ముంబయిలోని జుహు ప్రాంతంలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో టైగర్ ష్రాఫ్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడగా.. ఆయన డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. అయితే దాడి అనంతరం టైగర్ ష్రాఫ్ తొలి ఫొటో విడుదల అయింది. అందులో ఆయన చేతికి, ఛాతీకి గాయాలు కాగా వాటికి కట్టు కట్టి ఉంది. మరోవైపు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే ముంబయిలో గుండాయిజం సాగనివ్వమని హెచ్చరించారు.


