తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండగా.. ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం స్థానంలో ఉంది. అయితే జాతీయ స్థాయి సమస్యల పట్ల ఈ రెండు పార్టీలు విభిన్న పంథాను అనుసరిస్తున్నాయి. సర్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న వేళ.. సీఈసీ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అక్టోబర్ 10న హైదరాబాద్‌లో ఎన్నికల సంఘం ఆఫీస్ ముందు ఆందోళనలకు సిద్ధపడుతోంది. ఢిల్లీ స్థాయిలోనూ ఆందోళనలను చేపట్టాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. మరోవైపు వైసీపీ సైలెంట్‌గా పరిస్థితులను గమనిస్తోంది.


