చర్య పరిచిందన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌ను ప్రశాంతంగా ఉంచుతూ ప్లేయర్ల మైండ్‌సెట్‌ను అర్థం చేసుకునే అద్భుత ప్రతిభ జహీర్ సొంతమని, సీఎస్కేకి అతడు సరైన మార్గదర్శి అని జాఫర్ కొనియాడాడు.
ఏషియన్ గేమ్స్ 2026లో నేపాల్ సంచలనం.. అఫ్గానిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం!
ఏషియన్ గేమ్స్ 2026 గ్రూప్-ఏ పోరులో నేపాల్ జట్టు అఫ్గానిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. నేపాల్ స్పిన్నర్లు కుశాల్ భుర్తేల్ (4 వికెట్లు), లలిత్ రాజ్‌బన్షి (3 వికెట్లు) విరుచుకుపడటంతో అఫ్గానిస్థాన్ 102/7 పరుగులకే పరిమితమైంది. అనంతరం 103 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ తొలుత తడబడినప్పటికీ, సుందీప్ జోరా (34), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (33*) ఆదుకోవడంతో 17.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.

