టైగర్ ష్రాఫ్ కారుపై ముంబైలో జరిగిన కాల్పుల కేసు బాలీవుడ్ సెలబ్రిటీల భద్రతపై తీవ్ర ఆందోళనను పెంచింది. నిందితులు మొదట అమిర్‌ఖాన్ ఇంటి వద్ద రెక్కీ చేశారని.. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భద్రతను గమనించిన తర్వాత ప్లాన్ మార్చుకున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా టైగర్ ష్రాఫ్ ఫుట్‌బాల్ ఆడేందుకు వెళ్లే ప్రాంతాన్ని గుర్తించి దాడికి ప్రణాళిక రచించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బిష్ణోయ్ గ్యాంగ్‌తో అనుమానితుల సంబంధాలు, అమిర్ ఖాన్‌ను ఉద్దేశించి ప్రచారంలోకి వచ్చిన బెదిరింపు మెసేజ్‌లపై పోలీసులు విచారణ చేస్తున్నారు.


