Home Blog Page 180

Weekly Horoscope: ఈ వారం వినాయకుని అనుగ్రహంతో ఏ రాశులకు వృత్తి, ఆర్థిక, ప్రేమ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే?

0
Weekly Horoscope 14 To 20 September: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సెప్టెంబర్ మూడో వారం ప్రారంభంలో అంటే సెప్టెంబర్ 14న వినాయక చవితి రోజున బుధుడు కన్య రాశిలో ఉదయించనున్నాడు. అంతేకాదు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత వృశ్చిక రాశిలో ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. మరోవైపు శుక్రుడు తన సొంత రాశి తులా రాశిలో సంచారం చేయనున్నాడు. సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యరాశిలోకి సంచారం చేయడంతో పాటు కన్య సంక్రాంతి ఏర్పరచనున్నాడు. కుజుడు సెప్టెంబర్ 18న కర్కాటకంలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కొన్ని శుభ యోగాల ప్రభావంతో కొన్నిరాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. సింహం కేతువు, మీన రాశిలో శని తిరోగమనం, కుంభ రాశిలో రాహువు సంచారంతో ద్వాదశ రాశులపై ప్రభావం పడనుంది. ఈ సందర్భంగా ఈ వారం ఏ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి? ఎవరికి సవాళ్లు ఎదురుకానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

IMD alerts : సెప్టెంబర్ 19 వరకు భారీ వర్షాలే.. ఐఎండీ అలెర్ట్! తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే..

0

నైరుతి రుతుపవనాల కదలికలతో దేశవ్యాప్తంగా మళ్లీ వర్షాలు పుంజుకోనున్నాయి. సెప్టెంబర్ 19 వరకు పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది.

ఏపీ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.. బీసీ వసతి గృహాల్లో కేర్‌ టేకర్లుగా!

0
AP Govt BC Welfare Hostels Care Takers Appointment: ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బీసీ వసతి గృహాల్లో కేర్ టేకర్లను నియమించనుంది. మొత్తం వి222 మందిని విద్యార్థుల సంరక్షణ కోసం నియామకం చేపట్టనుంది. ఈ హాస్టల్స్‌లో కేర్ టేకర్లుగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 98 మంది మహిళా పోలీసులు, 124 మంది వీఆర్‌ఏలను నియమించాలని నిర్ణయించారు. త్వరలోనే వీరిని ఈ కేర్ టేకర్ పోస్టుల్లో నియమించనున్నారు.

Vinayaka Chaturthi : వినాయకుడు నేర్పించే ఆర్థిక సూత్రాలు- మీ ఫైనాన్షియల్ విఘ్నాలను ఇలా తొలగించండి..

0

విఘ్ననాథుడి పండుగ కేవలం ఆధ్యాత్మికానికే కాదు, మన ఆర్థిక జీవితాన్ని చక్కదిద్దడానికి గొప్ప మార్గదర్శి! గణపతి రూపం, ఆయన వాహనం నుంచి నేర్చుకోవాల్సిన అద్భుతమైన ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ పాఠాలు ఇవే..

Ganesh Chaturthi 2026 : అలర్ట్- ఈ రోజు స్టాక్​ మార్కెట్​కు సెలవు.. బ్యాంకులకు కూడా

0

Today bank holiday : వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నేడు (సెప్టెంబర్ 14) స్టాక్ మార్కెట్, బ్యాంకు సేవలు బంద్ కానున్నాయి. ఆ వివరాలు..

షుగర్, గుండె సమస్యల గురించే చెప్పే నడుము చుట్టుకొలత, అధికబరువు కంటే చుట్టుకొలత తగ్గడం ఎందుకు ముఖ్యమంటే

0
సాధారణంగా ఎవరైనా మనం ఎంత బరువు ఉండాలో తెలుసుకోవాలనుకుంటే BMI చెక్ చేస్తారు. అయితే BMI కేవలం ఎత్తు, బరువుని మాత్రమే చూస్తుంది. మీ బాడీలో కొవ్వు ఎక్కడ పేరుకుపోతుందో అది గుర్తించదు. దీని గురించి క్లియర్‌గా తెలిపేది కేవలం మీ నడుము చుట్టుకొలత మాత్రమే. సాధారణంగా బరువు ఎంత ఉందో తెలుసుకోవడానికి వేయింగ్ మెషిన్ వాడతాం. ఇక మన హైట్ ప్రకారం ఎంత బరువు ఉండాలో తెలుసుకోవడానికి BMI చెక్ చేస్తాం. అయితే, ఈ రెండు మాత్రం మీ వెయిట్, హైట్ ప్రకారం ఐడియల్ వెయిట్ మాత్రమే చూపిస్తాయి. అలా కాకుండా మనకి ఫ్యూచర్‌లో వచ్చే జబ్బుల గురించి కూడా అలర్ట్ చేసేదే వెయిస్ట్ లైన్. మన నడుము చుట్టుకొలత కొవ్వులో కొంత భాగం, ముఖ్యంగా బెల్లీ చుట్టూ ఎక్కడ ఫ్యాట్ పేరుకుపోయిందో సూచిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Asia Cup 2026: ఆసియాకప్ ఫైనల్లో హైడ్రామా-పాకిస్థానీ మోసిన్ నఖ్వీకి దిమ్మతిరిగే షాకిచ్చిన భారత అమ్మాయిలు-రియల్ ఛాంపియన్స్

0

Asia Cup 2026: ఇండియన్ విమెన్ టీమ్ అదరగొట్టింది. అటు మైదానంలో ఆటతో, బయట తమ దేశభక్తితో అమ్మాయిలు సత్తాచాటారు. మహిళల ఆసియా కప్ 2026లో భారత్ విజేతగా నిలిచింది. కానీ ఆ తర్వాత పాకిస్థానీ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి మన అమ్మాయిలు నిరాకరించారు.

Tata cars : సఫారీ ఈవీ నుంచి అవిన్యా వరకు.. టాటా క్రేజీ లైనప్! లాంచ్​ ఎప్పుడంటే..

0

దిగ్గజ టాటా మోటార్స్ రాబోయే 18 నెలల్లో ఆటోమొబైల్​ మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. టిగోర్ ఫేస్‌లిఫ్ట్, సఫారీ ఈవీతో పాటు 2027లో నెక్సాన్ నెక్ట్స్-జెన్ మోడల్‌ను విడుదల చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

గతేడాది సీన్ రిపీట్.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోని భారత జట్టు..!

0
ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత మహిళల జట్టు విజేతగా నిలిచినప్పటికీ, ట్రోఫీ అందుకోకుండానే వెనుతిరిగింది. ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఏసీసీ వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ అల్ జరూనీతో ట్రోఫీ ఇప్పించాలని భారత్ కోరినా నఖ్వీ తానే ఇస్తానని పట్టుబట్టారు. దీంతో ప్రెజెంటేషన్ వేడుకలో భారత్‌ ట్రోఫీ, మెడల్స్ అందుకోలేదు. సుమారు అరగంట సేపు వేదికపైనే ఉన్న నఖ్వీ.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఏపీలో చిరు వ్యాపారులకు శుభవార్త.. రూ.30వేలు తీసుకోవచ్చు, త్వరపడండి

0
Andhra Pradesh Street Vendors Rs 30000 Credit Cards: ఏపీలో చిరు వ్యాపారులుకు తీపికబురు.. వ్యాపార పెట్టుబడి కోసం రూ.30 వేల వరకు ఇస్తారు. ఈ మేరకు వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు అందించనున్నారు. అంతేకాదు లోక కల్యాణ మేళా పేరుతో స్వనిధి పథకం కింద రుణాలు అందించేలా ప్లాన్ చేశారు. ఈ నెలాఖరు వరకు లోక కల్యాణ మేళాను నిర్వహించనున్నారు. చిరు వ్యాపారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.