విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన స్లాషర్ థ్రిల్లర్ ‘కల్ట్’. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. అందరూ అనుకున్నట్టుగానే దీనికి ‘A’ సర్టిఫికేట్ వచ్చింది. అక్టోబర్ 30న ఈ సినిమా విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో ‘అర్నబ్’ తుపాను పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో, బాధితులకు అండగా నిలుస్తూ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు విశ్వక్ సేన్ ప్రకటించారు. గురువారం ప్రెస్ మీట్‌తో పాటు రిలీజ్ ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.
Cult Movie Censor: విశ్వక్ సేన్ ‘కల్ట్’ మూవీకి ‘A’ సర్టిఫికెట్.. అర్నబ్ తుపాను నేపథ్యంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు
RELATED ARTICLES


