రైలు ప్రయాణంలో కొందరు పక్కన ఉన్నవాళ్ల గురించి ఏమాత్రం ఆలోచించకుండా.. ఫోన్లో గట్టిగా మాట్లాడటం, లౌడ్ స్పీకర్లు పెట్టుకుని వీడియోలు చూడటం, పాటలు వినడం చేస్తుంటారు. కానీ, అలా చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే చట్టం ఉందని తెలుసా? ఇదే విషయాన్ని దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. వెయ్యి జరిమానా.. ఆరు నెలల వరకు జైలు శిక్ష తప్పదని దక్షిణ రైల్వే తన ఉత్తర్వుల్లో పేర్కొంది.


