OTT Telugu: తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వదలా ఇప్పుడు రెండో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. శ్రీనివాస్ అవసరాల, జగపతి బాబు, లయలాంటి వాళ్లు నటించిన ఈ మూవీని సెప్టెంబర్ 3 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో చూడొచ్చు.
Janmashtami 2026: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే వేణుమాధవుడి ప్రత్యేక ఆశీస్సులు!
Janmashtami 2026: హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది శ్రావణ మాసం కృష్ణ పక్షంలో అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 04 సెప్టెంబర్ 2026 శుక్రవారం నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోనున్నారు. ఇదే రోజున బలరాముని జయంతి వేడుకలు కూడా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు శ్రీ కృష్ణుడు అర్ధరాత్రి వేళ రోహిణి నక్షత్రం సమయంలో జన్మించాడు కాబట్టి, రాత్రి వేళలో కన్నయ్యకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదిలా ఉండగా.. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శ్రీ కృష్ణాష్టమి వేళ వేణుగోపాలుడి వేడుకల సమయంలో కొన్ని అరుదైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ సమయంలో కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి. ఇలా చేయడం వల్ల కన్నయ్య ప్రత్యేక అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Purchase: బంగారం కొనొద్దని మరోసారి కోరిన పీఎం మోదీ.. విదేశీ పర్యటనలు మానుకోవాలని పిలుపు!
Gold Purchase: అవసరం లేకుండా బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విదేశీ పర్యటనలను కొద్ది నెలలు మానుకోవాలని, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం విదేశాలకు వెళ్లవద్దని కోరారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో మన దేశంపై ప్రభావం పడుతోంది. ముడి చమురు, బంగారం వంటి వాటి కోసం అధికంగా విదేశీ మారక నిల్వలను ఖర్చు చేయాల్సి వస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
అమెరికాలో భారత సంతతి వ్యక్తికి బిగ్ షాక్.. రేప్ కేసు దాచిపెట్టినందుకు 15 ఏళ్ల తర్వాత పౌరసత్వం రద్దు
అమెరికాలో తీవ్ర నేరచరిత్రను దాచిపెట్టి పౌరసత్వం పొందిన భారత సంతతికి చెందిన వ్యక్తికి ఫెడరల్ కోర్టు తీవ్ర షాక్ ఇచ్చింది. న్యూయార్క్‌లో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ.. మహిళా ప్రయాణికురాలిని కత్తితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్‌మీత్ సింగ్ అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మోసపూరితంగా పొందిన పౌరసత్వం నేరస్థులను కాపాడలేదని అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.
ఆయిల్ పామ్ గెలలకు ఆల్‌టైమ్ రికార్డు.. దేశ ఆయిల్ పామ్ చరిత్రలో తొలిసారిగా, రైతుల పంట పండింది
ఆయిల్ పామ్ రైతుల పంట పండింది. ఆయిల్ పామ్ గెలల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. టన్ను గెలల ధర రూ.24,025కు పెరగగా.. దేశ ఆయిల్ పామ్ చరిత్రలో ఇదే అత్యధిక ధరగా అధికారులు పేర్కొన్నారు. జూలైలో రూ.23,783గా ఉన్న ధర ఆగస్టు చివరి నాటికి రూ.242 పెరిగింది. పెరిగిన ధరను ఆగస్టు నెలకు అమలు చేయనున్నట్లు టీజీ ఆయిల్‌ఫెడ్ తెలిపింది. మరోవైపు ఆగస్టులోనే గతంలో ఎన్నడూ లేనంతగా రూ.175 కోట్లను రైతులకు చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు.

