ఢిల్లీలోని అగ్ని ప్రమాదం జరిగింది. పార్లమెంటు ఆవరణలోని నార్త్ బ్లాక్‌లో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. భవనం పైకప్పుపై ఉన్న ఏసీ బాయిలర్ సమీపంలో మరమ్మతులు, వెల్డింగ్ పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దట్టమైన నల్లటి పొగ కనిపించడంతో అధికారులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే 6 ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దించగా.. మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోను ఎంపీ మిలింద్ దేవరా ట్వీట్ చేశారు.


