HomeTELANGANAఒకవైపు గణేష్ నిమజ్జనాలు, మరోవైపు శుక్రవారం ముస్లిం ప్రార్థనలు.. చార్మినార్ వద్ద హై అలర్ట్

ఒకవైపు గణేష్ నిమజ్జనాలు, మరోవైపు శుక్రవారం ముస్లిం ప్రార్థనలు.. చార్మినార్ వద్ద హై అలర్ట్

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రలు కొనసాగుతున్న సమయంలో శుక్రవారం ప్రార్థనలు కూడా ఉండటంతో చార్మినార్‌ పరిసరాల్లో పోలీసులు భద్రతను మరింత పెంచారు. కీలక ప్రాంతాల్లో బాంబ్‌ డిటెక్షన్‌ బృందాలు, ప్రత్యేక పోలీసు బలగాలతో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిఘా పెట్టడంతో పాటు కొన్ని దుకాణాలను మూసివేయించారు. నగరవ్యాప్తంగా వేలాది మంది పోలీసులు, వేల సంఖ్యలో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా కొనసాగుతోంది. నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండగా, శోభాయాత్రలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments