ఆమె ఓ సీనియర్ ఆర్మీ అధికారి భార్య. కానీ, చైనా ఏజెంట్లు విద్యావేత్తల ముసుగులో ఆమెతో పరిచయం పెంచుకున్నారు. తమకు వ్యాసాలు రాయాలని కోరారు. పథకం ప్రకారం తొలుత పర్యావరణం, భౌగోళి, రాజకీయ అంశాల గురించి రాయమని చెప్పారు. తర్వాత దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై కథనాలు రాయించి, అత్యంత సున్నితమైన సమాచారం, ఫోటోలను ఆమె ద్వారా పొందినట్టు తెలిసింది. దీంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు ఆమెపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
చైనా ఏజెంట్లకు కీలక సమాచారం చేరవేసిన ఆర్మీ అధికారి భార్య.. కశ్మీర్లో తెలుగు మహిళపై కేసు
RELATED ARTICLES


