బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల ఘటనలో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరో కీలక పురోగతి సాధించారు. ఈ విచారణలో భాగంగా ప్రధాన సూత్రధారి అనిల్ పండిట్ ఆదేశాల మేరకు దాడికి వ్యూహరచన చేసి అమలు పరిచిన 22 ఏళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా హోల్డర్ ప్రంజల్ థక్రాల్ను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శుక్రవారం అరెస్ట్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ముడిపడిన ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 11 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


