వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అధికార బీజేపీకి ఎంతో ముఖ్యమో.. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీకి అంతే కీలకం. వరుసగా రెండుసార్లు గెలిచి అధికారం చేపట్టిన బీజేపీని.. అడ్డుకోవడం ఎస్పీకి అంత సులభం కాదు. బీజేపీకి భారీ మద్దతుదారులైన మహిళల ఓట్లను గెలుచుకోవడం చాలా కీలకం. ఈ విషయంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఇప్పుడు అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


