ఇజ్రాయెల్ ప్రధానుల మేకప్, హెయిర్ స్టైలింగ్, దుస్తుల నిర్వహణ కోసం 2019 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.4.49 కోట్లు (4.70 లక్షల ఇజ్రాయెల్ డాలర్లు) ఖర్చు చేసినట్లు ఆ దేశ పీఎంఓ స్పష్టం చేసింది. న్యాయవాది యారా వింక్లర్ షాలిట్ దాఖలు చేసిన పిటిషన్ వల్ల ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇందులో 90 శాతం ఖర్చులు నెతన్యాహు దంపతుల కోసమే వాడగా, గాజా యుద్ధ కాలంలోనూ ఇది కొనసాగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
పాకిస్థాన్‌కు భారీ షాక్.. డబ్ల్యూటీసీలో 11 పాయింట్లు కోత.. ఆటగాళ్ల ఫీజులో 50% కట్..!
ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన చివరి టెస్టులో స్లో ఓవర్ రేట్ పాటించిన పాకిస్థాన్‌కు ఐసీసీ భారీ జరిమానా విధించింది. ఏకంగా 11 ఓవర్లు తక్కువగా వేయడంతో 11 డబ్ల్యూటీసీ పాయింట్ల కోత విధించడంతో పాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ పాయింట్ల శాతం 4.63 శాతానికి పడిపోయింది. ఫలితంగా ఈ టేబుల్‌లో అట్టడుగు స్థానమైన 9వ ప్లేసులో నిలిచి.. ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఎల్ఏసీ వద్ద చైనా సైనిక మోహరింపులు చాలా తగ్గిపోయాయి: రక్షణ శాఖ క్లారిటీ
భారత్-చైనా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా తన సైనిక బలగాలను గణనీయంగా ఉపసంహరించుకున్నట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ తన వార్షిక నివేదికలో పేర్కొంది. గతంలో లద్దాఖ్‌లోనే 60 వేల కంటే ఎక్కువగా ఉన్న పీఎల్‌ఏ దళాలు ఇప్పుడు 40,000 నుంచి 50,000కి తగ్గాయని స్పష్టం చేసింది. మోదీ-జిన్‌పింగ్ చర్చల ఫలంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గి స్థిరత్వం ఏర్పడటంతో పాటు భారత సైనిక పహారా వల్ల జమ్మూ కశ్మీర్‌లో రాళ్ల దాడులు తగ్గి శాంతిభద్రతలు నెలకొన్నాయని వివరించింది..
విరిగిన వెన్నుముకతో 7 వేల అడుగుల ఎత్తైన పర్వతం ఎక్కి.. ఇరాన్‌లో ప్రాణాలతో బయటపడిన యోధుడు
ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడితో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. ఏప్రిల్ నాటికి ఈ యుద్ధం ఉద్ధృతం కాగా.. ఇరాన్ శుద్ధిచేసిన యురేనియం నిల్వలు దాచిపెట్టిన అనుమానిస్తున్న ఇస్పహాన్ పర్వతాల సమీపంలోని రహస్య కేంద్రాలపై దాడికి అమెరికా ప్లాన్ చేసింది. ఏప్రిల్ 2 ఎఫ్-14ఈ యుద్ధ విమానాన్ని పంపింది. ఇంతలోనే ఇరాన్ సైన్యం భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణితో ఆ యుద్ధ విమానాన్ని కూల్చేయగా.. అందులోని ఇద్దరు పైలట్లు కిందకు దూకేశారు. వీరిలో ఒకరు శత్రు భూభాగంలో పడటంతో అతడి కోసం అమెరికా భారీ ఆపరేషన్ చేపట్టింది.
ఏపీలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. సేవలు, సబ్సిడీలకు ఆధార్ తప్పనిసరి కాదు, ఉత్తర్వులు జారీ
AP Aadhaar Is Not Mandatory To Govt Services: ఏపీలో మీసేవలో ప్రభుత్వ సేవలు, పథకాలు పొందడానికి ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కాదని ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ అథెంటికేషన్ ఆప్షనల్ మాత్రమేనని.. ఆధార్ ఇవ్వకపోయినా 246 సేవలను నిరాకరించరాదని ఆదేశించింది. ఈ-కేవైసీ కోసం ఆధార్ తీసుకునే కారణాలు, వివరాల భద్రతపై స్పష్టత ఇవ్వాలని తెలిపారు. అలాగే ప్రభుత్వ సేవల కోసం ఆధార్‌ను స్వచ్ఛంద ప్రాతిపదికన స్వీకరించాలని పేర్కొంది.

