Home Blog Page 189

ఏపీలో నిరుద్యోగులకు వినాయక చవితి కానుక.. ఈ నెల 15న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రాథమిక నోటిఫికేషన్‌

0
AP Govt To Release Job Recruitment Preliminary Notification: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ఈ నెల 15న ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఏపీపీఎస్సీ అక్టోబరు మొదటి వారంలో పూర్తిస్థాయి ప్రకటన చేయనున్నారు. జులై 1 నాటికి ఉన్న వయసు పరిగణనలోకి తీసుకుంటారు. గ్రూప్‌-1 సర్వీసెస్‌ నియామకాల జాబితాను ప్రభుత్వం సవరించింది. షార్ట్ నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య, దరఖాస్తులు, షెడ్యేల్ వివరాలను విడుదల చేయనున్నారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలో చేనేతలకు శుభవార్త.. నిబంధన తొలగింపు, కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు లైన్ క్లియర్

0
Ap Govt Removed Rule For Nethanna Bharosa: ఏపీలో చేనేతలకు కూటమి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నేతన్న భరోసా పింఛన్ పథకం దరఖాస్తు ప్రక్రియలో కీలక నిబంధన నుంచి సీఎం చంద్రబాబు సర్కార్ మినహాయింపు ఇచ్చింది. ఇకపై పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే చేనేతలు బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్‌ సమర్పించాల్సిన అవసరం లేదు. నేతన్నలు దరఖాస్తు ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయాయి. మాస్టర్‌ వీవర్‌ ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుంది.

ఏపీలో వినాయక మండపాలకు 9 రోజల పాటూ ఉచితంగా విద్యుత్.. మంత్రి కీలక ప్రకటన

0
Andhra Pradesh 9 Days Free Power For Ganesh Mandapams: వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో నిర్వహించుకునేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న వినాయక మండపాలు, పందిళ్లకు ఉచిత విద్యుత్ అందించాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది. 9 రోజుల పాటూ ఉచితంగా విద్యుత్ అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవచ్చు. ప్రజలందరు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

తొలి టెస్టు, 9వ స్థానంలో బ్యాటింగ్.. 9 సిక్సర్లతో చెలరేగిన పాకిస్థాన్ టెయిలెండర్..

0

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్ యంగ్ ప్లేయర్ రజావుల్లా ఖాన్ సిక్సర్ల తుఫాన్‌తో సంచలనం సృష్టించాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే 9వ స్థానంలో వచ్చి 63 బంతుల్లో 9 సిక్సర్లు, 4 ఫోర్లతో 81 పరుగులు బాదాడు. తద్వారా టెస్టుల్లో డెబ్యూ మ్యాచులో గడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సౌథీ రికార్డును సమం చేశాడు. రజావుల్లా రాణించడంతో పాక్.. రెండో ఇన్నింగ్స్‌లో 449 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ముందు 130 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.

భారత్ vs పాక్ మ్యాచ్ లేనట్లే.. ఫైనల్ చేరిన శ్రీలంక.. టోర్నీ నుంచి పాకిస్థాన్ ఔట్..!

0

ఉమెన్స్ ఆసియా కప్ 2026 రెండో సెమీఫైనల్లో శ్రీలంక జట్టు 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 1305 పరుగులు చేయగా, శ్రీలంక 18.4 ఓవర్లలోనే 1346 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఆఖర్లో నిలాక్షికా సిల్వా (18*), కౌశాని (10*) ధాటిగా ఆడి మ్యాచ్‌ను ముగించారు. ఆదివారం జరగనున్న ఫైనల్లో భారత్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన శ్రీలంక తలపడనుంది.

సీఎస్కేలో వాటా కొనుగోలుకు ధోనీ ప్రయత్నం.. అసలు నిజమిదే..!

0

సీఎస్‌కే ఫ్రాంచైజీలో వాటా కొనుగోలుకు ధోనీ యత్నించారనే వార్తలను యాజమాన్యం ఖండించింది. అయితే గతంలో ప్రైవేట్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసిన 1 లక్షకు పైగా షేర్లు ఆయన వద్ద ఉన్నాయని తెలిపింది. వాటి విలువ ప్రస్తుతం రూ.2.6 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య ఉంటుందని పేర్కొంది. ఇది ఫ్రాంచైజీ మొత్తం షేర్లలో చాలా స్వల్ప భాగం. ప్రస్తుతం యూఎస్‌లో ఉన్న ధోనీ సెప్టెంబర్ 22న తిరిగొచ్చాక, సీఎస్‌కే కొత్త హెడ్ కోచ్ ఎంపికపై మేనేజ్‌మెంట్‌తో కీలక భేటీ నిర్వహించనున్నాడు.

చరిత్ర సృష్టించిన లేడీ సెహ్వాగ్..!

0

ఉమెన్స్ ఆసియా కప్ 2026 సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 64 పరుగులతో మెరిసిన షఫాలీ వర్మ అరుదైన రికార్డు సాధించింది. 2026 క్యాలెండర్ ఇయర్‌లో మహిళల టీ20ఐలలో భారత్ తరఫున అత్యధిక పరుగులు (593 రన్స్, 151.67 స్ట్రైక్ రేట్) చేసిన బ్యాటర్‌గా స్మృతి మంధాన (590)ను అధిగమించింది. ఈ విజయంతో భారత్.. ఫైనల్ చేరింది. సెప్టెంబర్ 13న తుది పోరు జరగనుంది. శ్రీలంక, పాక్ జట్ల మధ్య జరిగే సెమీస్‌లో గెలిచిన జట్టు భారత్‌తో తలపడనుంది.

2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడతారా..? రోహిత్ రియాక్షన్ ఇదే..!

0

2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటంపై టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ స్పందించాడు. 2027 అక్టోబర్ ఇంకా చాలా దూరంలో ఉందని, ఆ సమయంలోనే దాని గురించి ఆలోచిస్తానని పేర్కొన్నాడు. మరోవైపు రోహిత్ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. ఇంగ్లాండ్‌పై 138 పరుగుల సెంచరీతో రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, అనవసర ఊహాగానాలు వద్దని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో భారత్ వన్డే సిరీస్ ఆడనుంది.

బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్థాన్ ఆరాటం.. ఏళ్లకిందటే దరఖాస్తు, రష్యా, చైనా మద్దతున్నా దక్కని ప్రవేశం.. ఎందుకంటే?

ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు 2023లోనే బ్రిక్స్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న పాకిస్థాన్‌కు ఏళ్లు గడుస్తున్నా నిరాశే ఎదురవుతోంది. గతేడాది ఈజిప్ట్, ఇరాన్ వంటి కొత్త దేశాలకు సభ్యత్వం లభించినప్పటికీ.. కూటమిలో భారత దేశానికి ఉన్న వీటో అధికారం కారణంగా ఇస్లామాబాద్ అభ్యర్థన పెండింగ్‌లోనే ఉండిపోయింది. చైనా, రష్యాల మద్దతు ఉన్నప్పటికీ భారత్ అభ్యంతరం వల్ల పాకిస్థాన్‌కు ప్రవేశం దక్కడం లేదు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

అహంకారానికి, బెదిరింపులకు తలొగ్గేది లేదు.. అమెరికాకు ఇరాన్ అధ్యక్షుడి స్ట్రాంగ్ వార్నింగ్

Masoud Pezeshkian Comments In Delhi: బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్.. అమెరికాను మరోసారి హెచ్చరించారు. బెదిరింపులకు పాల్పడే వారికి ఇరాన్ ఎన్నటికీ తలొగ్గదన్నారు పెజెష్కియన్. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌లు ఢిల్లీలో సమావేశమయ్యారు. బ్రిక్స్ సమావేశాల సమయంలో ఇరు దేశాధినేతల భేటీ ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో ఇద్దరు దేశాధినేతలు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.