HomeLifestyleలక్షణాలు లేవని బీపీని నిర్లక్ష్యం చేస్తే పక్షవాతమే, కంట్రోల్ చేసేందుకు డాక్టర్లు చెబుతున్న చిట్కాలు!

లక్షణాలు లేవని బీపీని నిర్లక్ష్యం చేస్తే పక్షవాతమే, కంట్రోల్ చేసేందుకు డాక్టర్లు చెబుతున్న చిట్కాలు!

క్లినికల్ ప్రాక్టీస్‌లో వైద్యులు తరచూ ఒక ప్రధానమైన అపోహను గమనిస్తారు. అది ఏంటంటే.. “నాకు ఎలాంటి అసౌకర్యం లేదు, కాబట్టి నా గుండె, రక్తనాళాలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాయి” అని పేషంట్లు అనుకోవడం. అందుకే అధిక రక్తపోటు (హై బీపీ)ని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. చాలా సందర్భాల్లో తలనొప్పి, కళ్లు తిరగడం లేదా నీరసం వంటి సాధారణ లక్షణాలు కూడా ఏమీ కనిపించవు. బాధితుడు రోజువారీ పనుల్ని చాలా యాక్టివ్‌గా చేసుకుంటూనే ఉండొచ్చు. కానీ లోపల అధిక రక్తపోటు క్రమంగా మెదడులోని సూక్ష్మ రక్తనాళాల్ని దెబ్బతీస్తూనే ఉంటుంది.

​పక్షవాతం (స్ట్రోక్) అనేది ఏదో ఒక క్షణంలో అకస్మాత్తుగా ఊడిపడేది కాదు. ఏళ్ల తరబడి చికిత్స తీసుకోకుండా వదిలేసిన గుండె-రక్తనాళాల ఒత్తిడి ఫలితంగానే అది సంభవిస్తుంది. హై బీపీ మెదడులోని రక్తనాళాల గోడల్ని బలహీనపరుస్తుంది. దీనివల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం లేదా రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం జరగడం వంటి ప్రమాదాలు పెరుగుతాయి. హై బీపీ లక్షణాలు లేకపోయినా ప్రమాదమే అని డాక్టర్లు సూచిస్తున్నారు. దీని గురించి డాక్టర్ సంకేత్ పాటిల్ (కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, హెచ్‌సీజీ సుచిరాయు హాస్పిటల్, హుబ్బళ్ళి) పూర్తి వివరాలు అందించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments