Home Blog Page 77

రూ. 15 వేల సిప్‌తో 15 ఏళ్లలోనే కోటీశ్వరులయ్యారు.. ఈ 10 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌తో పట్టిందల్లా బంగారమే!

0
Best Mutual Funds SIP: మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇస్తుంటాయని నిపుణులు చెబుతుంటారు. ఇక్కడ చిన్న మొత్తాల్లో పెట్టుబడితోనూ ఆర్థిక క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ రన్‌‌లో మెరుగైన రాబడి వస్తుంది. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కారణంగా ఇక్కడ సంపద విపరీతంగా పెరుగుతుంటుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కేవలం రూ. 15 వేల సిప్ పెట్టుబడి పెట్టిన వారిని 15 ఏళ్లలో కోటీశ్వరుల్ని చేయడం విశేషం. వీటి గురించి ఇప్పుడు చూద్దాం.

BSNL రూ.51 ప్లాన్.. అపరిమిత కాల్స్+ రోజుకు 2GB+ 28 రోజుల వ్యాలిడిటీ.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్!

0
BSNL Rs 51 Plan: ఓ వైపు మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్న తురణంలో బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. కొత్త యూజర్ల కోసం రూ. 51 ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటాతో 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉన్న ప్లాన్ తీసుకొచ్చింది. అక్టోబర్ 31వ తేదీలోపు కొనే వారికే వర్తిస్తుంది. మరి ఈ ప్లాన్ గురించిన వివరాలు తెలుసుకుందాం.

పశ్చిమాసియాకు మరో 10 వేల మంది సైనికులతో అమెరికా మూడో యుద్ధ నౌక.. ఇరాన్‌పై మళ్లీ భారీ దాడి?

పశ్చిమాసియాలో యుద్ధానికి శుభం కార్డు వేయడానికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా లేరని ఆయన చేస్తోన్న ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికల వేళ.. మళ్లీ పశ్చిమాసియాకు భారీ ఎత్తున బలగాలను పంపడం చర్చనీయాంశంగా మారింది. నవంబరు 3న ఎన్నికలు జరగనున్నాయి. దీని తర్వాత ఇరాన్‌పై దాడికి ప్లాన్ చేస్తున్నట్టు నివేదికలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే మూడో విమానవాహక నౌక, మరో 10 వేల మంది సైనికులను అమెరికా పంపుతోంది.

ఇజ్రాయెల్ భద్రతా వైఫల్యంతోనే ఫ్లైదుబాయ్ విమానంలో ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

రెండు రోజుల కిందట దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు ప్రయాణికులతో బయలుదేరిన ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటుచేసుకున్న ఘటన యావత్తు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కాక్‌పిట్‌లో కెప్టెన్‌పై దాడిచేసిన కో- పైలట్ విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేని ఒమాన్ దేశానికి చెందిన పౌరుడు టెల్ అవీవ్‌కు వెళ్లే విమానం నడపడానికి అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, దీనికంతటికి ఇజ్రాయెల్ భద్రతా వైఫల్యమే కారణమని తాజాగా నివేదిక ఒకటి పేర్కొంది.

“ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి ప్రధాని మోదీ వద్ద మంచి ఉపాయాలున్నాయి”: పుతిన్

ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వద్ద పరస్పర ఆమోదయోగ్యమైన మంచి శాంతి ఆలోచనలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. తమ మధ్య మంచి స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ.. కలిసినప్పుడల్లా ప్రధాని మోదీ యుద్ధ ముగింపు గురించి ఒత్తిడి తెస్తుంటారని వెల్లడించారు. అలాగే భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచ దేశాలన్నింటికీ గొప్ప ఆదర్శమని పుతిన్ కొనియాడారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

“నన్ను చంపేయండి, నన్ను చంపేయండన్నాడు”: ఫ్లైదుబాయ్ కాక్‌పిట్ దాడి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన నెతన్యాహు!

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు యత్నించిన ఒమన్ కో-పైలట్ ఇస్లామిక్ తీవ్రవాద ప్రభావానికి గురయ్యాడని, ఆత్మహత్య ధోరణితోనే విమానంతో సహా అంతమవ్వాలని కుట్ర పన్నాడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ప్రయాణికులు కట్టడి చేసినప్పుడు “నన్ను చంపేయండి, నన్ను చంపేయండి” అని అతడు అరిచాడని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ ఘటనపై యూఏఈ ప్రభుత్వం ఉగ్రవాద కోణంలో పూర్తిస్థాయి విచారణ చేపడుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. కనీస ఛార్జీ రూ.30.. 12 ఏళ్ల తర్వాత కొత్త రేట్లు

0
తెలంగాణలో ఆటో ప్రయాణికులకు కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆటో మీటర్ రేట్లను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం తొలి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30గా, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.14గా నిర్ణయించారు. డిటెన్షన్ ఛార్జీ నిమిషానికి 75 పైసలకు పెరిగింది. నిబంధనలకు లోబడి అదనపు లగేజీకి ఒక్కో ప్యాకేజీకి 50 పైసలు వసూలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ ఛార్జీకి 1.5 రెట్లు చెల్లించాలి. కొత్త రేట్లకు అనుగుణంగా మీటర్లు సవరించుకునేందుకు ఆటో డ్రైవర్లకు 3 నెలల గడువు ఇచ్చారు.

రేవంత్‌కు చెమటలు పట్టిస్తాం.. సిరిసిల్ల సభకు కౌంటర్‌గా కొడంగల్‌లో బీఆర్ఎస్ సభ: మాజీమంత్రి తలసాని

0
సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సభకు కౌంటర్‌గా కొడంగల్‌లో బీఆర్‌ఎస్ భారీ సభ నిర్వహించనున్నట్లు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సిద్దిపేటలో సీఎం సభ తర్వాత కొడంగల్‌లో తమ పార్టీ సభ ఉంటుందని ఆయన తెలిపారు. కొడంగల్ సభతో రేవంత్‌రెడ్డికి చెమటలు పట్టిస్తామని వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో బలప్రదర్శన అవసరం లేదని విమర్శించారు. ఇదే సమయంలో ఖైరతాబాద్ ఉపఎన్నికపై కూడా తలసాని స్పందిస్తూ బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

దిల్‌సుఖ్‌నగర్‌ ఆలయంలో దారుణం.. అమ్మవారి విగ్రహంపై కర్రలతో దాడి, సీసీటీవీ వీడియో వైరల్

0
దిల్‌సుఖ్‌నగర్‌ సంతోషిమాత ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి పూజారిపై కర్రతో దాడికి ప్రయత్నించడంతో పాటు అమ్మవారి విగ్రహంపై కూడా కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనను గమనించిన భక్తులు వెంటనే అతడిని అడ్డుకుని పట్టుకున్నారు. అనంతరం చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలోని సీసీటీవీలో ఈ ఘటన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

హైదరాబాద్ పోలీస్‌లో భారీ మార్పులు.. 76 ప్రాంతాల్లో జోన్లు, డివిజన్ల ఛేంజ్, ఎయిర్‌పోర్టు పీఎస్‌కు కొత్త పేరు

0
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌లో ప్రభుత్వం భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. హోంశాఖ జారీ చేసిన కొత్త జీవో ప్రకారం నగరంలోని మొత్తం 76 ప్రాంతాలకు సంబంధించి జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్ల పరిధుల్లో మార్పులు చేశారు. ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ పేరును శంషాబాద్ పీఎస్‌గా.. ఆర్‌జీఐఏ డివిజన్‌ను శంషాబాద్ డివిజన్‌గా మార్చారు. చిక్కడపల్లి డివిజన్ కాచిగూడగా.. సంతోష్‌నగర్ డివిజన్ ఛత్రినాకగా మారింది. బడంగ్‌పేట్ పీఎస్‌ను రద్దు చేసి దాని పరిధిలోని ప్రాంతాలను ఇతర స్టేషన్లకు బదిలీ చేశారు. ట్రాఫిక్, ఉమెన్ సేఫ్టీ, జోనల్ సైబర్ సెల్‌ల పరిధుల్లోనూ మార్పులు చేశారు.