రాజమహేంద్రవరం మరింత కొత్తగా రూపాంతరం చెందుతోంది. కార్పొరేషన్లో కొత్తగా మరో 11 గ్రామాలు విలీనమయ్యాయి. అవన్నీ నగర పాలక సంస్థ పరిధిలోకి వచ్చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విలీనంతో నగర విస్తీర్ణం దాదాపు రెట్టింపు అయినట్టైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న హుకుంపేట, పిడింగొయ్యి, శాటిలైట్ సిటీ, ధవలేశ్వరం సహా గ్రామాలు కార్పొరేషన్లో విలీనం చేశారు. అలాగే నగరపాలక సంస్థలో డివిజన్ల సంఖ్యను 72కి పెంచుతూ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
మారిన రాజమండ్రి రూపురేఖలు.. కొత్తగా 72 డివిజన్ల ఏర్పాటు … ఏఏ గ్రామాలు విలీనం అయ్యాయంటే?
RELATED ARTICLES


