HomeEntertainmentఓటమి నేర్పిన పాఠం.. తిరుగులేని పునరాగమనం... మెగాస్టార్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఆ ‘8 నెలలు’!

ఓటమి నేర్పిన పాఠం.. తిరుగులేని పునరాగమనం… మెగాస్టార్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఆ ‘8 నెలలు’!

వరుస పరాజయాలతో మెగాస్టార్ శకం ముగిసిందంటూ విమర్శకులు పెదవి విరిచిన వేళ, చిరంజీవి ఎనిమిది నెలల పాటు షూటింగులకు దూరంగా ఉండి తీవ్ర ఆత్మపరిశీలన చేసుకున్నారు. మూస మాస్ కథలకు స్వస్తి పలికి, 1997 సంక్రాంతికి భావోద్వేగాల మేళవింపుగా వచ్చిన ‘హిట్లర్’ చిత్రంతో వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇచ్చారు. పడిలేచిన కెరటంలా బాక్సాఫీస్‌పై విరుచుకుపడి అఖండ విజయాన్ని అందుకున్నారు. ఆ విజయోత్సాహంతోనే ‘మాస్టర్’, ‘బావగారు బాగున్నారా’, ‘చూడాలని ఉంది’ వంటి విభిన్న చిత్రాలతో సరికొత్త ఫార్ములాను ఆవిష్కరించి తిరుగులేని అగ్రపీఠాన్ని సుస్థిరం చేసుకున్నారు. కెరీర్‌లో ఎదురైన గడ్డుకాలమే ఆయనను మరింత బలంగా నిలబెట్టింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments