చైనా ఆటోమొబైల్ దిగ్గజం బీవైడీ తన ప్రీమియం బ్రాండ్ ‘డెంజా’ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. విలాసవంతమైన డెంజా డీ9 ఎంపీవీతో పాటు ఏకంగా 1,156 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేసే డెంజా జెడ్9 జీటీ ఎలక్ట్రిక్ సూపర్‌కార్ త్వరలోనే దేశీయ రహదారులపై సందడి చేయనుంది. ఆ వివరాలు..
తనిఖీలు లేకుండానే విమానం ఎక్కేసిన విదేశీయులు.. ఎయిర్ ఇండియాకు కేంద్రం షోకాజ్ నోటీసులు
ముగ్గురు ఇటలీ పౌరులు ఎలాంటి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి జర్మనీలోని మ్యూనిచ్‌కి ప్రయాణించిన తీవ్ర భద్రతా లోపంపై కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెప్టెంబర్ 3, 4వ తేదీల మధ్య అమృత్సర్ నుంచి ఢిల్లీ వచ్చిన విదేశీయులను పొరపాటుగా ఐ-టు-ఐ ట్రాన్స్‌ఫర్ ఏరియాకు తరలించడం వల్ల ఈ పొరపాటు జరిగిందని స్పష్టం చేస్తూ.. వివరణ కోరింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో ఎన్నికల సందడి.. యాజమాన్య కమిటీల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
AP School Management Committees Elections Notification: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ , నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న కమిటీల గడువు గతంలోనే పూర్తికాగా.. కొత్త కమిటీల ఎన్నికలు నిర్వహించేందకు సిద్ధమయ్యారు. ఈ నెల 18న ఓటర్ల జాబితాను విడుదల చేసి.. ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు కమిటీ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్‌లను కూడా ఎన్నుకోనున్నారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
న్యూయార్క్ సబ్‌వేలో ఘోర ప్రమాదం: రైలు కిందపడి భారత సంతతి యువతి, ఆమె స్నేహితుడు మృతి.. వీడియో వైరల్
న్యూయార్క్ లోయర్ మన్‌హ్యాటన్‌లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్‌వే స్టేషన్‌లో రైలు కిందపడి భారత సంతతికి చెందిన మలైకా చిత్రే (24), నేపాల్ సంతతి నవమ్ కౌల్ (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పట్టాలపై పడిన స్నేహితుడిని కాపాడే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. రూట్‌జర్స్ యూనివర్సిటీలో కలిసి చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన ఈ ఇద్దరు యువతీయువకులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది.
“అవును.. మా పెళ్లికి పుతిన్ స్నేహితుడు లక్షల డాలర్లు ఖర్చు చేశారు”: జూనియర్ ట్రంప్ భార్య
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ తన వివాహ వేడుకల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు, అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ హెడ్ ఉమర్ క్రెమ్లెవ్ నుంచి లక్షలాది డాలర్ల నిధులు పొందినట్లు ధ్రువీకరించారు. బహమాస్‌లో జరిగిన వేడుకలను క్రెమ్లెవ్ అద్భుతంగా నిర్వహించారని, ఈ కానుకకు రుణపడి ఉంటామని ట్రంప్ దంపతులు తెలిపగా, ఇరాన్ ఉద్రిక్తతల దృష్ట్యా భద్రతా కారణాలతో ప్రెసిడెంట్ ట్రంప్ ఈ పెళ్లికి హాజరుకాకపోవడం గమనార్హం.
Motivational Quotes By Gautam Gambhir: ” వ్యక్తిగత రికార్డులు కాదు, ట్రోఫీలే ముఖ్యం!”, గంభీర్ నేర్పే దూకుడు మంత్రం
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గ్రౌండ్ లోపల, బయట దూకుడుగా ఉంటారు. ఆ దూకుడుతోనే టీమిండియాకు మరుపురాని విజయాలన్నందించాడు. దిగ్గజాల టైమ్‌లో ఆడటంతో అనుకున్నంత పేరు రాలేదు. కానీ, గౌతీ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియాకు పొట్టి ప్రపంచకప్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌ని అందించాయి. టీమిండియా హెడ్ కోచ్‌గా ఆయన తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వచ్చినా గౌతమ్ గంభీర్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. వ్యక్తిగత రికార్డుల కన్నా టీమిండియాకు మెగా ట్రోఫీలు అందించడమే అసలైన లక్ష్యమని నమ్మే గౌతమ్ గంభీర్ నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.

