HomeNation and Worldఅసిమ్ మునీర్ ఇరాన్ పర్యటనపై రక్షణ మంత్రిని ఎగతాళి చేసిన పాక్ ఎంపీ.. వీడియో వైరల్

అసిమ్ మునీర్ ఇరాన్ పర్యటనపై రక్షణ మంత్రిని ఎగతాళి చేసిన పాక్ ఎంపీ.. వీడియో వైరల్

పాకిస్థాన్‌లో షెహబాజ్ షరీఫ్ నాయకత్వంలో నామామాత్రపు ప్రభుత్వమే. అధికారం అంతా సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌దే. పెత్తనం చెలాయిస్తోన్న మునీర్.. విదేశాలతో ఒప్పందాలు, చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన ప్రాంతీయ స్థాయి భద్రతా సమావేశానికి మునీర్ హాజరయ్యారు. దీనిపై తాజాగా పాక్ పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ నేత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రక్షణ మంత్రి ఈ సమావేశానికి ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments