Home Blog Page 88

వారసత్వంగా వచ్చే ఆస్తిపై 55 శాతం పన్ను.. తెరపైకి సంచలన ప్రతిపాదన.. సామాన్యులు, ధనవంతుల్లో ఎవరిపై ప్రభావం?

0
Inheritance Tax: తాతముత్తాతలు, తల్లితండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తిపై భారత్‌లో ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అయితే, ప్రపంచంలోని దిగ్గజ దేశాలకు భారత్ పోటీ ఇవ్వాలంటే వారసత్వంగా వచ్చే ఆస్తిపై పన్ను ఉండాలని, 55 శాతం మేర ట్యాక్స్ విధించాలని హాట్‌మెయిల్ ఫౌండర్ సబీర్ భాటియా సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో తీవ్ర చర్చ మొదలైంది. అయితే, ఈ ట్యాక్స్ ధనవంతులు, సామాన్య మధ్య తరగతి ప్రజల్లో ఎవరిపై ప్రభావం పడుతుంది?

SBIలో శాలరీ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్.. ATM ఉచిత లావాదేవీల్లో భారీ కోత!

0
SBI Salary Account: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు శాలరీ అకౌంట్ ఉందా? అయితే ఇది మీకోసమే. వేతన ఖాతాలకు సంబంధించిన ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యలో ఎస్‌బీఐ భారీగా కోత పెట్టింది. ఏకంగా సగానికి తగ్గించింది. పరిమితి తెలుసుకోకుండా ట్రాన్సాక్షన్లు చేస్తే ఆ తర్వాత రుసుములు చెల్లించుకోవాల్సి రావస్తుంది. మరి కొత్త ఉచిత లావాదేవీల సంఖ్య ఎంత ? ఎలాంటి ఛార్జీలు ఉండనున్నాయి? ఆ వివరాలు తెలుసుకుందాం.

Jio Bharat: జియో ధమాకా ఆఫర్.. కేవలం రూ.299కే జియో భారత్ 4G ఫోన్.. 6 నెలలు ఉచిత రీఛార్జ్!

0
Jio Bharat: పండగల వేళ రిలయన్స్ జియో ధమాకా ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ.1499 ధరతో జియో భారత్ ఫోన్ అందిస్తోంది. అంతే కాదు ఈ ఫోన్ కొన్నవారికి 6 నెలల పాటు ఉచిత రీఛార్జ్ లభిస్తుంది. అంటే రూ.1200 పైగా ఆదా చేసుకోవచ్చని జియో తెలిపింది. మరి ఈ ఫోన్ గురించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.

భారత పైలట్‌కు ఇజ్రాయెల్ ప్రధాని సెల్యూట్.. హీరో అంటూ ముచ్చర్‌‌పై మోదీ, ట్రంప్ ప్రశంసలు

దుబాయ్ నుంచి టెల్ అవివ్ వెళ్తున్న విమానం కూలిపోకుండా అడ్డుకున్న భారత పైలట్ స్మిత్ ముచ్చర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత పైలట్‌కు సెల్యూట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని సెప్టెంబర్ 11 తరహా దాడులు జరగకుండా ముచ్చర్ అడ్డుకున్నాడని కొనియాడారు. స్మిత్ ముచ్చర్ హీరో అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.

గచ్చిబౌలిలో విదేశీయులతో వ్యభిచార దందా.. పోలీసుల అదుపులో ముగ్గురు ఉజ్బెకిస్థాన్‌ యువతులు

0
గచ్చిబౌలిలోని హోటల్‌లో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా ఆటను పోలీసులు కట్టించారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు యువకులు.. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి రూ.13 వేల నగదు, రెండు మొబైల్‌ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. విదేశీ మహిళల పాస్‌పోర్టులు, వీసాలు చెల్లుబాటులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా, మహిళలను హైదరాబాద్‌కు ఎవరు తీసుకొచ్చారు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ఖైరతాబాద్ ఉపఎన్నిక ఆపేసి.. ముందు నా సంగతి తేల్చండి.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి

0
ఖైరతాబాద్ ఉపఎన్నికపై కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 2024లో దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా ఈసీని ఆదేశించాలని కోరారు. దానం నాగేందర్ ఎన్నికల అఫిడవిట్‌లో కుటుంబ ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని ఆరోపిస్తూ విజయారెడ్డి గతంలో పిటిషన్ వేశారు. ఇప్పుడు విజయారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కీలకంగా మారింది.

ఈసీ ఆఫీస్ సహా హైదరాబాద్‌ను తగలబెడతాం.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

0
ఎస్ఐఆర్, ఓట్ల తొలగింపు వ్యవహారంపై దానం నాగేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు 20 వేల ఓట్లు తొలగించారని ఆరోపించారు. చాలాకాలంగా స్థానికంగా నివసిస్తున్న, గత ఎన్నికల్లో ఓటు వేసిన వారి పేర్లను కూడా తొలగించారని పేర్కొన్నారు. ఓట్లను తక్షణమే పునరుద్ధరించాలని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసీ తన వైఖరి మార్చుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఈసీ కార్యాలయాన్ని, హైదరాబాద్‌ను తగలబెడతామని హెచ్చరించారు.

OU Campus Cannabis Plant: ‘ఉస్మానియా యూనివర్సిటీలో అలాంటి మెుక్క మెలవటం ఆశ్చర్యకమైన విషయం’

0
Osmania University Ganja Plant: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి మొక్క కనిపించడం కలకలం రేపుతోంది. మొక్క సహజంగా మొలిచిందా? ఎవరైనా నాటారా? గంజాయి సిగరెట్‌ లేదా విత్తనాల ద్వారా మొలకెత్తిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యాంపస్‌లో మరెక్కడైనా ఇలాంటి మొక్కలు ఉన్నాయా అనే అంశంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యూనివర్సిటీ అధికారులు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించాలని, పోలీసులు విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని విద్యార్థి సంఘం నేతలు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు, క్యాంపస్‌ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

CMC WhatsApp Complaints: మీ కాలనీలో సమస్య ఉందా? వాట్సాప్‌లో ఫొటోలతో ఫిర్యాదు చేయండి

0
హైదరాబాద్‌ పరిధిలోని సైబరాబాద్‌ నగరపాలక సంస్థ ప్రజలకు కీలక అవకాశం కల్పించింది. కాలనీలు, బస్తీల్లో నెలకొన్న పౌర సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటికి పరిష్కారం పొందేలా వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. క్షేత్రస్థాయి పర్యటనల్లో తన దృష్టికి రాని సమస్యలను తెలుసుకునేందుకు సీఎంసీ కమిషనర్‌ జి.సృజన 90634 21347 వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు. అక్టోబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు ప్రజలు తమ సమస్యలను వాట్సాప్‌ ద్వారా తెలియజేయవచ్చని ప్రకటించారు. సమస్యకు సంబంధించిన వివరాలు, ఫొటోలు, వీడియోలు, గూగుల్‌ లొకేషన్‌ పంపించాలని సూచించారు.

ఒకే మ్యాచ్‌లో 5 సెంచరీలు.. క్రికెట్ హిస్టరీలోనే నెవర్ బిఫోర్ ఫీట్‌ సాధించిన భారత్, వెస్టిండీస్..!

0
భారత్, వెస్టిండీస్ మధ్య గువహటి వేదికగా జరిగిన రెండో వన్డే ప్రపంచ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. వన్డే క్రికెట్ 55 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో (5023 మ్యాచులు) ఎన్నడూ లేని విధంగా ఈ ఒక్క మ్యాచ్‌లోనే ఏకంగా 5 సెంచరీలు నమోదయ్యాయి. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో జాన్ క్యాంప్‌బెల్, షై హోప్, అమిర్ జంగూ శతకాలు బాదారు. భారత్ తరఫున రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగి ఈ ఆల్-టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేశారు.