దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ పీజీ డాక్టర్‌గా తెలంగాణకు చెందిన కొయ్యల రూత్ జాన్ పాల్ ఘనత సాధించారు. ఎమర్జెన్సీ మెడిసిన్‌లో పీజీ పూర్తి చేసి అరుదైన ఘనత సాధించారు. సాధారణ ఆర్థిక పరిస్థితుల మధ్య పెరిగిన ఆమె, కుటుంబ నిరాకరణ, ఆకలి బాధలు, సామాజిక వివక్ష వంటి ఎన్నో సవాళ్లను దాటి.. పీజీ వైద్య విద్యలో ప్రవేశానికి సంబంధించిన అడ్డంకులను అధిగమించేందుకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేశారు. చివరకు సనత్‌నగర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ఎండీ పూర్తి చేసి వైద్యురాలిగా ఎదిగారు. సీపీ సజ్జనార్ ఆమెను సత్కరించి ప్రశంసించారు.


