ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి అబుదాబి ఆసుపత్రిలో చేరిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, శస్త్రచికిత్స తర్వాత ఆయన చికిత్సకు బాగా స్పందిస్తున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యుఏఈలోని భారత రాయబార కార్యాలయం వైద్యులు, స్థానిక అధికారులు, పైలట్ కుటుంబ సభ్యులతో నిరంతరం టచ్‌లో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ప్రతీ ఏటా ఆస్తులు, అప్పుల వివరాలు తెలపాల్సిందే: ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు సర్కారు సంచలన ఆదేశాలు
తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులు అందరూ తమ స్థిర, చరాస్తులతో పాటు అప్పుల వివరాలను ఐఎఫ్‌హెచ్‌ఆర్‌ఎంఎస్ (IFHRMS) ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తప్పనిసరిగా దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా ఆస్తుల సమర్పణ పూర్తి చేయని ఉద్యోగుల ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని, ఈ వివరాలను ఉద్యోగుల యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ACR)లో నమోదు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు భద్రత పెంపు.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ మరింత పటిష్టం: ‘SIR’ నిరసనల వేళ సర్కారు నిర్ణయం
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వివాదంపై ప్రతిపక్షాల నిరసనలు మిన్నంటిన వేళ.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ భద్రతను అధికారులు పటిష్టం చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసం, ఆగ్రాలోని కుటుంబ సభ్యుల ఇల్లు, ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద ఆందోళనలు జరగడంతో భద్రతా అంచనా ఆధారంగా ఆయనకున్న ‘జెడ్ ప్లస్’ సెక్యూరిటీని మరింతగా పెంచుతూ… అదనపు బలగాలను కేటాయించారు. దీంతో ఇప్పుడు ఆయన కట్టుదిట్టమైన భద్రత నడుమే తన పనులు చేస్కుంటున్నారు.
గుండె ఆగుతున్నా స్టీరింగ్ వదల్లేదు.. 40 మంది ప్రయాణికులను కాపాడి కన్నుమూసిన ఆర్టీసీ డ్రైవర్
అనకాపల్లి జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. 40 మంది ప్రయాణికులున్న కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్లే నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సులో ఆర్టీసీ డ్రైవర్‌కు గుండె నొప్పి వచ్చింది. తునిలో ఆయనకు ఛాతిలో నొప్పి మొదలవ్వగా.. నక్కపల్లి వరకు ఓర్చుకున్నారు. అక్కడ నొప్పి ఎక్కువవడంతో ఆయన ముందు ప్రయాణికుల కోసం ఆలోచించి.. సేఫ్ ప్లేస్‌లో బస్సును ఆపి.. సీటులోనే కుప్పకూలిపోయారు. దాంతో ప్రయాణికులు ఆయనకు సీపీఆర్ చేసి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్దారించారు.
“నా చుట్టూ మగవాళ్లే ఉన్నారు.. భయంగా ఉంది”.. ఆంధ్రాలో యువతి మృతదేహం, మిస్టరీగా మారిన మృతి
అస్సాంకు చెందిన ఓ యువతి మృతదేహం ఆంధ్రప్రదేశ్‌లో లభ్యమైంది. ఈ మృతి ఇప్పుడు మిస్టరీగా మారింది. డాన్స్ ప్రోగ్రామ్ కోసం ఆంధ్రాకు వచ్చి, తిరిగి తన సొంతూరికి వెళ్తున్న 20 ఏళ్ల గిరిజన యువతి ట్రైన్‌లో అదృశ్యమైంది. దాంతో వారి తల్లిదండ్రులు ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా. ఆ యువతి మృతదేహం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో కనిపించింది. అయితే ఆ యువతి మృతికి కారణాలు తెలియరాలేదు. అసలు ఆ రాత్రి ట్రైన్‌లో ఏం జరిగింది? ఆమెను ఎవరైనా వేధించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తురాలి కానుక.. రెండు బంగారు పగడాల హారాలు విరాళం
Hyderabad Devotee Donated Two Bangaru Pagadala Haralu To Tirumala Temple: తిరుమల శ్రీవారికి మరోసారి భక్తుల నుంచి కానుకలు, విరాళాలు అందాయి. తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు రెండు బంగారు పగడాల హారాలను అందజేశారు. ఈ రెండు హారాల విలువ రూ.25 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన భక్తుడు, అమెరికాకు చెందిన మరో భక్తుడు టీటీడీ బర్డ్, ప్రాణదాన ట్రస్ట్‌లకు చెరో రూ.10 లక్షల చొప్పున విరాళాను అందజేశారు.
జనసేన పార్టీలో చేరడం లేదు.. తేల్చి చెప్పిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే స్వామి
Kolagatla Veerabhadra Swamy Respond On Party Change Rumours: విజయనగరం జిల్లాలో మరో మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విజయనగరం మాజీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్ర స్వామి జనసేన పార్టీలోకి వెళతారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ ఊహాగాానాలపై కొలగట్ల స్పందించారు.. తాను పార్టీ మారతానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను కొద్దిరోజులుగా విజయనగరంలో ఉండటంలేదని.. ఇంతలో తాను పార్టీ మారబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి టీడీపీ ఎంపీలు.. విజయవాడ ఉత్సవ్-2.0కు ఆహ్వానం
TDP Mps Meet Telangana Cm Revanth Reddy In Delhi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఢిల్లీలో రేవంత్‌ను కలిసిన ఎంపీలు విజయవాడలో నిర్వహించే దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్-.2.0కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. టీడీపీ ఎంపీలు విజయవాడ ఉత్సవ్ వేడుకలు, దసరా ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారు. రెండు రోజుల క్రితం తమిళనాడు సీఎం విజయ్‌ను కూడా ఆహ్వానించారు.
ఏపీలో వారందరికి నోటీసులు.. ఇళ్లు కట్టుకుంటారా? లేదా? చెప్పాలి.. స్థలం వద్దనుకుంటే వెనక్కి ఇవ్వాలి!
AP Govt Committee To Resolve House Site Issues: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లకు ఇక కొత్త కేటాయింపులు, లబ్ధిదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. ఒకవేల ఇల్లు కట్టుకునేందుకు ఆసక్తి ఉన్నవారికి ప్లాట్లు ఇవ్వాలని.. ప్లాట్లు దక్కిన వారు తమకు వద్దనుకుంటే మరో ప్రాంతంలో ఇవ్వాలని ఆదేశించారు. ఇళ్ల స్థలాల సమస్యల్ని పరిష్కరించడానికి ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు, గరుడ సేవకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
Tirumala Dasara Navaratri Brahmotsavam 2026 Garuda Seva: తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 12 నుంచి దసరా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.. ఈ నెల 20 వరకు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవకు భక్తులు భారీగా తరలివస్తారు. ఈసారి పెరటాసి మాసం కూడా ఉండటంతో టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. గరుడ సేవ రోజు భక్తులు తిరుపతిలోనే వాహనాలను పార్క్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలీసులు, టీటీడీ సూచనలు పాటించాలంటున్నారు.

