Visakhaptanam Parvathipuram Special Train 07268 And 07267: ఉత్తరాంధ్ర ప్రజలకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. పార్వతీపురానికి మరో కొత్త రైలును ప్రకటించింది.. విశాఖపట్నం నుంచి పార్వతీపురానికి కొత్త రైలు శనివారం నుంచి పట్టాలెక్కనుంది. ఈ నెల 10 నుంచి 20 తేదీ వరకు ఈ రైలు నడుస్తుంది. దసరా రద్దీని గమనించి రైల్వేశాఖ ఈ రైలును ప్రకటించింది. ప్రయాణికులు ఈ రైలు సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
ఏపీలో విద్యుత్ వినియోగదారులకు అద్భుత అవకాశం.. OTS కింద సగం కడితే చాలు.. పెండింగ్ బిల్లులపై పెనాల్టీ, వడ్డీ ఉండదు!
APERC OTS For Electricity Arrears Collection: ఏపీలో విద్యుత్ బకాయిదారులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఓటీఎస్‌కు ఏపీఈఆర్‌సీ అనుమతించింది. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల విద్యుత్ వినియోగదారులకు వెసులుబాటు కల్పించింది. ఓటీఎస్ పరిధిలోకి బకాయిలు రూ.800 కోట్లు ఉన్నాయని అంచనా వేశారు.ఓటీఎస్ కింద సగం కడితే చాలు..పెనాల్టీ, వడ్డీ ఏమీ ఉండవు అంటున్నారు. వినియోగదారులు రూ.400 కోట్లు కట్టాల్సి ఉంటుంది.. వడ్డీ, పెనాల్టీ మినహాయింపు రూ.400 కోట్లు మాఫీ అవుతుందని చెబుతున్నారు.
తిరుమలలో భక్తుల కష్టాలకు చెక్.. వేంకటాద్రి పేరుతో కొత్త యాప్.. ఇంటర్నెట్ లేకపోయినా పర్లేదు!
TTD To Launch Govinda Voice Assistant For Devotees In Tirumala: తిరుమలలో లొకేషన్స్ తెలియక ఇబ్బందిపడే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కొండపై భక్తులు ఆయాప్రాంతాలకు సులభంగా వెళ్లేందుకు ఓ యాప్‌ను తీసుకొస్తోంది. వేంకటాద్రి పేరుతో లాంఛ్ చేయబోతున్న ఈ యాప్ ద్వారా తిరుమలలో లొకేషన్స్‌కు ఈజీగా వెళ్లొచ్చు. తిరుమలలో దాదాపు 100కుపైగా ప్రాంతాలకు వెళ్లేందుకు యాప్ సాయపడుతుంది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో 34శాతం బీసీ రిజర్వేషన్లు.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం
Supreme Court Verdict On On 34 Percent BC Reservation: ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై మరోసారి నిరాశ ఎదురైంది. సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఏపీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పు రావడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు.
టీడీపీ నేతను కొత్త పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇద్దరు నేతలు
Vijayasai Reddy Invites Ov Ramana: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు కాలినడకన చేరుకున్న ఆయన.. ఇవాళ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అంతేకాదు తన కొత్త పార్టీలోకి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ రమణను ఆహ్వానించారు. ఓవీ రమణ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అలాగే రమణ, విజయసాయిరెడ్డి కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్?
Tamil Nadu Cm Vijay To Visit Vijayawada Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడు సీఎం విజయ్‌ను దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు ఆహ్వానించింది. టీడీపీ ఎంపీలు విజయ్‌ను కలిసి ఆహ్వానించారు.. అయితే విజయ్ విజయవాడ పర్యటనకు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే తమిళనాడు ప్రభుత్వం సీఎం విజయ్ పర్యటనకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.
శ్రీకాళహస్తి ఆలయానికి 500 కిలోల వెండి.. అడ్డుగా మారిన నిబంధనలు, హైదరాబాద్ మింట్ ద్వారా కొనుగోలు?
Srikalahasti Temple 500 Kg Silver: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి దేవాదాయశాఖ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. శ్రీకాళహస్తి ఆలయం కోసం 500 కిలోల వెండిని కొనుగోలు చేసేందుకు అనుమతి వచ్చిందని తెలుస్తోంది. రూ.12.25 కోట్లతో 999 నాణ్యత ఉన్న వెండిని కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వాస్తవానికి సింహాచలం ఆలయం నుంచి నేరుగా కొనుగోలు చేయాలని భావించారు.. కానీ అలా కొనుగోలు చేయడానికి అవకాశం లేకపోవడంతో హైదరాబాద్ మింగట్ ద్వారా కొనుగోలు చేయనున్నారు.
రేషన్‌కార్డులు ఉన్నవారికి ముఖ్యమైన గమనిక.. కార్డుకు మొబైల్ నంబర్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి!
AP Ration Card Holders Link Their Mobile Numbers: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులకు సంబంధించి ముఖ్యమైన గమనిక. రేషన్‌కార్డులు ఉన్నవారు వారి మొబైల్ నంబర్‌ను లింక్ చేయాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని.. మొబైల్ నంబర్ అనుసంధానం తప్పనిసరి అంటున్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు. అలాగే ఈకేవైసీ పెండింగ్ ఉన్నవారు కూడా వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.

