Home Blog Page 6

నవనీతమ్ నవీ పిళ్లై… సాధారణ బస్సు డ్రైవర్ కుమార్తె నుంచి నోబెల్ శాంతి బహుమతి విజేతగా..

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం నోబెల్ శాంతి బహుమతి 2026కు భారత సంతతి మహిళను ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాలో సాధారణ భారతీయ కుటుంబంలో పుట్టిన ఆమె.. చిన్నతనం నుంచి పేదరికంతో పోరాటం చేశారు. ఏడుగురు సంతానంలో ఒకరైన ఆమె.. జాతివివక్షపై గళమెత్తారు. న్యాయవాద విద్యను అభ్యసించిన ఆమె.. దక్షిణాఫ్రికా హైకోర్టుకు న్యాయమూర్తి అయిన తొలి నల్లజాతి మహిళగా రికార్డుల్లోకి ఎక్కారు. ఐరాస మానవహక్కుల విభాగం హైకమిషనర్‌గానూ ఆమె సేవలను అందించారు.

కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కి ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం.. ఏ విదేశీయుడికీ దక్కని అరుదైన గౌరవం

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానంలో కో-పైలట్ చేసిన తీవ్ర దాడిలో గాయపడినప్పటికీ.. సమయస్ఫూర్తితో వ్యవహరించి 170 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యున్నత శౌర్య పురస్కారాన్ని ఇవ్వబోతున్నట్లు తెలిపింది. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ ఇస్తామని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రయాణికులను కాపాడటమే కాకుండా తమ దేశంలో విమానం కూలిపోకుండా చేయడం నిజంగా గొప్ప విషయమని ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు.

మరిన్ని రాష్ట్రాలుగా పాకిస్థాన్.. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ‘విభజించు పాలించు’ సిద్ధాంతం

భారత దేశ విభజన తర్వాత ప్రత్యేక దేశంగా ఏర్పడిన పాకిస్థాన్‌లో నాలుగు ప్రావిన్సులు ఉన్నాయి. పాక్ ఆవిర్భావం నుంచి ఈ నాలుగు రాష్ట్రాలే కొనసాగుతుండగా.. ఇప్పుడు వీటిని మరిన్ని ముక్కలు చేయాలని పాక్ అనధికారిక పాలకుడు సైన్యాధిపతి అసీమ్ మునీర్ ప్లాన్ చేస్తున్నాడు. పరిపాలనకు కష్టంగా ఉందని అంటున్నా.. లోపల మాత్రం ఆయన ఉద్దేశం వేరు. 12 లేదా 16 రాష్ట్రాలుగా విభజించి స్వయంగా తాను నియమించిన ప్రతినిధులు ద్వారా పాలన సాగించాలనేది అతడి ఎత్తుగడ.

గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి ఐటీ దిగ్గజాలు సస్పెండ్… అమెరికాలోని భారతీయుల పరిస్థితేంటి?

ఐటీ దిగ్గజాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని షాక్ ఇచ్చారు. హెచ్-1బీ వీసాలపై తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకుగ్రీన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోడానికి అనుమతించే ‘పర్మినెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి సస్పెండ్‌ చేసింది. దీంతో ఈ కంపెనీలకు గ్రీన్ కార్డు కోసం స్పాన్సర్ చేసే అవకాశం లేకుండా పోతోంది. అమెరికన్ల ఉద్యోగాలకు గడి కొడుతున్నారని ఆరోపిస్తున్న ట్రంప్ యంత్రాంగం.. హెచ్-1 బీ వీసా నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబడుతోంది.

22ఏ సమస్యల పరిష్కారంలో కీలక ముందడుగు.. జీవో 59 బాధితులకు ఊరట.. నెలరోజుల్లో పరిష్కారం

0
భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా జీవో 59 దరఖాస్తులపై కీలక నిర్ణయం వెలువడింది. 500 చదరపు గజాల లోపు విస్తీర్ణానికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను నెల రోజుల్లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. భూ రికార్డులు, లబ్ధిదారుల అర్హత, స్థల విస్తీర్ణాన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో అక్రమాలు జరిగిన కేసులతో పాటు ఇప్పటికే కన్వేయన్స్ డీడ్స్ జారీ అయిన వ్యవహారాలను కూడా సమీక్షించనున్నారు. మరోవైపు.. సెక్షన్ 22-ఎ పరిధిలోని రిజిస్ట్రేషన్ సమస్యలు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తులు, నాలా ప్రక్రియకు సంబంధించిన చిక్కుల పరిష్కారంపైనా రెవెన్యూ శాఖ చర్యలు కొనసాగిస్తోంది.

ఇది జెన్‌జీ ట్రెండ్.. లక్ష్మీ ఆంటీ ‘జిమ్ జిమ్ తారా’ వైరల్ పాటతో విద్యార్థుల వినూత్న నిరసన

0
జగిత్యాల మెడికల్ కాలేజీకి శాశ్వత భవనం నిర్మించాలనే డిమాండ్‌తో విద్యార్థులు వినూత్న ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్న ‘జిమ్ జిమ్ తార’ పాటను ఉపయోగించి తమ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో పాటతోపాటు.. ఆ విద్యార్థుల నిరసన కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. జెన్‌జీ ట్రెండ్ ఇదే అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు.. లక్ష్మీ ఆంటీ పాడిన ఈ ‘జిమ్ జిమ్ తార’ పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

చెరువులోకి దిగి ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి.. బట్టలు ఉతికేందుకు వెళ్లి.. సంగారెడ్డిలో తీవ్ర విషాదం

0
సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మనూరు గ్రామ శివారులోని చెరువు వద్ద జరిగిన ప్రమాదం ఒకే కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. బట్టలు ఉతికేందుకు వెళ్లి.. ఒకే కుటుంబంలోని ఇద్దరు పురుషులు, ఒక మహిళ వెళ్లి.. నీటిలో మునిగి మృతి చెందారు. స్థానికులు వారిని బయటకు తీసి.. ఆ మహిళను ఆసుపత్రికి తరలించినప్పటికీ కాపాడలేకపోయారు. ఒకే ఫ్యామిలీలో ముగ్గురి మరణంతో మనూరు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు.

ట్యాంక్‌బండ్‌పై అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు వద్దు.. యువతకు సీపీ సజ్జనార్ వార్నింగ్

0
హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ బహిరంగ ప్రదేశాల్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంపై సీపీ సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి, ఆమె బంధువు మృతి చెందిన నేపథ్యంలో ఆయన ఈ సూచనలు చేశారు. ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖలతో కలిసి భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై వేడుకలు నిషేధమని, జీహెచ్‌ఎంసీ ఆదేశాలు అమల్లో ఉన్నాయని సజ్జనార్ గుర్తుచేశారు. యువత, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, రాత్రివేళ రోడ్లు, సరస్సులు, పార్కుల వద్ద వేడుకలు జరపకుండా సహకరించాలని కోరారు.

సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా డిమాండ్.. బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఇదే..! మరి వైసీపీ సంగతేంటి?

0
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండగా.. ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం స్థానంలో ఉంది. అయితే జాతీయ స్థాయి సమస్యల పట్ల ఈ రెండు పార్టీలు విభిన్న పంథాను అనుసరిస్తున్నాయి. సర్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న వేళ.. సీఈసీ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అక్టోబర్ 10న హైదరాబాద్‌లో ఎన్నికల సంఘం ఆఫీస్ ముందు ఆందోళనలకు సిద్ధపడుతోంది. ఢిల్లీ స్థాయిలోనూ ఆందోళనలను చేపట్టాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. మరోవైపు వైసీపీ సైలెంట్‌గా పరిస్థితులను గమనిస్తోంది.

చట్టపరంగా కుదరకపోతేనేం.. పార్టీ పరంగా న్యాయం చేస్తాం: బీసీల రిజర్వేషన్లపై టీడీపీ కీలక ప్రకటన

స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై టీడీపీ వెనక్కి తగ్గేది లేదంటుంది. చట్టపరంగా అమలు చేయలేకపోయినా.. పార్టీ పరంగా అమలు చేస్తామని కీలక ప్రకటన చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. స్థానిక పోరులో బీసీలకు 34 రిజర్వేషన్లను వైసీపీ కోర్టులకు వెళ్లడం ద్వారా అడ్డుకుందని విమర్శించింది. ఆది నుంచి మేమే బీసీలకు మేలు చేస్తున్నామని టీడీపీ పేర్కొంది. ఎప్పుడూ బీసీలకు టీడీపీ అండగా ఉంటుందని వెల్లడించింది.