HomeEntertainmentFauzi Netaji Controversy: ‘బాహుబలి’ నుంచి ‘ఫౌజీ’ వరకు… వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ప్రభాస్ సినిమాలు!

Fauzi Netaji Controversy: ‘బాహుబలి’ నుంచి ‘ఫౌజీ’ వరకు… వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ప్రభాస్ సినిమాలు!

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ వ్యక్తిగతంగా నిరాడంబరుడైనప్పటికీ ఆయన సినిమాలు మాత్రం తరచూ తీవ్ర వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ‘బాహుబలి’లోని పాట చిత్రీకరణతో మొదలైన విమర్శలు.. ‘ఆదిపురుష్’లో రామాయణ పాత్రల రూపకల్పన, ‘కల్కి 2898 ఏడీ’లో కర్ణుడి ఎలివేషన్‌పై మతపరమైన అభ్యంతరాల వరకు వెళ్లాయి. తాజాగా ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను హీరో ఎలివేషన్‌కు వాడటంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడుతూ దర్శకుడు క్షమాపణ చెప్పాలన డిమాండ్ చేశారు. ఇక సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే ‘స్పిరిట్’పైనా ఇప్పుడే చర్చ మొదలైంది. దేశవ్యాప్త స్టార్‌డమ్ ఉన్న ప్రభాస్ చారిత్రక, సున్నితమైన కథల ఎంపికలో మరింత జాగ్రత్త వహించాలని సినీ వర్గాలు సూచిస్తున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments