కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ మంత్రి సీతక్కను హైదరాబాద్‌లో కలిశారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారిక నివాసంగా ఉపయోగించిన భవనంలో ప్రస్తుతం సీతక్క ఉంటుండగా.. అక్కడ తన తండ్రి వైఎస్సాఆర్ చిత్రపటాన్ని చూసిన షర్మిల భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. సీతక్క ఆమెను ఆప్యాయంగా ఓదార్చడంతోపాటు వైఎస్సార్‌తో షర్మిల ఉన్న ఫొటోను బహూకరించారు. అనంతరం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులకు కూడా వివాహ ఆహ్వాన పత్రిక అందించారు.


