సాధారణంగా కూరగాయలతో వంట చేస్తే తినాలనిపించదు. కానీ, వాటిని మనం సరిగ్గా చిన్నగా చాప్ చేసి వాటితో సూప్ చేసుకుంటే బాగుంటుంది కదా. పైగా అందులో కొన్ని హెర్బ్స్ కలిపితే మనల్ని వేధించే జలుబు, దగ్గు సమస్యలు కూడా దూరమవుతాయి కూడా. హ్యాపీగా మీకు నచ్చిన కూరగాయల్ని ఇందులో వేసుకోవచ్చు. కూరగాయలన్నింటినీ ఒక్కసారిగా కట్ చేసి పెట్టుకుంటే చాలు క్షణాల్లో ఈ సూప్ చేసేయొచ్చు. సాధారణంగా రెస్టారెంట్‌లో దీనినే హాట్ అండ్ సోర్ సూప్ అని వందలు పెట్టి కొంటుంటారు. కాస్తా ఓపికగా చేస్తే మీకు మీరుగానే ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.


