Mysaa Release Date: రష్మిక మందన్న లీడ్ రోల్లో నటిస్తున్న మైసా మూవీ ఈ ఏడాది నవంబర్ లో థియేటర్లలోకి రానుంది. గతేడాది నవంబర్ లో ది గర్ల్‌ఫ్రెండ్ తో హిట్ కొట్టగా ఈసారి కూడా మరో మూవీతో రాబోతుండటం విశేషం.
ఉద్యోగులకు దసరా ధమాకా.. బోనస్ 3 రెట్లు పెంపు? రూ.7000 నుంచి రూ.21000 పెంచాలని NC-JCM డిమాండ్!
Bonus Ceiling Limit: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు దసరా ధమాకా రానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బోనస్ సీలింగ్ 3 రెట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బోనస్ లెక్కిస్తున్న గరిష్ఠ పరిమితి రూ.7000 కాకుండా 3 రెట్లు పెంచి రూ.21000గా లెక్కించాలని కోరుతూ ఉద్యోగుల జేఏసీ ఎన్‌సీ జేసీఎం డిమాండ్ చేసింది. ఉత్తర్వులు జారీ చేయాలని కేబినెట్ సెక్రెటరికీ వినతులు పంపించింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
‘ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు’ ఎస్‌సిఓ సదస్సులో పాక్ ప్రధానికి మోదీ చురకలు
కిర్గిజిస్థాన్‌లో జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ 26 వ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా, రష్యా అధ్యక్షులు సహా ప్రపంచ దేశాధినేతలు హాజరయ్యారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌కు చురకలు అంటించారు. ద్వంద్వ వైఖరి వీడాలని పిలుపునిచ్చిన ఆయన.. దాని వ్యవస్థను సమూలంగా కూల్చివేయాలని సూచించారు. పాక్ ప్రధాని ఎదురుగానే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, భారత్ విజన్‌ను కూడా ప్రకటించారు.
ఓనం వేడుకల వేళ.. అెమరికాలో ఇద్దరు మలయాళీ మహిళల దారుణ హత్య!
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మిల్పిటాస్‌లో కేరళకు చెందిన ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు అంజన హరి, అన్ మేరీ మాథ్యూలు దారుణ హత్యకు గురయ్యారు. అయితే వీరితో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉండే మరో మహిళనే ఈ హత్యలు చేసినట్లు గుర్తించిన పోలీసులు… ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హత్యలు చేయడానికి కొన్ని రోజుల ముందే వీరు ముగ్గురూ కలిసి సంతోషంగా ఓనం పండుగ జరుపుకోవడం.. కొన్నిరోజుల్లోనే ఇంత దారుణానికి ఒడిగట్టడాన్ని మృతుల కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నారు.
విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్.. పైలెట్లు ఏం చేశారంటే?
గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్యూర్ కావడం తీవ్ర కలకలం సృష్టించింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించి విమానాన్ని యూటర్న్ తీసుకుని వెనక్కి మళ్లించారు. గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించగా.. పైలట్లు 220 మంది ప్రయాణికులతో విమానాన్ని అత్యవసరంగా సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Stock Split: లిస్టయిన 6 నెలల్లోనే ఇలా.. 100 షేర్లు కొంటే 500 షేర్లొస్తాయ్.. రూ.225 నుంచి రూ.45 దిగిరానున్న షేరు ధర..!
Stock Split: స్టాక్ మార్కెట్లోకి లిస్టయిన 6 నెలల కాలంలోనే స్మాల్ క్యాప్ కేటగిరీ కంపెనీ టీసీసీ కాన్సెప్ట్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయాలని నిర్ణయించింది. దీంతో 100 షేర్లు కొంటే 500 షేర్లుగా మారనున్నాయి. అయితే, రూ.225 స్థాయిలో ఉన్న షేరు ధర రూ.45 స్థాయికి దిగిరానుంది. ఈస్టాక్ 2026 ఫిబ్రవరి నెలలోనే లిస్టింగ్ అయింది. మరి ఈ స్టాక్ స్ప్లిట్ గురించిన వివరాలు తెలుసుకుందాం.

