Home Blog Page 179

రోడ్ రేజ్ కలకలం- వెంబడించి మరీ మహిళ బైక్​ని ఢీకొట్టిన కారు! రైడర్ల సేఫ్టీ ఎలా?

0

గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై లేడీ బైకర్ సియాపై రోడ్ రేజ్ దాడి జరిగింది. కారుతో ఢీకొట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

ఏపీలో పేదలకు తీపికబురు.. 1.25 లక్షల మందికి ఇళ్లస్థలాలు.. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు

0
AP Govt To Distribute 1.25 Lakhs House Pattas: ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదవారికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మొత్తం 1,24,873 మందికి పట్టాలు ఇవ్వనుంది. ఈ మేరకు మొత్తం 4800 ఎకరాలు సేకరించాలని భావిస్తున్నారు. మొత్తం రూ.1800 కోట్లతో భూ సేకరణ చేయనున్నారు. ఈ మేరకు అక్టోబర్ నవంబర్ నెలలో ఇళ్ల స్థలాల కోసం భూ సేకరణ చేయాలని భావిస్తున్నారు.

Motivational Quote By Devi Chitralekha: దైవాన్ని అడగాల్సింది డబ్బు కాదు, మరేంటో తెలుసా?, దేవీ చిత్రలేఖ జీవిత సత్యం!

0
దేవీ చిత్రలేఖ గొప్ప ప్రవచన కర్త. దేవీ చిత్రలేఖ గారు హర్యానాలోని పల్వాల్ జిల్లాలో జన్మించారు. చాలా చిన్న వయసులోనే ఆమె శ్రీమద్భాగవత కథలు చెప్పడం ప్రారంభించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆమె సానుకూల ఆలోచనలు కూడా ప్రజల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఆమె శ్రీకృష్ణ భగవానుడికి పరమ భక్తురాలు. ఆమె తన ప్రసంగాల ద్వారా ప్రజలకు మానవత్వపు విలువల్ని బోధిస్తారు. ఆమె ప్రవచనాలు కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా, మన జీవితంలోని క్లిష్ట సమయాల్లో సరైన మార్గాన్ని చూపించే జీవన సూత్రాల్ని కూడా అందిస్తాయి.

నడుము చుట్టుకొలతని బట్టి గుండె సమస్యలు, షుగర్ వస్తుందో తెలుసుకోవచ్చట, ఎలా అంటే

0
సాధారణంగా ఎవరైనా మనం ఎంత బరువు ఉండాలో తెలుసుకోవాలనుకుంటే BMI చెక్ చేస్తారు. అయితే BMI కేవలం ఎత్తు, బరువుని మాత్రమే చూస్తుంది. మీ బాడీలో కొవ్వు ఎక్కడ పేరుకుపోతుందో అది గుర్తించదు. దీని గురించి క్లియర్‌గా తెలిపేది కేవలం మీ నడుము చుట్టుకొలత మాత్రమే. సాధారణంగా బరువు ఎంత ఉందో తెలుసుకోవడానికి వేయింగ్ మెషిన్ వాడతాం. ఇక మన హైట్ ప్రకారం ఎంత బరువు ఉండాలో తెలుసుకోవడానికి BMI చెక్ చేస్తాం. అయితే, ఈ రెండు మాత్రం మీ వెయిట్, హైట్ ప్రకారం ఐడియల్ వెయిట్ మాత్రమే చూపిస్తాయి. అలా కాకుండా మనకి ఫ్యూచర్‌లో వచ్చే జబ్బుల గురించి కూడా అలర్ట్ చేసేదే వెయిస్ట్ లైన్. మన నడుము చుట్టుకొలత కొవ్వులో కొంత భాగం, ముఖ్యంగా బెల్లీ చుట్టూ ఎక్కడ ఫ్యాట్ పేరుకుపోయిందో సూచిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

వైఎస్ కుటుంబంలో విషాదం.. YS కమలమ్మ కన్నుమూత, జగన్ సంతాపం

0
Ys Raja Reddy Sister Passed Away: వైఎస్ కుటుంబంలో విషాదం.. వైఎస్సార్ మేనత్త కమలమ్మ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అమెరికాలో తుదిశ్వాస విడిచారు. కమలమ్మ పార్థీవ దేహాన్ని అమెరికా నుంచి పులివెందులకు తీసుకురానున్నారు. వైఎస్సార్‌ సమాధుల తోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కమలమ్మ మరణంపై వైఎస్ జగన్ సంతాపాన్ని తెలియజేశారు. నెలన్నర క్రితం వైఎస్ కుటుంబంలో విషాదం జరిగింది.. వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు ఆనంద్ రెడ్డి కన్నుమూశారు.

విశాఖపట్నం నుంచి ఐటీ కంపెనీలను అమరావతికి తరలిస్తున్నారా.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ

0
Visakhapatnam It Companies Shifted To Amaravati?: విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచి అమరావతికి ఐటీ కంపెనీలను తరలిస్తున్నారని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ అంశం గురించి చర్చ జరిగిందని.. ఐటీ కంపెనీలను అమరావతికి తరలించాలని నిర్ణయించినట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ అంశంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.. స్పష్టత ఇచ్చింది.

రక్తపోటును తగ్గించే 9 ఆహారాలు

0
రక్తపోటును తగ్గించే 9 ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్స్‌ తింటే రక్తనాళాలు ఆరోగ్యంగా మారుతాయి. బీపీ అదుపులో ఉంటుంది.

దుబాయ్‌లో ‘ట్రోఫీ చోర్’ నినాదాలు.. నఖ్వీ పరువు మొత్తం పోయిందిగా..!

0

ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకపై ఘనవిజయం సాధించినా భారత మహిళల జట్టు ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేదు. ప్రెజెంటేషన్ వేడుకకు భారత ఆటగాళ్లు రాలేదు. దీంతో కోపంతో ఉన్న అభిమానులు స్టేడియంలో నఖ్వీని ఉద్దేశించి ట్రోఫీ చోర్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీంతో నఖ్వీ అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. విన్నర్స్ ట్రోఫీ ప్రస్తుతం ఏసీసీ ఆఫీస్‌లోనే ఉండిపోయింది.

ఈ వినాయక చవితికి iPhone 17 Pro కొనాలా? ఇక్కడ భారీ తగ్గింపు..

0

క్రోమా స్టోర్లలో ఐఫోన్ 17 ప్రో ధరపై ఊహించని రాయితీ లభిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్​ఛేంజ్ బోనస్‌లు కలిపితే కేవలం రూ. 69,990 కే ఈ ప్రీమియం ఫోన్ సొంతం చేసుకోవచ్చు. మరోవైపు ఐఫోన్ 18 ప్రో ప్రీ-బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

కుమారుడి పొలిటికల్ ఎంట్రీపై కేశినేని క్లారిటీ.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్న విజయవాడ ఎంపీ

0
Kesineni Sivanath On His Son Contesting In Local Body Elections: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కుమారుడు వెంకట్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన మేయర్ రేసులో ఉన్నారంటూ కొంతమంది పోస్టులు పెట్టారు. ఈ ప్రచారంపై ఎంపీ చిన్ని స్పందించారు. తన కుమారుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. తన కుమారుడు ప్రస్తుతం వ్యాపార కార్యలకలాపాలలో ఉన్నట్లు తెలిపారు విజయవాడ ఎంపీ చిన్ని.