ఉమెన్స్ ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకపై భారత్ 183/5 పరుగుల కొండంత స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు షెఫాలీ వర్మ (68), స్మృతి మంధాన (59) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో 129 పరుగుల శుభారంభం ఇచ్చారు. చివర్లో కమాలిని (15 నాటౌట్) ధాటిగా ఆడటంతో భారత్.. శ్రీలంక ముందు 184 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.
43/5 నుంచి 156/8.. ఆఫ్ఘన్‌ను ఆదుకున్న ఒమర్జాయ్..!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్లు రాణించారు. ఓ దశలోఅర్షదీప్ సింగ్ (3/19) ధాటికి ఆఫ్ఘన్ 43 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. అయితే ఒమర్జాయ్ (64 నాటౌట్) అర్ధశతకంతో రాణించడంతో ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. భారత్ విజయం సాధించాలంటే 157 పరుగులు చేయాల్సి ఉంది. రీఎంట్రీ మ్యాచులో బుమ్రా ఒక వికెట్ తీశాడు.
‘65 మార్కులు.. 7 దశల్లో వెరిఫికేషన్’ అంటూ మెగా డీఎస్సీపై మరోసారి జగన్ ప్రశ్నల వర్షం
ఉపాధ్యాయ నియామకాల కోసం గతేడాది ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్పీపై వైసీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులను అమ్ముకున్నారని, నిబంధనలను మార్చి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని జగన్ ఆరోపిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌లను మాజీ ముఖ్యమంత్రి టార్గెట్ చేసుకున్నారు.
ఏపీలో టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
ఏపీ టెట్ రిజల్ట్స్ వెలువడ్డాయి. జూన్‌లో నిర్వహించిన టెట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న వారు 51 శాతం మంది.. రెగ్యులర్ అభ్యర్థుల్లో 47 శాతం మంది పాస్ అయ్యారు. టెట్ క్వాలిఫై అయిన వారికి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ఏపీ టెట్ పోర్టల్‌తో పాటు వాట్సాప్ ద్వారా కూడా టెట్ రిజల్స్ట్ తెలుసుకునే అవకాశం కల్పించారు. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు ఉపయోగపడనున్నాయి.
నాలుగు దేశాలుగా విడిపోనున్న UK..? రవి అస్తమించిన సామ్రాజ్యంలో ఆఖరి ఘట్టం..!
రవి అస్తమించని సామ్రాజ్యంగా 19వ శతాబ్దంలో ప్రపంచాన్ని శాసించిన యునైటెడ్ కింగ్‌డమ్ ఇప్పుడు నాలుగు ముక్కలు అయ్యే ముప్పును ఎదుర్కొంటోంది. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ స్వాతంత్య్రాన్ని సాధించుకోవడానికి సిద్ధపడుతుండటమే దీనికి కారణం. ఈ క్రమంలోనే ఈ మూడు ప్రాంతాల ఫస్ట్ మినిస్టర్ సోమవారం భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ముగ్గురు ఫస్ట్ మినిస్టర్లు ఒక సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయనున్నారు. ఇటీవల డబ్లిన్ పర్యటనకు వెళ్లిన ట్రంప్ సైతం ఐర్లాండ్ పునరేకీకరణ గురించి మాట్లాడారు.
ఫ్రిజ్ నుంచి నీరు కారుతుందా, మెకానిక్ లేకుండా ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలి?
కొన్నిసార్లు మనం ఫ్రిజ్ ఓపెన్ చేయగానే షెల్ఫ్‌ల నుంచి నీటి చుక్కలు కారుతుంటాయి. దానిని చూడగానే అరె ఇలా అవుతుందని ఓ గుడ్డతో తుడిచి సరిపెట్టేస్తారు. కానీ, అలానే ఉంచకూడదు. నీటిచుక్కలు కారడం అనేది అలానే ఉంచితే అది పెద్ద ప్రాబ్లమ్‌లా మారుతుంది. దీనికి కారణాలని వెతికి పరిష్కారాలని కనుక్కోవాలి.
ఫ్రిజ్ నుంచి నీరు కారడం అనేది చాలా కారణాల వల్ల జరుగుతుంది. కాబట్టి, ముందుగా ఆ సమస్య ఏంటో చూసి దానిని సాల్వ్ చేయాలి. డోర్ రబ్బర్ సీల్ విరిగిపోవడం, టెంపరేచర్ సెట్టింగ్స్ సరిగ్గా లేకపోవడం, డ్రెయిన్ మూసుకుపోవడం, ఆహారాన్ని సరిగ్గా స్టోర్ చేయకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఫ్రిజ్ నుంచి నీరు కారడానికి కారణమవుతుంది. వీటిలో కారణమేంటో ముందుగా చూడాలి. దానిని సాల్వ్ చేస్తే మెకానిక్ లేకుండానే ఫ్రిజ్ లీకేజీని మనం సరిచేయొచ్చు. మరి ఆ కారణాలు ఏంటి? వాటిని ఎలా సరిచేయాలో ఇప్పుడు చూద్దాం.
ఫ్రిజ్ నుంచి నీరు కారడం అనేది చాలా కారణాల వల్ల జరుగుతుంది. కాబట్టి, ముందుగా ఆ సమస్య ఏంటో చూసి దానిని సాల్వ్ చేయాలి. డోర్ రబ్బర్ సీల్ విరిగిపోవడం, టెంపరేచర్ సెట్టింగ్స్ సరిగ్గా లేకపోవడం, డ్రెయిన్ మూసుకుపోవడం, ఆహారాన్ని సరిగ్గా స్టోర్ చేయకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఫ్రిజ్ నుంచి నీరు కారడానికి కారణమవుతుంది. వీటిలో కారణమేంటో ముందుగా చూడాలి. దానిని సాల్వ్ చేస్తే మెకానిక్ లేకుండానే ఫ్రిజ్ లీకేజీని మనం సరిచేయొచ్చు. మరి ఆ కారణాలు ఏంటి? వాటిని ఎలా సరిచేయాలో ఇప్పుడు చూద్దాం.
‘ఏ బిడ్డా ఇది నా అడ్డా’ సొంతగడ్డపై టీ20లలో టీమిండియా రికార్డుల మోత..!
టీ20 క్రికెట్‌లో సొంతగడ్డపై భారత జట్టు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. 2022 నుంచి స్వదేశంలో ఆడిన గత 11 టీ20 సిరీస్‌లు/టోర్నీలలో భారత్ అన్నింటినీ గెలుచుకుని అజేయమైన రికార్డును నమోదు చేసింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌తో పాటు ఆసియా జట్లను ఓడించింది. అంతేకాకుండా స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌ను సైతం గెలుచుకుని హోమ్ కింగ్‌గా ఎదిగింది. తాజాగా అప్ఘాన్‌తో 3 మ్యాచుల టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది.
జావా సముద్రంలో మునిగిన నౌక.. 103 మందిని రక్షించిన అధికారులు.. మరో 140 మంది మిస్సింగ్
ఇండోనేషియాలోని బోర్నియో ద్వీపం సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక మునిగిపోయింది. ఆ నౌకలో సుమారు 240 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈస్ట్ జావా నుంచి దక్షిణ కాలిమంటన్ వైపు వెళ్తున్న సమయంలో జావా సముద్రంలో ఆ నౌకతో అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోయాయి. సముద్రంలో వాతావరణం ప్రతికూలంగా ఉండటంతోనే నౌక గల్లంతయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

