బ్రిక్స్ దేశాల 8వ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సదస్సుకు చైనా, రష్యా, బ్రెజిల్ వంటి ప్రపంచ దేశాధినేతలు హాజరయ్యారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఎక్కడకు వెళ్లిన తన కారునే వెంట తెచ్చుకుంటారు. అత్యంత భద్రత కలిగిన ఈ వాహనం గురించి ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ఓరస్ సెనాట్ ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. కోర్టేజ్ ప్రాజెక్టులో భాగంగా ఈ కారును తయారుచేయగా.. 2018 నుంచి పుతిన్ వినియోగిస్తున్నారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఇది సక్రమంగా పనిచేస్తుంది.
USలో హెచ్1 బీ, ఇతర వర్క్ వీసా హోల్డర్లకు షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగింపు?
US Proposed TO End 60 Days Grace Period For H1B Visa: అమెరికాలో హెచ్1బీ, కొన్ని ఇతర తాత్కాలిక వర్క్ పర్మిట్ వీసాలకు సంబంధించి కీలక నిర్ణయం దిశగా అడుగులుపడుతున్నాయి. హెచ్1బీ వీసాలు ఉన్నవారు ఉద్యోగం ముగిసిన వెంటనే అమెరికాని విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించిన ప్రణాళికాబద్ధమైన నియమ మార్పు ప్రకారం ఈ మార్పులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
10x రూల్ కాదు.. సరైన ‘టర్మ్’ ఇన్సూరెన్స్ లెక్కించేందుకు HLV పద్ధతి బెస్ట్.. నిపుణుల సూచనలివే!
Term Insurance: అనుకోని సంఘటన జరిగినప్పుడు కుటుంబానికి ఇన్సూరెన్స్ అండగా ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. తమ ఆదాయానికి 10 రెట్లు ఎక్కువ మొత్తం కవర్ ఉండేలా 10x రూల్ పాటిస్తుంటారు. అయితే, దాంతో సరైన టర్మ్ కవర్ ఎంచుకోలేమని ఇన్సూరెన్స్ నిపుణులు చెబుతున్నారు. తమ జీవన ప్రమాణాలు, భవిష్యత్తు లక్ష్యాల ఆధారంగా సరైన టర్మ్ ఇన్సూరెన్స్ లెక్కించేందుకు హెచ్ఎల్‌వీ పద్ధతి సరైనదిగా సూచిస్తున్నారు. మరి ఈ హ్యూమన్ లైఫ్ వాల్యూ పద్ధతి ఎలా పని చేస్తుంది అనేది ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి.. ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య?
బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమెకు వరుసకు సోదరడయ్యే నిహాల్ ముఖర్జీ కుమార్తె అనుమానాస్పద రీతిలో చనిపోయారు. తన ఇంటిలోనే ఆమె శవమై కనిపించారు. అయితే, ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత నెలలో టీఎంసీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ పార్టీ ఆఫీసులోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
అమెరికా గ్రీన్ కార్డ్ కోసం భారతీయులు 179 ఏళ్లు నిరీక్షించాల్సిందే.. చైనీయులకు మాత్రం పాతికేళ్లే.. కారణం ఇదే
హెచ్-1బీ వీసాపై అమెరికా వెళ్లిన విదేశీయులు.. అక్కడ శాశ్వత నివాసం ఉండాలంటే గ్రీన్ కార్డు తప్పనిసరి. అమెరికా చట్టం ప్రకారం.. ఏడాది 1.40 లక్షల గ్రీన్ కార్డులను జారీచేస్తారు. దరఖాస్తుదారులు అన్ని అర్హత ప్రమాణాలను అందుకుంటేనే కార్డు వస్తుంది. అయితే, గ్రీన్ కార్డు కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూపులు తప్పడం లేదు. తాజాగా, వెల్లడయిన ఓ నివేదిక ప్రకారం.. అక్కడ ఉండే భారతీయులు ఈ ఏడాది దరఖాస్తు చేస్తే.. 179 సంవత్సరాలు పాటు నిరీక్షించే పరిస్థితి నెలకుంది. ఇదే చైనీయులకు మాత్రం 25 ఏళ్లు కావడం విశేషం.

